ఆమెను వాసన చూసేందుకు ఎగబడుతున్న జనం.. జస్ట్ గోకితే చాలు!

పక్కోడిని వాసన చూడటమా? ఛీ.. యాక్ అనుకుంటున్నారా? అయితే.. ఈ మహిళలను వాసన చూస్తే మాత్రం సువాసన వస్తుందట.

FOLLOW US: 

పెర్‌ఫ్యూమ్, పువ్వులను నచ్చిన వంటను వాసన చూడటం మంచిదే. కానీ, పక్క మనిషిని ఎవరైనా వాసన చూస్తారా? ఛీ.. చాలా బాగోదు కదూ. అయితే, ఆ దేశంలో మాత్రం.. ఓ మహిళను వాసన చూసేందుకు ఊరి మొత్తం కదులుతోంది. చివరికి యూట్యూబర్స్ కూడా ఆమె ఇంటికి క్యూ కడుతున్నారు. అదేంటీ.. ఆమె అంతా బాగా వాసన వస్తుందా? అనేగా మీ సందేహం? అయితే, పదండి.. వియత్నాంలోని ఆ వింత గురించి తెలుసుకుందాం. 

ఆమె పేరు దాంగ్ ది తౌయీ. సాక్ త్రాంగ్ ప్రావీన్స్‌లో నివసిస్తున్న ఆమెకు సూపర్ పవర్స్ ఉన్నాయి. అలాగని ఆమెను సూపర్ ఉమెన్ అని మాత్రం అనుకోకండి. ఆమె వద్ద ఉన్న సూపర్ పవర్ ఏమిటంటే.. ఆమె స్నానం చేసినా.. చేయకపోయినా చెమట కంపు కొట్టదు. పైగా సువాసన వెదజల్లుతుంది. ఇంత గొప్ప ప్రత్యేకత తనలో ఉందని.. ఆమెకు కూడా తెలీదు. ఓ సారి తనని తాను గోక్కున్నప్పుడు ఈ ప్రత్యేకత బయటపడింది. 

రెండేళ్ల కిందట ఓ రోజు ఆమె తన చేతులు, కాళ్లను రుద్దుకుందట. అప్పుడు ఓ అద్భుతమైన సువాసన వచ్చిందట. ఆ వాసన ఎక్కడ నుంచి వస్తుందో కాసేపు ఆమెకు అర్థం కాలేదు. ఆ తర్వాత అది తన శరీరం నుంచే వస్తుందని తెలుసుకుని షాకైందట. ఈ సందర్భంగా దాంగ్ మాట్లాడుతూ.. తనను ఎవరైనా నెమ్మదిగా గోకినా, చేతులతో రుద్దినా ఈ వాసన వస్తోందని తెలిపింది. పగటి వేళలు కంటే రాత్రి వేళల్లోనే తన నుంచి ఆ సువాసన ఎక్కువగా వస్తోందని కుటుంబ సభ్యులు చెబితే నమ్మలేకపోయనని తెలిపింది. కొన్ని మీటర్ల దూరంలో ఉండేవారికి సైతం తన శరీర వాసన వెళ్తోందని చెప్పింది. రుతుక్రమం రోజుల్లో మాత్రం వాసన శాతం చాలా తక్కువగా ఉంటుందని, పౌర్ణమి రోజుల్లో తన శరీర వాసన రెట్టింపు అవుతుందని తెలిపింది. అయితే, శరీరంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆ వాసన వస్తోందని ఆమె తెలిపింది. 

ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీవీ చానెళ్లలోపాటు యూట్యూబర్లు సైతం దాంగ్ ఇంటికి క్యూ కడుతున్నారు. ఆమె చేతులను రుద్ది మరీ.. ఆమెను వాసన చూస్తున్నారు. మరోవైపు గ్రామస్తులు కూడా అప్పుడప్పుడు.. ఆమెను వాసన చూసేందుకు వస్తున్నారు. ఈ సమాచారం బయటకు పొక్కిన తర్వాత చాలామంది ఆమెను వాసన చూసేందుకు ఎగబడ్డారట. ఇప్పుడు మాత్రం ఆమె షాపుకు వచ్చే కస్టమర్లు.. వస్తువులను కొనుగోలు చేయడమే కాకుండా ఆమెను వాసన చూసి వెళ్లిపోతున్నారు. కియన్ గియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన దుంగ్ అనే మహిళ కూడా తన శరీరం నుంచి సువాసన వస్తోందని చెప్పింది. తన శరీరాన్ని రుద్దుతుంటే.. సువాసన వస్తోందని తెలిపింది. అయితే, శరీరం నుంచి సువాసన ఎందుకు వస్తుందనే కారణం ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. మీ చిన్నప్పుడు కూడా ఇలాంటి ఆట ఆడే ఉంటారు. అరచేతులను బొటన వేలుతో బాగా రుద్దినప్పుడు.. సువాసన వస్తుంది. బహుశా ఈ మహిళల నుంచి కూడా అలాంటి వాసనే వాస్తోంది కాబోలు. 

Read also: ఈ ఏడాది మనదేశంలో ఎక్కువ మంది వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే

Read also: వైరస్‌ల నుంచి రక్షణనిచ్చే ఎండు అంజీర్ పండ్లు... తినకపోతే మీకే నష్టం

Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Vietnam Human Perfume Vietnam Woman Woman Smells like perfume Smells like perfume వియత్నాం

సంబంధిత కథనాలు

Diabetes: డయాబెటిస్ ఉంటే మటన్ తినకూడదంటారు, ఎందుకు?

Diabetes: డయాబెటిస్ ఉంటే మటన్ తినకూడదంటారు, ఎందుకు?

Faluda: ఇంట్లోనే టేస్టీ ఫలూదా, చేయడం చాలా సింపుల్

Faluda: ఇంట్లోనే టేస్టీ ఫలూదా, చేయడం చాలా సింపుల్

Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...

Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...

World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే

World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే

Viral news: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుడాయన, ఇతడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది

Viral news: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుడాయన, ఇతడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది

టాప్ స్టోరీస్

Mysterious metal balls raining : గుజరాత్‌లో స్కైలాబ్ తరహా ఘటనలు - ఆకాశం నుంచి ఊడిపడుతున్న శకలాలు !

Mysterious metal balls raining : గుజరాత్‌లో స్కైలాబ్ తరహా ఘటనలు - ఆకాశం నుంచి ఊడిపడుతున్న శకలాలు !

PBKS Vs DC Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ - ప్రతీకారానికీ రెడీ!

PBKS Vs DC Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ - ప్రతీకారానికీ రెడీ!

NTR30 : ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో మార్పులు - మే 20న అప్డేట్ వస్తుందా?

NTR30 : ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో మార్పులు - మే 20న అప్డేట్ వస్తుందా?

Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !

Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !