Condoms Rate: అక్కడ టీవీ కంటే కండోమ్స్ ధరే ఎక్కువ, సామాన్యులకు ఆ ‘రక్షణ’ కరువే!
ఆ దేశంలోకి వెళ్తే.. సూట్‌కేసులో దుస్తులతోపాటు కండోమ్స్ కూడా పట్టుకెళ్లాలి. పొరపాటున మరిచిపోతే.. జేబుకు చిల్లే!
కండమ్ ధర తక్కువా? లేదా టీవీ ధరా? వాటిలో ఏది చీప్ అని అడిగితే ఏం చెబుతారు? వెంటనే ‘కండమ్’ అని సమాధానం ఇస్తారు. అంతేందుకు, కండోమ్ కావాలంటే వందల, వేలు ఖర్చు పెట్టా్ల్సిన అవసరం కూడా లేదు. ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది. అయితే, ఆ దేశంలో మాత్రం కండోమ్ కొనాలంటే సామాన్యులు ఆస్తులు అమ్ముకోవాలి. లేదా నెల జీతాన్ని ఖర్చు పెట్టేయాలి.
వెనిజులాకు వెళ్తున్నట్లయితే.. తప్పకుండా మీ వెంట కండోమ్ ప్యాకెట్లను తీసుకెళ్లండి. లేకపోతే, అడ్డంగా బుక్కైపోతారు. ఎందుకంటే.. అక్కడ ఒక సాధారణ కండోమ్ ప్యాకెట్ ధర రూ.60 వేలు వరకు ఉంది. అందులో 36 కండోమ్‌లు ఉంటాయి. సాధారణ కండోమ్‌లే అంత ధర ఉంటే.. ఫ్లేవర్స్, డాట్స్ రకాలకు చెందిన కండోమ్‌లు ఇంకెంత ధర ఉంటాయో మీరు అర్థం చేసుకోవచ్చు.
గర్భ నిరోధం, ఎయిడ్, సుఖ వ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు కండోమ్‌లను ఉచితంగా అందిస్తున్నాయి. అంతేగాక, కండోమ్‌ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా అవగాహన కల్పిస్తున్నాయి. అయితే, వెనిజులా ప్రభుత్వం మాత్రం.. వాటితో మాకు పనేంటి అన్నట్లు వ్యవహరిస్తోంది. దీంతో కండోమ్ సంస్థలు పండుగ చేసుకుంటున్నాయి.
ఎందుకంత ధర?: కండోమ్‌లు అంత ధర పలికేందుకు ఆస్కారమే ఉండదు. కానీ, ఆ దేశంలో ఎందుకంత ధర పలుకుతున్నాయనే సందేహం మీకు కలిగే ఉండవచ్చు. ఎందుకంటే.. వెనిజులాలో యుక్తవయసులో గర్భం దాల్చే టీనేజర్లు ఎక్కువ. ప్రభుత్వం కూడా అబార్షన్‌పై నిషేధం విధించింది. ఎవరైనా అబార్షన్ చేయడానికి సాహసిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. దీంతో ఆ దేశంలో కండోమ్‌లు కనుగోలు చేసేవారి సంఖ్య పెరిగింది. దీన్ని అక్కడి కండోమ్ సంస్థలు బాగా సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రభుత్వం కూడా చూసీచూడనట్లు వ్యవహరించడంతో వారు పెట్టిందే ధర అవుతోంది.
Also Read: వీర్య దానంతో డబ్బే డబ్బు, ఇలా చేస్తే మీరూ సంపాదించవచ్చు!
సంపన్నులకు రూ.60 వేలు పెట్టి కండోమ్ ప్యాకెట్లు కొనుగోలు చేయడం పెద్దగా కష్టం కాకపోవచ్చు. కానీ, సామాన్యుడికి రూ.60 వేలు అంటే.. దాదాపు ఒక ఏడాది మొత్తం కష్టపడితే వచ్చే సొమ్ముతో సమానం. మధ్యతరగతి ఉద్యోగులకు దాదాపు వారి నెల జీతంలో సగం. కనీసం ఒక సాధారణ కండోమ్ కొనాలన్నా సుమారు రూ.1600 వరకు వెచ్చించాలి. దీంతో అక్కడి ప్రజలు తమ ‘కోరిక’లను వాయిదా వేసుకుంటున్నారు.
Also Read: ఇట్స్ బాయ్ థింగ్, అబ్బాయిలూ ఉదయాన్నే అలా జరక్కపోతే, త్వరగా చచ్చిపోతారట!