అన్వేషించండి

Lucky Food: మీ వంటింట్లో ఉండే ఈ చిట్టి పదార్థం అదృష్టాన్ని తెచ్చేస్తుందండోయ్!

ఈ మసాలా దినుసు వంటలకి రుచి, సువాసన ఇవ్వడమే కాదు మీకు అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది.

ఏ పని తలపెట్టినా కలిసి రావడం లేదని, అదృష్టం లేదని చాలా మంది పూజలు చేయడం చూస్తూనే ఉంటారు. కుటుంబ శ్రేయస్సు, సంతోషం కోసం ఏదైనా దోషాలు ఉంటే దోష పూజలు, హోమాలు, యజ్ఞాలు అని హిందువులు ఎక్కువగా గుళ్ళు, గోపురాలు అని తిరుగుతూ ఆచారాలు పాటిస్తారు. కానీ మీ అదృష్టం తెచ్చే పదార్థం మీ వంటింట్లోనే ఉందంటే నమ్ముతారా? చూసేందుకు చిన్నగా ఉన్నా అదృష్టం మాత్రం తెస్తుందట. అదేంటి అని ఆలోచిస్తున్నారా? అదే లవంగం.  

భారతీయ గృహిణులు ఎక్కువగా మసాలాగా ఉపయోగించే లవంగం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా గృహ నివారణాలు, మందులు, దంత, జుట్టు సంరక్షణ ఉత్పత్తుల్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ చిన్న మసాలా మీకు అదృష్టం ఎలా తెస్తుందా అని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే.. 

హిందూ సంప్రదాయం ఏం చెప్తోంది?

హిందూ విశ్వాసాల ప్రకారం లవంగం సాంప్రదాయకంగా అనేక ఆచారాలు, పండుగలలో ఉపయోగిస్తారు. ఇది చెడు దృష్టి పడకుండా చేస్తుంది. అందుకే నవరాత్రుల్లో దుర్గాదేవికి నైవేద్యంగా ఒక జత లవంగాలు పెడితే జీవితంలో సుఖసంతోషాలు లభిస్తాయని నమ్ముతారు.

లవంగం నమలాలి

ఒక ముఖ్యమైన చర్చ లేదా వ్యాపార ఒప్పందానికి ముగించేటప్పుడు లేదా ఏదైనా మంచి పనికి వెళ్తున్నప్పుడు లవంగం నమిలితే విజయం లభిస్తుందని పెద్దలు అంటారు. అలా చేయడం వల్ల మనం అనుకున్న పని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విగ్నంగా జరుగుతుంది. విజయం సాధిస్తారు.

సంపద ఇస్తుంది

లక్ష్మీ దేవిని పూజించేటప్పుడు ప్రతిరోజు ఎర్రగులాబీలతో పాటు రెండు లవంగాలు కూడా నైవేద్యంగా సమర్పించడం ద్వారా అదృష్టం, డబ్బు కలసి వస్తాయని నమ్మకం. ప్రతి రోజు ఇలా చెయ్యడం కూడరాకపోతే శుక్రవారం పూట అయిన ఇలా చేస్తే ఆర్థికంగా బాగుంటారు.

బయటకి వెళ్ళే ముందు

ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళేముందు నోట్లో రెండు లవంగాలు ఉంచుకోవడం వల్ల ఆ రోజంతా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉంటుంది. ఏవైనా అవాంతరాలు వచ్చినా తొలగిపోతాయాని నమ్ముతారు.

చెడు దృష్టి పారిపోతుంది

శనివారాల్లో నూనె దీపంలో మూడు, నాలుగు లవంగాలు వేసి వెలిగించి ఇంట్లోని ఒక చీకటి మూల పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంటి మీద పడే చెడు దృష్టి తొలగిపోతుందని పెద్దలు చెబుతారు. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది.

ఆరోగ్యపరంగాను..

లవంగాలు అదృష్టం తెచ్చే వాటిగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నొప్పులు తగ్గించుకునేందుకు లవంగాల నూనె కూడా ఉపయోగిస్తారు. ఇది రాసుకోవడం వల్ల ఎంతటి నొప్పి అయినా తక్షణమే రిలీఫ్ ఇస్తుంది. పిప్పి పన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది లవంగాలు కాల్చి నొప్పి ఉన్న ప్రదేశంలో పెడతారు. ఇలా చేయడం వల్ల అక్కడ ఉన్న బ్యాక్టీరియా నశించడంతో పాటు నొప్పి కూడా తగ్గుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also read: బరువు తగ్గేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ పిండితో చేసిన రోటీలు ట్రై చేయండి

టాప్ హెడ్ లైన్స్

Sperm Quality And Stress : యువకుల్లో ఒత్తిడి పెరిగితే స్పెర్మ్ క్వాలిటీ దెబ్బతింటుందా? డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే..
యువకుల్లో ఒత్తిడి పెరిగితే స్పెర్మ్ క్వాలిటీ దెబ్బతింటుందా? డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే..
Eating Habits for Kids : పిల్లలకు హెల్తీ ఫుడ్స్ అలవాటు చేయడం ఎలా? తల్లిదండ్రులు పాటించాల్సిన చిట్కాలు ఇవే
పిల్లలకు హెల్తీ ఫుడ్స్ అలవాటు చేయడం ఎలా? తల్లిదండ్రులు పాటించాల్సిన చిట్కాలు ఇవే
H1N1 Flu Risk in Offices : ఆఫీసులో పెరుగుతోన్న H1N1 ఫ్లూ ముప్పు.. ఈ చిన్న తప్పులే వైరస్ వ్యాప్తికి కారణమట, జాగ్రత్త
ఆఫీసులో పెరుగుతోన్న H1N1 ఫ్లూ ముప్పు.. ఈ చిన్న తప్పులే వైరస్ వ్యాప్తికి కారణమట, జాగ్రత్త
Sleep Poorly in New Places : 'First Night Effect' అంటే ఏమిటి? కొత్త ప్రదేశాలలో నిద్రపోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతుందో తెలుసా?
'First Night Effect' అంటే ఏమిటి? కొత్త ప్రదేశాలలో నిద్రపోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతుందో తెలుసా?

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
Nara Lokesh: మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
IND VS SL 2nd Test Day 4 UPdates: సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
Mukesh Gowda: 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
YS Jagan Press Meet Highlights:
"రైతు, బీసీ ఛాంపియన్స్ మేమే" వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
Embed widget