Christmas Truce History : మొదటి ప్రపంచ యుద్ధంలో క్రిస్మస్ బ్రేక్.. ఆడుతూ పాడుతూ సెలబ్రేట్ చేసుకున్న శత్రుసైన్యం
Facts of World War 1 : ప్రపంచమంతా నేడు క్రిస్మస్ వేడుకను జరుపుకుంటుంది. అయితే మొదటి ప్రపంచయుద్ధంలో యుద్ధకాండ రగులుతుండగా.. క్రిస్మస్ వల్ల ఓ బ్రేక్ దొరికిందని మీకు తెలుసా?
World War 1 Christmas Truce : ప్రపంచాన్నే చిక్కుల్లో పడేసిన అంతర్జాతీయ సంఘర్షణ అంటే కచ్చితంగా మొదటి ప్రపంచ యుద్ధమనే చెప్తాము. 1914 నుంచి 1918 వరకు ఎడతెరిపి లేకుండా జరిగిన మారహోమం ఇది. అలాంటి ఈ మారణకాండలో.. హోరాహోరీగా యుద్ధం జరుగుతున్న సమయంలో ఎవరూ ఊహించడని విధంగా ఓ విశేషమైన ఇన్సిడెంట్ జరిగింది. అదే క్రిస్మస్ బ్రేక్. అంతటి మహా సంగ్రామంలో వచ్చిన క్రిస్మస్ విరామాన్ని ఓ అద్భుతమైన ఘట్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటివరకు శత్రువులను చంపాలనే ఆగ్రహం, ఆవేశంతో రగిలిపోయిన సైనికులు.. కరచాలనం చేసుకుంటూ.. సిగరెట్లు, సిగార్లు ఇచ్చిపుచ్చుకుంటూ సమయాన్ని గడిపారు. ఆ సమయంలో కాల్పుల ధ్వని ఏ మాత్రం వినిపించలేదు. ఎన్నో నెలల తర్వాత అక్కడ తుపాకీల చప్పుడు ఆగింది.
ఆ రోజు యుద్దానికి ఎలా బ్రేక్ పడిందంటే..
పగలు, రాత్రి తేడా లేకుండా కందకంలో ఉన్న సైనికులు యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. నిద్రలేమి, అంతులేని భయం.. ఎటూ చూసినా రక్తం అన్నట్లు అక్కడి పరిస్థితి ఉంది. రాత్రి పది గంటల సమయంలో అక్కడి జర్మన్లు క్రిస్మస్ ఈవ్‌లో భాగంగా పాటలు పాడారు. అది విన్న బ్రిటీష్ సైనికులు కొందరు తిరిగి అవే కరోల్స్ పాడడం ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడి జర్మన్ అధికారి ఆంగ్లంలో బ్రిటీష్ సైనికులను 'ఇక్కడి రమ్మంటూ' పిలిచాడు. అప్పుడు యుద్ధానికి విరామం ఇచ్చి.. భయాందోళనతోనే.. శత్రు సైన్యమంతా 'నో మ్యాన్స్ ల్యాండ్'లో కలుసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఎలాంటి బుల్లెట్స్ ధ్వని లేదు. కేవలం కరచాలనాలు, మంచి మాటలు, పాటలు, సిగరెట్స్, వైన్స్ వంటి వాటితో పార్టీ వాతావరణమే ఉంది. ఇరు వర్గాల మధ్య ద్వేషం అణువంతైనా లేకుండా పోయింది.
క్రిస్మస్కి ముగిసిపోతుందనుకున్నారు..
ఇది కేవలం యుద్ధ భూమిలోనే కాదు.. క్రిస్మస్ ఈవ్ నుంచి ఫ్రెంచ్, జర్మన్, బెల్జియన్, బ్రిటీష్ దళాల వెస్ట్రన్ ఫ్రంట్ అంతటా కాల్పుల విరమణ చేశారు. యుద్ధం ప్రారంభంలో ఇన్ని రోజులు జరగదు.. ఎవరో ఒకరు గెలిచి.. క్రిస్మస్ సమయానికి ఇంటికి వెళ్లిపోతారని భావించారు. ఆగస్ట్ 1914లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరూ అనుకున్నది అదే. కానీ డిసెంబర్ ప్రారంభం నాటికి కనుచూపు మేరలో విజయం లేకుండా పోయింది. కానీ.. ఎన్నో నెలలుగా కొనసాగిన ఈ యుద్ధకాండకు క్రిస్మస్ చిన్న బ్రేక్ ఇచ్చింది. ఆ సమయంలో ఇది అందరికీ అవసరమైన.. స్వాగతించగలిగే విరామం.
శత్రువులను మిత్రులను చేసింది..
ఎందుకంటే మరికొన్ని సంవత్సరాలు ఈ యుద్ధం కొనసాగుతుందని అక్కడి వారికి ఏ మాత్రం తెలియదు కదా. అప్పటికే కందకాల్లో లెక్కలేనన్ని మంది సైనికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. పదివేలకు మంది పైగా సైనికులు మరణించారు. ఆ సమయంలో వచ్చిన క్రిస్మస్ హాలీడే అందరికి కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది. ఒకరినొకరు మళ్లీ యుద్ధంలో భాగంగా చంపుకోవడం ప్రారంభించక ముందు.. ఇరువర్గాలు నవ్వుతూ కబుర్లు చెప్పుకునేలా చేసింది. ఆ విధంగా క్రిస్మస్.. ప్రేమ, వేడుకల్తో.. శత్రువులను కొంతకాలం మిత్రులుగా ఉండగలిగేలా చేసింది. అయితే ఈ సంధిని అధికారికంగా ఎవరు ప్రకటించలేదు కానీ.. అక్కడి వారు మాత్రం దాని పేరు చెప్పి ప్రేమను పంచగలిగేలా చేసింది.
మానవత్వాన్ని చాటి చెప్పింది..
ఈ సమయంలో అక్కడి జర్మన్ సైనికులు కందకాల చుట్టూ క్రిస్మస్ చెట్లు ఏర్పాటు చేసి.. కొవ్వొత్తులు వెలిగించుకున్నారు. జర్మన్స్ హెయిర్ కట్ కోసం ఓ బ్రిటీష్ సైనికుడు సిగరెట్లను ప్రతిగా తీసుకుంటూ వారికి హెయిర్ కట్ చేశారని ఓ జర్నల్ రాసుకొచ్చింది. ఆ తర్వాత సంవత్సరాల్లో క్రిస్మస్ ఒప్పందాలు ఏమి జరగలేదు. కానీ 1914లో జరిగిన ఈ ఆసక్తికరమైన సంఘటన మాత్రం.. యుద్ధభూమిలో పోరాడుతుంది శత్రువులు కాదు.. మానవులేనని గుర్తు చేసింది. ఈ క్రిస్మస్ సంధిని గుర్తు చేసుకుంటూ ఇంగ్లాండ్‌లో నేషనల్ మెమోరియల్ ఆర్బోరెటమ్లో మెమోరియల్‌ని ఏర్పాటు చేసింది.
Also Read : ఈ క్రేజీ గిఫ్ట్‌లతో మీ కొలిగ్స్ని సర్ప్రైజ్ చేసేయండి