Gunny bag Fashion: ఈ డ్రెస్సులు కుట్టింది గోనె సంచులతోనే, ఇప్పుడిదే కొత్త ఫ్యాషన్
గోనె సంచులే డ్రెస్సులుగా మారిపోయాయి. అంతర్జాతీయ వేదికలపై కూడా గన్నీ బ్యాగుల డ్రెస్సులు కనిపిస్తున్నాయి.
లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో తాప్సీ నటించిన దోబారా సినిమా ప్రీమియర్ వేశారు. ఆ కార్యక్రమానికి హాజరైంది తాప్సీ. ఆమెతో పాటూ చిత్ర దర్శకులు అనురాగ్ కాశ్యప్, సహనటులు కూడా హాజరయ్యారు. ఆ వేడుకకు తాప్సీ వేసుకున్న డ్రెస్ మాత్రం ఎక్కువ మందిని ఆకర్షించింది. ట్రెంచ్ కోట్ పై అద్దాలతో అందంగా కనిపించింది అమ్మడు. ఆ ట్రెంచ్ కోట్ దేనితో తయారు చేశారో తెలుసా? గన్నీ బ్యాగులతో అదేనండి గోనె సంచులతో. మన గ్రామాల్లో ధాన్యం కట్టేందుకు అధికంగా ఈ గోనెసంచులను ఉపయోగిస్తారు. ఇప్పుడు దానితో దుస్తులు కూడా కుట్టేస్తున్నారు అంతర్జాతీయ ఫ్యాషన్ డిజైనర్లు.
ఈ డ్రెస్ ను డిజైన్ చేసిన సెలెబ్రిటీ స్టైలిస్ట్ దేవకి భట్ మాట్లాడుతూ ‘తూర్పు పడమరల పర్ ఫెక్ట్ మిక్స్ గా ఈ డ్రెస్ ను డిజైన్ చేసినట్టు చెప్పారు’. కానీ గన్నీ బ్యాగును ఎందుకు ఎంచుకున్నారో మాత్రం చెప్పలేదు. తాప్సీనే కాదు హాలీవుడ్ సెలెబ్రిటీల కూడా కొన్ని సందర్భాల్లో గన్నీ బ్యాగుల డ్రెస్సులను వేసుకున్నారు.
జనపనార డ్రెస్సులు
బుర్లాప్ సాక్ లేదా గోనె సంచి... ఇది కేవలం వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఉపయోగించేవారు. దీన్ని జనపనారతో తయారుచేస్తారు. దీన్ని ఆధునికంగా కొన్ని రసాయనాలు,ఫ్యాబ్రిక్ లతో కలిపి స్మూత్ గా మారుస్తున్నారు. దీన్ని పాలీప్రొఫైలిన్ వంటివి కలిపి సింథటిక్ దుస్తులను తయారుచేస్తారు.
డ్రెస్సులే కాదు...
గన్నీ బ్యాగులతో ఎప్పట్నించో హ్యాండు బ్యాగులు తయారుచేస్తున్నారు. కొన్ని దేశాల్లో ప్యాంట్లు కూడా కుడుతున్నారు. అది కూడా చాలా ఫ్యాషనబుల్‌గా. భవిష్యత్తులో జనపనారతో చేసిన దుస్తుల ట్రెండ్ వెల్లువలా వచ్చే అవకాశం అధికంగా కనిపిస్తోంది.
View this post on Instagram