Hair Thinning : జుట్టు రాలిపోతూ.. పలుచగా మారుతోందా? కారణాలు, హెయిర్ డెన్సిటీ పెంచుకునే చిట్కాలు ఇవే
Hair Getting Thinner : జుట్టు పలుచబడటం చాలామందిని ఇబ్బంది, ఆందోళనకి గురిచేస్తుంది. అందుకే దీనికి కారణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు. అవేంటో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.

- జుట్టు పలుచబడటానికి ఒత్తిడి, పోషకాహార లోపం, హార్మోన్ల మార్పులు కారణాలు.
- ప్రోటీన్ ఆహారం, ఒత్తిడి తగ్గించుకోవడం జుట్టు ఆరోగ్యానికి అవసరం.
- అధిక స్టైలింగ్ మానుకొని, సమస్య ఎక్కువైతే నిపుణులను సంప్రదించాలి.
Thinning Hair and Excessive Hair Fall : జుట్టు రాలడం మాత్రమే కాదు.. జుట్టు పలుచగా మారడం, స్కాల్ప్ ఎక్కువగా కనిపించడం, జుట్టు గతంలో ఉన్నంత ఒత్తుగా లేకపోవడం కూడా చాలామందిని ఇబ్బంది పెడతాయి. ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, హార్మోన్లలో మార్పులు, హెయిర్ స్టైలింగ్‌లో భాగంగా తరచూ కెమికల్స్, హీట్ ఉపయోగించడం వంటి కారణాలతో జుట్టు నాణ్యత దెబ్బతింటూ ఉంటుంది.
జుట్టు పలుచబడుతోందని కనిపించిన ప్రతిసారీ అది పూర్తిగా జుట్టు రాలిపోవడాన్ని సూచించదని నిపుణులు చెప్తున్నారు. కొన్నిసార్లు జుట్టు విరిగిపోవడం, తాత్కాలికంగా ఎక్కువగా రాలడం లేదా పోషకాహార లోపాలు కూడా జుట్టు పలుచగా కనిపించడానికి కారణం అవుతాయి అంటున్నారు. అందుకే ముందుగా చిట్కాలు ఫాలో అయ్యే ముందు కారణాన్ని గుర్తించడం ముఖ్యమని చెప్తున్నారు.
Also Read : మెంతులు, కొబ్బరిపాలతో హెయిర్ మాస్క్.. జుట్టు పలుచగా ఉంటే తప్పక ట్రై చేయండి
హెయిర్ డెన్సిటీ..
స్కాల్ప్‌పై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయనేదే హెయిర్ డెన్సిటీని సూచిస్తుంది. డెన్సిటీ తగ్గితే జుట్టు పలుచగా, ఫ్లాట్‌గా కనిపిస్తుంది. అయితే జుట్టు డెన్సిటీ తగ్గడానికి ఒకే ఒక్క కారణం ఉండదు. జుట్టు రాలడం, హెయిర్ బ్రేకేజ్, ఒత్తిడి, పోషకాహార లోపాలు వంటి అనేక అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెప్తున్నారు.
జుట్టు పలుచగా మారడానికి కారణాలు..
ఒత్తిడి ఎక్కువకాలం ఉండటం వల్ల కొంతమందిలో జుట్టు రాలడం పెరగవచ్చు. ఇది హెయిర్ షెడ్డింగ్‌కు కారణమవుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉండలాంటే శరీరానికి తగినంత ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్లు వంటి పోషకాలు అవసరం. రోజువారీ ఆహారంలో ఇవి సరిగ్గా అందకపోతే జుట్టు బలహీనంగా మారి రాలడం జరుగుతుంది. నిద్ర అనేది మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో పాటు.. జుట్టు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
Also Read : జుట్టు ఎక్కువగా ఊడుతోందా? ఐరన్ లోపానికి ఇవే సంకేతాలు.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
జుట్టు ఒత్తుగా పెరగాలంటే చేయాల్సిన పనులు ఇవే
జుట్టు ప్రధానంగా కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. గుడ్లు, పప్పులు, శనగలు, పెరుగు, పాలు, చేపలు లేదా ఇతర ప్రోటీన్ ఆహారాలు డైట్లో చేర్చుకోవచ్చు. జుట్టు పలుచగా మారుతోందని చాలామంది వెంటనే బయోటిన్, ఒమేగా-3 లేదా ఇతర హెయిర్ సప్లిమెంట్స్ తీసేసుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికీ సప్లిమెంట్స్ అవసరం ఉండదు. పోషక లోపం ఉంటే.. వైద్యుల సూచనతో తగిన సప్లిమెంట్ తీసుకోవడం మంచిది.
పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, నిద్రలేమి వంటివి మానసిక ఆరోగ్యాన్నే కాదు.. రోజువారీ జీవనశైలిని కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి యోగ, మెడిటేషన్, వాకింగ్ వంటి ఒత్తిడిని తగ్గించే అలవాట్లు చేసుకోండి. అలాగే స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచుకోవడం, జుట్టు రకానికి సరిపోయే మైల్డ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం మంచిది. స్కాల్ప్ మసాజ్ కూడా మంచి ఫలితాలు ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది. జుట్టు పొడిబారడం, బ్రేకేజ్ తగ్గించడంలో కొబ్బరి నూనె హెల్ప్ చేస్తుంది. రోజ్‌మేరీ ఆయిల్ కూడా జుట్టు పెరుగుదలకు మంచిది.
Also Read : మందార పువ్వు, కొబ్బరి పాలుతో హెయిర్ ప్యాక్.. జుట్టు రాలడాన్ని తగ్గించి మెరుపును పెంచుతుందా?
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తరచూ హెయిర్ స్ట్రెయిటెనింగ్, కర్లింగ్, బ్లీచింగ్, కెమికల్ ట్రీట్‌మెంట్స్ చేయడం, ఎక్కువ వేడి ఉపయోగించడం వల్ల జుట్టు దెబ్బతిని విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని తరచూ చేయకూడదు. అలాగే హీట్ ప్రొటెక్షన్ ఉపయోగించకపోవడం మంచిది. జుట్టును మరీ గట్టిగా కట్టుకోకూడదు.
జుట్టు రాలడం ఎక్కువైతే..
జుట్టు ఒక్కసారిగా ఎక్కువగా రాలడం, స్కాల్ప్‌లో ఖాళీ ప్రదేశాలు కనిపించడం, జుట్టు క్రమంగా పలుచబడటం వంటివి కనిపిస్తే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. ఎందుకంటే జుట్టు రాలడానికి పోషకాహార లోపాలతో పాటు థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ల మార్పులు, కొన్ని మందులు, స్కాల్ప్ సమస్యలు, వంశపారంపర్య కారణాలు వంటి అనేక కారణాలు ఉండొచ్చు. కారణం తెలుసుకోకుండా సప్లిమెంట్స్, ఆయిల్స్ లేదా హెయిర్ గ్రోత్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వృథా కావచ్చు.
Also Read : మెంతులు, అవిసె గింజలు, బియ్యంతో హెయిర్ ప్యాక్.. జుట్టు బలంగా, పొడవుగా పెరగడానికి ట్రై చేసేయండి
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
ట్రెండింగ్ వార్తలు























