అన్వేషించండి

Millionaires Village: ఆ ఊరిలో పేద కుటుంబాలు మూడే, మిగతా వాళ్లంతా మిలియనీర్లే

ఈ ఊరు ఒకప్పుడు పేద గ్రామం. ఇప్పుడు మిలియనీర్ల విలేజ్.

ఒక గ్రామంలో ధనిక కుటుంబాలు ఎన్ని ఉన్నాయో వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు, కానీ ఈ ఊరిలో మాత్రం పేదకుటుంబాలను అలా లెక్కపెట్టాలి. ధనిక కుటుంబాలను లెక్కపెట్టాలంటే చేతి వేళ్లు, కాలి వేళ్లు కూడా సరిపోవు. ఎందుకంటే ఆ గ్రామంలో 95 శాతం మంది మిలియనీర్లే. అందుకే ఈ గ్రామాన్ని మిలియనీర్ల గ్రామం అని పిలుస్తారు. ఇది మహారాష్ట్రాలోని హివ్రే బజార్. ఒకప్పుడు ఇక్కడ కరువు తాండవిచ్చేది. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడేవారు. ఎంతో మంది జనాలు వలస వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు ఈ గ్రామం గురించి ప్రపంచానికి చెప్పేందుకు మీడియా వాళ్లు వస్తూ పోతూ ఉంటారు. ఈ ఊరి పేరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఎన్నో కథనాలు వస్తాయి. ఈ ఊరిని ప్రాజెక్టు వర్క్‌గా ఎంచుకుని ఎంతో మంది కథనాలు కూడా రాశారు. ప్రస్తుతం ఈ ఊరిలో మూడు మాత్రమే పేద కుటుంబాలు ఉన్నాయి. మిగతా 252 కుటుంబాలు వాళ్లు ధనవంతులే. 

 ఒకప్పుడు ఇలా...
1972... హివ్రే బజార్ గ్రామం చాలా దారుణ పరిస్థితిలో ఉండేది. ఆకలి కేకలు, దాహపు గొంతులతో  అల్లాడిపోయేది. పంటలు పండేవి కాదు. తిండి లేక జనాలు సిటీకి వలసవెళ్లి పోయేవారు. 1980 కన్నా పరిస్థితి చేయి దాటి పోయింది. దాదాపు 90 శాతం ఊరు ఖాళీ అయిపోయింది. ఒక గ్రామం చరిత్రలో కలిసిపోయేందుకు ఒక అడుగు దూరంగా మాత్రమే ఉంది. అప్పుడే అద్భుతం జరిగింది. 

ఆ ఒక్కడు
ఆ ఊరిలో పీజీ వరకు చదువుకున్న వ్యక్తి పొపట్రావు పవార్. సిటీలో చదువుకుని వచ్చాడు. తన కళ్ల ముందే గ్రామం నాశనం కావడం చూడలేకపోయాడు. సర్పంచిగా పోటీ చేశాడు. నిజానికి పవార్‌కు రాజకీయాలు ఆసక్తి లేదు. కానీ చదువుకున్న నువ్వు మాత్రమే గ్రామాన్ని రక్షించగలవు అంటూ ఒప్పించారు. గెలిచాడు పవార్. చదువుకున్న, తెలివైన పిలగాడు ఊరి పరిస్థితి  అర్థం చేసుకున్నాడు. గ్రామం నాశనం కావడానికి మూల కారణాలు వెతికాడు. అవి సారా దుకాణాలు. ఆ చిన్న గ్రామంలో 22 సారా దుకాణాలున్నాయి. వాటి వల్లే తాగి తాగి ఎంతో మంది చనిపోయారు, ఆస్తుల్ని పోగొట్టుకున్నారు. చివరికి గ్రామంలో అందరూ పనుల బయటికి వెళ్లే పరిస్థితి దాపురించింది. అలాగే చెరువులు ఎండిపోయి, చుక్క నీరులేని పరిస్థితి. వెళ్లిన జనం వెనక్కి రావాలంటే నీరు పుష్కలంగా ఉండాలి. ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నాక ప్రణాళికలు రూపొందించాడు పవార్. Millionaires Village: ఆ ఊరిలో పేద కుటుంబాలు మూడే, మిగతా వాళ్లంతా మిలియనీర్లే

నీటిని ఒడిసిపట్టి
గ్రామంలోని చుక్క నీటిని కూడా వదలకుండా ఒడిసిపట్టే ఏర్పాట్లు చేశాడు. ఊర్లో పల్లపు ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు, చెరువు తవ్వించాడు. దీంతో వానలు పడ్డాక భూగర్భజలాలు పెరిగాయి. దాదాపు ఆ చిన్న గ్రామంలో 52 ఇంకులు గుంతలు తవ్వించాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం చుట్టూ తిరిగి కాలువలు ఉన్న చోట చెక్ డ్యాములు కట్టించాడు. దీంతో నీరు నిల్వలు పెరిగాయి. బయటికి వెళ్లిన ప్రజలు తిరిగి ఊళ్లకు వచ్చాడు. 70 హెక్టార్లలో పంటలు పండించడం మొదలుపెట్టారు. బోర్లు వేస్తే చాలు కేవలం 40 అడుగుల లోతులోనే నీళ్లు పడేవి. ఇంకేముంది పంటలు విరగకాశాయి. సారాయి దుకాణాలను కూడా మెల్లగా ఖాళీ చేయించారు. Millionaires Village: ఆ ఊరిలో పేద కుటుంబాలు మూడే, మిగతా వాళ్లంతా మిలియనీర్లే

1995లో ఆ ఊదరిలో 170 కుటుంబాలు ఉండేవి. అందులో 165 కుటుంబాలు పేదరికంతో ఇబ్బంది పడుతున్నవే. వారందరూ ధనవంతులుగా మారారు.కష్టపడి పంటలు పండిస్తూ తమ ఆదాయాన్ని పెంచుకున్నారు. ఆ ఊళ్లో తలసరి ఆదాయం ప్రస్తుతం 30,000 రూపాయలు. ఇప్పుడు 255 కుటుంబాలు నివసిస్తుంటే, వాటిలో మూడు కుటుంబాలే పేదవి. మిగతా వాళ్లంతా ధనికులే. ఎక్కువ కార్లున్న గ్రామం కూడా ఇదే. కేవలం వర్షపు నీటిని ఒడిసి పట్టి, వాటితో పంటలు పండిస్తూ ఇలా మిలియనీర్లుగా మారారు వీళ్లంతా. 

జొన్నలు, మొక్కజొన్న, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, సజ్జలు వంటివి పండిస్తారు. ప్రతి రోజూ ఈ గ్రామం నుంచి 4000 లీటర్ల పాలను అమ్ముతారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ గ్రామాన్ని ఆదర్శగ్రామంగా గుర్తించింది. 

Also read: మీకు ఈ సమస్యలు ఉన్నాయా? అయితే నెయ్యిని దూరం పెట్టండి

Also read: గర్భంతో ఉన్నప్పుడు గ్రీన్ టీ తాగవచ్చా? తాగడం వల్ల లాభమా, నష్టమా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget