ఈ రెస్టారెంట్ సిబ్బంది చాలా తేడా, అమర్యాదతో విసిగిస్తారు, బిల్లు ముఖాన్న కొడతారు, ఇంకా ఎన్నో..
ఈ రెస్టారెంట్‌లో సిబ్బంది మీకు కోపం తెప్పించేందుకు ప్రయత్నిస్తారు. అమర్యాదగా ప్రవర్తిస్తారు. కానీ, మీకు ఇక్కడ కడుపూ నిండటమే కాదు.. కడుపు పుబ్బా నవ్వుకుంటూ మాంచి ఫీల్‌తో ఇంటికెళ్తారు.
ఒక రెస్టారెంట్‌కు మంచి పేరు రావాలంటే.. కేవలం ఆహారం రుచిగా ఉంటే సరిపోదు. అక్కడి సిబ్బంది కూడా కస్టమర్లతో మర్యాదగా వ్యహరించాలి. లేకపోతే.. ఎవరూ తిరిగి ఆ రెస్టారెంట్ వైపు చూడరు. అందుకే, చాలా రెస్టారెంట్లలో సిబ్బంది ఎంతో సౌమ్యంగా, మర్యాదగా ఉంటారు. కస్టమర్లు ఎంత విసిగించినా సహనంతో భరిస్తారు. చిరునవ్వుతో వడ్డిస్తారు. ఏమైన సమస్య ఉంటే సరిదిద్దుకుంటామని చెబుతారు.
అయితే, ఆస్ట్రేలియాలో ఉన్న ఈ రెస్టారెంట్ ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. మర్యాద, గౌరవాన్ని ఆశించేవాళ్లు.. అస్సలు ఈ రెస్టారెంట్‌కు వెళ్లకూడదు. ఒకవేళ వెళ్తే.. అవమానంతో తిరిగి వస్తారు. ఇక జన్మలో ఆ రెస్టారెంట్‌కు వెళ్లకూడదని అనుకుంటారు. అదేంటీ.. అలా చేస్తే ఆ రెస్టారెంట్‌కే నష్టం కదా. అలాంటి అనాగరిక సిబ్బందితో రెస్టారెంట్ ఎలా నడుపుతున్నారనేగా మీ సందేహం. ఎందుకంటే.. ఆ రెస్టారెంట్ థీమే అది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ, బ్రిస్బేన్, మెల్‌బోర్న్‌లో ఉన్న ‘కరేన్స్ డైనర్’కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడికి వచ్చే కస్టమర్లతో అమర్యాదగా ప్రవర్తించడమే వీరి స్పెషాలిటీ. కస్టమర్లను ఆగ్రహానికి గురిచేయడమే వీరి పని. ‘మీ కోపాన్ని వెళ్లగక్కేందుకు ఇక్కడి రండి’ అనేది వారి ట్యాగ్‌లైన్. అయితే, ఆహారం రుచి విషయంలో ఈ రెస్టారెంట్ రాజీ పడదు. కానీ, వడ్డించే విధానమే కాస్తా రూడ్‌గా ఉంటుంది. రెస్టారెంట్‌లో అడుగు పెట్టగానే అక్కడి సిబ్బంది మిమ్మల్ని విసుగ్గా చూస్తారు. మెను కార్డును టేబుల్ మీదకు విసురుతారు. వడ్డించేప్పుడు కూడా సౌమ్యంగా ఉండారు. ఒక్కోసారి మీ పక్క సీట్లోనే కూర్చొని మీ గురించి వెయిటర్స్ తప్పుడు గాసిప్స్ మాట్లాడుకుంటారు. ఇక్కడ మేనేజర్‌కు కంప్లయింట్ చేసినా ఫలితం ఉండదు. ఎందుకంటే.. అక్కడి సిబ్బంది పనే అది కాబట్టి.
Also Read: సైలెంట్‌గా ఉండేవారు అంత డేంజరా? ఈ కారణాలు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు!
సాహసోసేపతమైన ఈ థీమ్‌ను ఇప్పుడు కస్టమర్లు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లు తమ కోపాన్ని వెళ్లగక్కడానికి ఇదో మంచి ప్లేస్ అని అనుకుంటున్నారు. ఇక్కడి సిబ్బందిని ఎంత తిట్టినా పట్టించుకోరు. పైగా మరింత కోపాన్ని రగిలిస్తారు. ఇది కూడా ఒకరకంగా మంచిదే. కోపాన్ని బయటకు కక్కేయడం వల్ల మనసు తేలికపడుతుంది. ఆ తర్వాత ఆహారం కూడా ప్రశాంతంగా తినేయొచ్చు. ఆ తర్వాత అక్కడి సిబ్బంది ఎన్ని కోతి చేష్టలు చేసినా.. కోపం రాదు. ఈ రెస్టారెంట్‌లో చాలామంది కోపాన్ని కక్కేందుకే కాదు. కడుపుబ్బా నవ్వడానికి కూడా వస్తుంటారు. అక్కడి సిబ్బంది వింత ప్రవర్తన అలా ఉంటుంది. వారి డ్రామాలు చూస్తే.. ఓరి వీళ్ల వేషాలో అనిపిస్తుంది. ఈ రెస్టారెంట్‌కు వస్తున్న ఆధారణను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు దీన్ని యూకేలో కూడా ప్రారంభిస్తున్నారు. కరేన్ అనే పేరు గల కస్టమర్లకు ఉచితంగా సర్వ్ చేస్తామని కూడా ప్రకటించారు. మరి, ఇలాంటి రెస్టారెంట్ మన ఇండియాలో ఉంటే??
View this post on Instagram
Also Read: నగ్నంగా నిద్రపోతే ఇన్ని ప్రయోజనాలా? పరిశోధకులు ఏమంటున్నారు?