(Source: ECI/ABP News/ABP Majha)
Hyperpigmentation: మొటిమలతో విసిగిపోయారా? ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే ఇట్టే తగ్గిపోతాయి
మొటిమలు చాలా మందిలో వస్తాయి. కొందరిలో వెంటనే పోతాయి, మరికొందరికి మాత్రం వేధిస్తాయి.
టీనేజీ రాగానే మొటిమలు రావడం సహజం. కానీ కొందరిలో మాత్రం అదో వ్యాధిలా తీవ్రంగా వచ్చేస్తాయి. చీము కూడా పట్టేస్తాయి. దీన్నే హైపర్ పిగ్మేంటేషన్ అంటారు. కొన్ని సార్లు ఈ సమస్య తీవ్రమైనప్పడు వైద్యపరమైన సహాయం కూడా అవసరం పడుతుంది. కొంతమందికి ఈ హైపర్ పిగ్మెంటేషన్ విషయంలో ఏం చేయాలో తెలియక ఎలాంటి చికిత్స తీసుకోకుండా అలాగే ఉండిపోతారు. కొన్ని ఇంటి చిట్కాల ద్వారా వీటి తీవ్రతను తగ్గించుకోవచ్చు.
ఎందుకు వస్తుంది?
చర్మంలో పిగ్మెంటేషన్ అధికంగా ఏర్పడటానికి కారణం మెలనిన్. చర్మంలో మెలనిన్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు ఆ ప్రాంతం ముదురు రంగులోకి మారుతుంది. దీన్నే హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. దీనికి కారణం అంతర్లీనంగా ఉండే ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా కావచ్చు. దీనికి ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు. అధిక మెలనిన్ ఉత్పత్తికి సూర్యరశ్మి లేదా కొన్మి కాస్మొటిక్స్, సబ్బులు ఉపయోగించడం కూడా కారణం కావచ్చు.
కొన్కి చిట్కాలు
1. కలబంద రసాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అధికంగా ఉన్న ప్రాంతంలో రాయాలి. దీనిలో అలోయిన్ ఉంటుంది. ఇది మొటిమలు రావడాన్ని తగ్గిస్తుంది.
2. పాలు, పాల ఉత్పత్తులలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మంపై పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది. పాలను మొటిమల మీద అప్లయ్ చేస్తూ ఉండాలి.
3. టోమోటాలను మెత్తగా పేస్టులా చేసి రాసుకోవాలి. ఈ పండ్లలో లైకోపీన్ ఉంటుంది. ఇది చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది.
4. ఎర్ర కందిపప్పును మసూర్ దాల్ అంటారు. దీన్ని నీటిలో నానబెట్టి బాగా నానాక మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఈ పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెలనిన్ ఉన్న ప్రాంతాలపై సమర్థవంతగా పనిచేస్తుంది. మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.
5. బంగాళాదుంప ముక్కలను గుండ్రంగా కోసి మొటిమలున్న చోట రుద్దాలి. ఓ అయిదు నిమిషాలు ఆ ముక్క అక్కడలా ఉంచాలి. తరువాత తీసి శుభ్రం చేసుకోవాలి.
6. తరచూ ఐస్ క్యూబ్స్ తో రుద్దుతూ ఉండాలి. నేరుగా పెట్టులేకపోతే ఒక క్లాత్ లో చుట్టి మొటిమలున్న చోట రుద్దాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: ఎబోలా వైరస్‌లాగే మార్బర్గ్ కూడా ప్రాణాంతకమే, గబ్బిలాల ద్వారానే వైరస్ వ్యాప్తి
Also read: చారు పొడి కొనుక్కుంటున్నారా? ఇలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు