అన్వేషించండి

Kidney: కళ్ళు ఉబ్బుతున్నాయా? అశ్రద్ధ చెయ్యొద్దు, కిడ్నీలు ప్రమాదంలో పడతాయ్!

కిడ్నీల ఆరోగ్యం పాడైతే దాని ప్రభావం శరీరం అంతా పడుతుంది. ఒక్కోసారి వ్యాధి ముదిరి కిడ్నీ మార్పిడి చేయించుకునే పరిస్థితి దాకా వెళ్లొచ్చు.

శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలని బయటకి పంపించే బాధ్యత కిడ్నీలదే. అవి నిరంతరం పని చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. మధుమేహం, వృద్ధాప్యం, రక్తపోటు కారణంగా కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. కిడ్నీ వ్యాధి గుండె, రక్తనాళాల వ్యాధుల అవకాశాలని పెంచుతుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. అంతే కాకుండా పాలిసిస్టిక్ మూత్రపిండ వ్యాధి వారసత్వంగా వస్తుంది. ఈ వ్యాధి చుట్టుపక్కల కణజాలాలకి వ్యాపించి.. కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది. మనం తీసుకునే ఆహారం, నీళ్ళు, అలవాట్ల కారణంగా మూత్రపిండాలు ప్రమాదంలో పడుతున్నాయి. తగినంత నీరు తాగకపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడుతున్నాయి.

మూత్రపిండాలని దెబ్బతీసే మరొక వ్యాధి లూపిస్. ఇది కిడ్నీలోని వ్యర్థాలని ఫిల్టర్ చేసేందుకు సహకరించే రక్తనాళాలు వాపు లేదా మచ్చలు వచ్చేలా చేస్తుంది. దీని వల్ల కూడా మూత్రపిండాలు విఫలం అవుతాయి. చివరికి డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి చేయాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ఎంతో మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. అందుకు కారణం దీనికి సంబంధించి ఎటువంటి అవగాహన లేకపోవడం. అందుకే కిడ్నీ వ్యాధులని 'సైలెంట్ కిల్లర్స్' అని కూడా పిలుస్తారు. చాలా మందికి వ్యాధి ముదిరే వరకు ఎటువంటి లక్షణాలు బయట పడవు. వ్యాధిని గుర్తించడంలో విఫలం అవడం మరొక కారణం. మూత్రపిండాల పనితీరు సక్రమంగా ఉందా లేదా అని తెలుసుకునేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాధి నిర్ధారణ పరీక్షలు.

ఈ సంకేతాలు కనిపిస్తే.. కిడ్నీలు చెడిపోతున్నట్లే.. 

అలసట: ఎటువంటి పనులు, శ్రమ లేకపోయినా కూడా అలసటగా అనిపిస్తుంది. ఈ సంకేతం ఆందోళన కలిగిస్తుంది. ఇలాగే ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్య నిపుణులని కలిసి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. అలసట శరీరంలో అంతర్లీనంగా ఏదో ఆరోగ్య సమస్య ఉందని సూచిస్తుంది.

ఆకలి లేకపోవడం: ఏమి తినలేకపోవడం, ఆకలి మందగించడం తీవ్రమైన సమస్యని సూచిస్తుంది. సాధారణంగా మూత్రపిండాల వ్యాధి ఉన్న వాళ్ళు ఈ లక్షణాన్ని కలిగి ఉంటారు.

పాదాలు, కళ్ళు ఉబ్బడం: పాదాలు, చీల మండ ఉబ్బిపోతాయి. ఇది కూడా మూత్రపిండాల వ్యాధికి సంబంధించిన కొన్ని సాధారణ లక్షణాలు. కిడ్నీలు పేలవంగా పని చేస్తున్నప్పుడు శరీరంలో ద్రవం పేరుకుపోతుంది. దాని వల్ల కాళ్ళు, చీలమండలు, పాదాల్లో వాపు కనిపిస్తుంది. కళ్ళు ఉబ్బినట్లుగా అనిపించినా కిడ్నీ వ్యాధి ఉందని అర్థం. తరచూ ఇలాగే జరిగితే తప్పనిసరిగా వైద్యులని సంప్రదించాలి.

పొడి, దురద చర్మం: శరీరంలో అవయవాల పనితీరు సక్రమంగా లేకపోతే వెంటనే చర్మం చెప్పేస్తుంది. మూత్రపిండాల పనితీరు సరిగా లేదంటే శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. దాని వల్ల దురద, పొడి చర్మం, దుర్వాసన వస్తుంది.

మూత్రంలో మార్పులు: మూత్ర విసర్జనలో కూడా మార్పులు వస్తాయి. మూత్ర విసర్జన తగ్గడం లేదా తరచుగా వెళ్ళడం కూడా ఇబ్బందే. ముఖ్యంగా రాత్రి వేళ మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటే పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

అధిక రక్తపోటు: మూత్రపిండాల వ్యాధికి ప్రధాన సంకేతం అధిక రక్తపోటు. హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న ఎవరైనా మూత్రపిండాల పనితీరు గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: జొన్నలతో చేసే పాంక్, మధుమేహులకి అద్భుతమైన చిరుతిండి

టాప్ హెడ్ లైన్స్

Eating on Time : టైమ్‌కి తింటున్నారా? ఆలస్యంగా భోజనం చేస్తే వచ్చే సమస్యలివే.. సమయానికి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
టైమ్‌కి తింటున్నారా? ఆలస్యంగా భోజనం చేస్తే వచ్చే సమస్యలివే.. సమయానికి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Henna for Grey Hair : తెల్లజుట్టుకు సహజమైన రంగు కావాలా? హెన్నాలో ఈ 5 పదార్థాలు కలిపి అప్లై చేయండి
తెల్లజుట్టుకు సహజమైన రంగు కావాలా? హెన్నాలో ఈ 5 పదార్థాలు కలిపి అప్లై చేయండి
Snoring in Men : గురకను తేలిగ్గా తీసుకోకండి? పురుషుల్లో అది స్లీప్ అప్నియా కావచ్చు.. ఈ సంకేతాలను గమనించండి
గురకను తేలిగ్గా తీసుకోకండి? పురుషుల్లో అది స్లీప్ అప్నియా కావచ్చు.. ఈ సంకేతాలను గమనించండి
Calcium and Protein Rich Foods : కాల్షియం, ప్రోటీన్ కోసం వీటిని తినండి.. పాలు తాగడం ఇష్టం లేనివారికి బెస్ట్ ఆప్షన్స్ ఇవే
కాల్షియం, ప్రోటీన్ కోసం వీటిని తినండి.. పాలు తాగడం ఇష్టం లేనివారికి బెస్ట్ ఆప్షన్స్ ఇవే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget