అన్వేషించండి

Supplements: ఈ సప్లిమెంట్స్‌ను పొరపాటున కూడా కలిపి తీసుకోవద్దు, ప్రాణాలకే ప్రమాదం

ఆహారం ద్వారా తగిన మొత్తంలో పోషకాలు అందకపోతే కొంతమంది వాటిని భర్తీ చేసుకునేందుకు సప్లిమెంట్ల మీద ఆధారపడతారు.

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి పోషకాల అవసరం చాలా ఎక్కువ. విటమిన్లు, ప్రోటీన్లు, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి అనేక స్థూల, సూక్ష్మ పోషకాలు శరీర పనితీరుకి ముఖ్యమైనవి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం సమతుల్య ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలు అందుతాయి. అయితే ఆహారం ద్వారా పొందలేకపోయిన కొన్ని అదనపు పోషకాలు అనేక ఉత్పత్తులు, మాత్రలు, క్యాప్స్యుల్స్ పౌడర్ లేదా ద్రవ పదార్థంలో తీసుకోవచ్చు. కానీ వైద్యుల సలహా పాటించకుండా ఎప్పుడూ సప్లిమెంట్ట్స్ తీసుకోకూడదు. కొన్ని సప్లిమెంట్స్ కలిపి తీసుకోవడం వల్ల అనారోగ్యాల బారిన పడతారు. వాటిలో ఒకటి ఐరన్, కాల్షియం సప్లిమెంట్లు జతగా ఎప్పుడు తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అవి ఆరోగ్యానికి ప్రమాదకరం.

ఎందుకు తీసుకోకూడదు?

శారీరక విధులకు ఇనుము, కాల్షియం రెండూ చాలా ముఖ్యమైనవి. శరీరం మొత్తం ఆక్సిజన్ సరఫరా సాఫీగా చేయడంలో ఇనుము ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే మెదడు పనితీరు, ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థని పెంచుతుంది. కాల్షియం ఎముకలు, దంతాలు ధృడంగా ఉండేందుకు ముఖ్యమైనది. కానీ ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల తీవ్రమైన జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. ఈ రెండు బలమైన సప్లిమెంట్లు ఒకదానికోకటి శోషణని నిరోధించగలవు. ఐరన్ లోపం రక్తహీనత అభివృద్ధికి కారణమవుతుంది. కాల్షియం, ఐరన్ జత చేసి తీసుకుంటే అలసట, నీరసంగా అనిపించడం, ఊపిరి ఆడకపోవడం, గుండె దడకు కూడా దారితీస్తుంది.

అనీమియా అంటే ఏంటి?

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం శరీర కణజాలాలకు ఆక్సిజన్ తీసుకెళ్లాడానికి ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు లేదా హిమోగ్లోబిన్ సరిపడా లేనప్పుడు రక్తహీనత ఏర్పడుతుంది. ఎర్ర కణాలలో ఉండే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ ను శరీరంలోని అన్నీ ఇతర అవయవాలకు చేరవేస్తుంది. ఇది రెండు రూపాలుగా ఉంటుంది. దీర్ఘకాలిక, స్వల్పకాలిక్ పరిస్థితులు రెండూ రావచ్చు. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కాల్షియం, ఐరన్ తీసుకోవడం ఎలా?

కాల్షియం, ఐరన్ సప్లిమెంట్లు ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అయితే వాటిని వేర్వేరు సమయాల్లో తీసుకుంటేనే ప్రయోజనాలు శరీరానికి సరిగా చేరతాయి. ఒకటి తీసుకున్న కొన్ని గంటల వ్యవధితలో మరొక సప్లిమెంట్ తీసుకోవచ్చు. అప్పుడే శరీరానికి ఉపయోగపడే విధంగా ఎటువంటి ఆటంకం లేకుండా పని చేస్తాయి. మధ్యాహ్న భోజనంలో కాల్షియం తీసుకుంటే రాత్రి సమయంలో ఐరన్ సప్లిమెంట్ ఉండేలా చూసుకుంటే మంచిది. అసలు వీటి అవసరం రాకుండా ఉండాలంటే కాల్షియం అధికంగా ఉండే డైరీ ఉత్పత్తులు, ఇతర ఆహారాలు డైట్లో భాగం చేసుకుంటే సరిపోతుంది.

 గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: మొక్కల ఆధారిత ఆహారం వల్ల వచ్చే దుష్ప్రభావాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget