Stomach Cancer: ముఖంపై కనిపించే ఈ లక్షణం ఉదర క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు
ఉదర క్యాన్సర్ లక్షణం ముఖంపై కూడా కనిపిస్తాయిట. ఆ లక్షణం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
కొంత మంది పొట్ట క్యాన్సర్ అని, ఉదర క్యాన్సర్ అని పిలుస్తారు. మరికొంతమంది గ్యాస్టిక్ క్యాన్సర్ అంటారు. ఇవన్నీ ఒక్కటే. పొట్ట లోపలి పొరపై అసాధారణంగా కణాలు పెరుగుతాయి. అవే పుండులా మారి క్యాన్సర్ గా రూపాంతరం చెందుతాయి. ఈ క్యాన్సర్ విషయంలో చాలా మందికి అవగాహన లేదు. పొట్ట క్యాన్సర్ ప్రారంభ దశలోనే కొన్ని అరుదైన హెచ్చరిక సంకేతాలను పంపిస్తుంది. కానీ వాటిని చాలా మంది పట్టించుకోరు.దాని వల్లే వ్యాధి ముదిరాకే క్యాన్సర్ బయటపడుతుంది. ఏదైనా లక్షణం హఠాత్తుగా లేదా అసాధారణంగా బయటపడితే దాన్ని తేలికగా తీసుకోవద్దు.
అరుదైన చర్మవ్యాధి
గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చిన వారిలో అరుదైన చర్మ వ్యాధి కలుగుతుంది. దాన్ని పాపులోరిథ్రోడెర్మా ఆఫ్ ఓఫుజీ అంటారు. చైనీస్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం దాదాపు శరీరమంతా, ముఖ్యంగా ముఖంపై ఈ చర్మ వ్యాధి కనిపిస్తుంది. ముఖంపై చిన్నగా గడ్డలు వస్తాయి. వాపు, ఆ ప్రాంతంలో చర్మం రాలిపోవడం వంటివి జరుగుతాయి. ఇది చర్మంతో పాటూ లింఫ్ నోడ్స్ పై కూడా ప్రభావం చూపుతుంది. చర్మం దురదగా మారుతుంది. ఈ పరిస్థితిని ఎవరూ ఉదర క్యాన్సర్ కు సంకేతంగా భావించరు. ఏదైనా చర్మ వ్యాధి వచ్చిందేమో అనుకుని వదిలేస్తారు. ఇలా మీకు చర్మంపై గడ్డలు కనిపిస్తే వెంటనే క్యాన్సర్ వైద్యులను సంప్రదించాలి.
ఇతర లక్షణాలు
అరుదైన చర్మ పరిస్థితులతో పాటూ మరికొన్ని లక్షణాలను కూడా ప్రదర్శిస్తుంది గ్యాస్టిక్ క్యాన్సర్. ఆకలి వేయకపోవడం, హఠాత్తుగా బరువు తగ్గిపోవడం, పొట్ట నొప్పి, పొత్తికడుపులో వాపు రావడం, అసౌకర్యంగా అనిపించడం, గుండెల్ల మంట, అజీర్ణం, వికారం, వాంతులు వంటివి కలుగుతాయి. ఒక్కోసారి రక్తంతో కూడిన వాంతులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. హిమోగ్లోబిన్ చాలా వరకు తగ్గిపోవడం కూడా పొట్ట క్యాన్సర్ సంకేతమే. కాస్త ఆహారం తిన్నా కూడా పొట్ట నిండిపోయిన భావన కలుగుతుంది.
పొట్ట క్యాన్సర్ ఒక్కసారిగా రాదు.కొన్నేళ్లుగా అభివృద్ధి చెందుతుంది. క్యాన్సర్ కణితులు పెరగడానికి ముందే పొట్ట లోపలి పొరలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ ప్రారంభ మార్పులు చూపించే అరుదైన లక్షణాలు చాలా మేరకు గుర్తించలేము. అంతేకాదు ఈ క్యాన్సర్ కణితులు పొట్టలో ఏ ప్రాంతంలో వచ్చాయి అనేదానిపై కూడా లక్షణాలు ఆధారపడి కనిపిస్తాయి.
ఎందుకు వస్తుంది?
అరవై ఏళ్లు పైబడిన వారిలోనే అధికంగా ఉదరక్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కుటుంబచరిత్రలో ఎవరికైనా ఉన్నా కూడా వచ్చే ఛాన్సు ఉంది. ఉప్పు అధికంగా ఉండే ఆహారం తీసుకున్నా, ఊరగాయలు అధికంగా తిన్నా, స్మోకీ ఫుడ్స్ అంటే నిప్పులపై కాల్చిన ఆహారాన్ని అధికంగా తిన్నా, పండ్లు, కూరగాయలు తినడం బాగా తగ్గించినా కూడా పొట్ట క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ.
అలాగే పొట్టకు శస్త్రచికిత్స జరిగిన వారిలో, ఊబకాయం, ధూమపానం, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్న వారిలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
రాకుండా ఉండాలంటే...
తాజా పండ్లు, కూరగాయలు మీ ఆహారంలో ఉండేట్టు చూసుకోవాలి. ధాన్యపు ఆహారాలైన అన్నం, రొట్టెలు, పప్పులు వంటివి అధికంగా తినాలి. ఆల్కహాల్ తాగకూడదు. టోమటో వంటకాలు మితంగా తినాలి. ఉప్పు నిండిన ఆహారాలు, ఊరబెట్టిన ఆహారాలు చాలా మితంగా తినాలి. అధికంగా మొక్కల ఆధారిత ఆహారం తినడం వల్ల ప్రాణాంతకమైన పొట్ట క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా మేరకు తగ్గుతుంది.
Also read: Viral: ‘అందరికీ వాన పడుతోంది, మాకే లేదు’ అంటూ కోపంతో అతనిపైనే కేసు పెట్టిన రైతు, వైరల్ అయిన ఫిర్యాదు
Also read: ఈ కోడిగుడ్ల నిండా యాంటీబాడీలే, కొత్తగా ఉత్పత్తి చేసిన శాస్త్రవేత్తలు, ఇవి తింటే కరోనా నుంచి సేఫ్