Weight Loss: బరువు తగ్గేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ పిండితో చేసిన రోటీలు ట్రై చేయండి
బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు ఎక్కువగా ఎంచుకునేది ఓట్స్. కానీ అవే కాదు ఈ రకరకాల పిండితో చేసుకునే రోటీలు తిని కూడా బరువు తగ్గొచ్చు.
ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉండే పిండి గోధుమ లేదా మైదాపిండి. వీటికి పంచదార లేదా బెల్లం జోడించి నోరూరించే తీపి పదార్థాలు కూడా చేసుకోవచ్చు. అన్ని రకాలుగా ఉపయోగపడే ఈ పిండితో బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు రోటీ, చపాతీ, పరోటా, రొట్టెలు ఇలా రకరకాల పదార్థాలు తయారు చేసుకుని తింటారు. వెయిట్ లాస్ కోసం ప్రయత్నించే వాళ్ళు తప్పనిసరిగా పిండి ఉపయోగిస్తారు. అయితే ఒక్క గోధుమ పిండితో మాత్రమే కాదు.. ఇతర ఆరోగ్యకరమైన పిండితో చేసిన వంటకాలు తిని కూడా బరువు అదుపులో ఉంచుకోవచ్చు.
సజ్జలు
సజ్జలు లేదా బజ్రా అత్యంత పోషకాలు నిండిన పిండి. గోధుమ రొటీలకి బదులుగా సజ్జ పిండి కూడా ఉపయోగించవచ్చు. బజ్రా రోటీ బరువు తగ్గించడంతో పాటు డయాబెటిక్ రోగులకి చాలా మంచిది. ఇది తక్కువ GI కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మెరుగైన జీర్ణక్రియ ఇవ్వడంతో పాటు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్‌ల నుంచి రక్షిస్తుంది. గోధుమ రోటీలాగానే కూరగాయలు, ఆకుకూరలతో కలిపి రోటీ తయారు చేసుకోవచ్చు. అయితే గోధుమ రోటీ కంటే సజ్జలతో చేసిన రోటీలు కొంచెం గట్టిగా ఉంటాయి. కానీ బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి.
ఓట్స్
బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు ముందుగా ఎంచుకునేది ఓట్ మీల్. అద్భుతమైన పోషకాలని అందిస్తుంది. ఓట్స్ గ్లూటెన్ రహితంగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఓట్స్ బరువు తగ్గడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ఓట్స్ మిక్సీ చేసుకుని పిండిగా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. వీటితో రోటీలు చేసుకుని తినొచ్చు. ప్యాక్ చేసిన ఓట్స్ పిండి బయట దుకాణాల్లో కూడా లభిస్తుంది.
క్వినోవా
క్వినోవాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫోలేట్, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి పోషకాలు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. కవనవ్వా ఫైబర్ రిచ్ ఫుడ్ కావడం వల్ల పేగులని ఆరోగ్యంగా ఉంచుతుంది. గట్ లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు సహాయపడుతుంది. అధిక ఫైబర్ ఆహారం ఆరోగ్యకరమైన శరీర బరువు నిర్వహించడానికి సహకరిస్తుంది. గోధుమ రోటీతో పోల్చుకుంటే క్వినోవా రోటీలోనే అధికంగా కేలరీలు ఉంటాయి.
బేసన్ పిండి లేదా చిక్ పా పిండి
దీన్నే శనగపిండి అని కూడా పిలుస్తారు. ఇది శుద్ధి చేసిన గోధుమ పిండికి అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువ. ఉదర వ్యాధి, గోధుమ అలెర్జీలు ఉన్నవారికి ఇది చాలా మంచిది. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత చికిత్సకు సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
జొన్నపిండి
జొన్న పిండి గ్లూటెన్ రహితం. ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్లు అధికంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనితో కూడా రొటీలు చేసుకోవచ్చు. వాటితో కొద్దిగా కష్టం అనిపిస్తే కొంచెం గోధుమ పిండి కలుపుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also read: హెయిర్ స్ట్రెయిటనింగ్ ఉత్పత్తుల వల్ల గర్భాశయ క్యాన్సర్? హెచ్చరిస్తున్న కొత్త అధ్యయనం