Indias Most Expensive Mango Varieties : వామ్మో, ఈ మామిడి పండ్ల ధర రూ.2 లక్షలా? కుమారి ఆంటీ కర్రీ రేట్లే బెటర్!
Expensive Mango Varieties : వేసవిలో మామిడి పండ్లు తినని వారు ఉండరు. ఎంత ఖర్చైనా పర్లేదు మామిడి పండ్లను ఓ పట్టు పట్లాల్సిందే అనుకుంటారు. అయితే కిలో మామిడి పండ్లను లక్షల్లో కొనగలరా?
Rare And Expensive Mangoes in India : వేసవికి మామిడిపళ్లు.. వానలకు ఆ హరివిల్లు అని ఓ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాశారు. నిజమే మరి.. మనకి వేసవి అంటే మామిడి పళ్లే కదా ముందు గుర్తొచ్చేది. పైగా పండ్లకు ఇది రారాజు. రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మామిడి పిందెలు ఉగాది పచ్చడిగా మారినా.. మామిడి కాయలు ఆవకాయగా మారినా.. పండ్లు కమ్మని రుచిని అందించినా.. అది కేవలం మామిడికే సొంతం. అందుకే మామిడి పండ్లకోసం చాలా ఇష్టంగా ఎదురు చూస్తారు. కిలో 500 అయినా పర్లేదు కొనేద్దాం అనుకునేవారికి.. కిలో రెండు లక్షలు అనే పదం వినిపిస్తే.. అమ్మో ఏమైనా ఉందా? ఇవి తినడానికి ఆస్తులు అమ్ముకోవాలా ఏంటి అనేస్తాము. మరి ఇంతకీ అంత ఖరీదైన మామిడి పండ్లు నిజంగానే ఉన్నాయా? వాటి ధర అంత ఎందుకున్నాయి?
సాధారణంగా ఇండియాలో మామిడి పండ్లు వివిధ రకాలలో దొరుకుతాయి. బంగినపల్లి, అల్ఫోన్సో, కీసర్, బొండాలు వంటి రకాలు ప్రధానంగా ఇండియాలో దొరుకుతాయి. దాదాపు బంగినపల్లి మామిడి, బొండాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటి ధర కిలో.. వందల్లో ఉంటుంది. కొన్ని రకాల్లో ఒక మామిడిపండు వేలల్లో వస్తుంటే.. మరో రకం మామిడి లక్షల్లో అమ్ముడుపోతుంది. నిజంగా ఆ మామిడి పండును లక్షల్లో కొనడం వర్త్ అంటారా? ఆ మామిడి రకానికి కాస్ట్ ఎందుకంత ఎక్కువ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
మియాజాకి మామిడి..
జపాన్లో పెరిగే మియాజాకి మామిడికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రపంచంలో ఏ మామిడికి లేనంత ధర ఈ మామిడికి ఉందంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే కిలో మియాజాకి మామిడి ధర రెండు లక్షలకు పైమాటే. దీని రంగు ఎరుపుగా, బర్గంటిలో ఉంటుంది. రుచిలో అత్యంత మధురాన్ని అందిస్తుంది. పెద్ద సైజ్లో, వాసన, స్వీట్నెస్కు ప్రసిద్ధి చెందాయి. అయితే ఈ మధ్య ఇండియాలో కూడా పండించడం మొదలు పెట్టారు. అయితే దీని రుచికి, పోషకాలకు ఈ ధర పలికినట్లు చెప్తారు. అన్నిసార్లు ఇంతే ధర ఉండకపోవచ్చని కూడా చెప్తున్నారు.
అల్ఫోన్స్ మామిడి పండ్లు
మామిడి పండ్ల రాజుగా అల్ఫోన్స్ మామిడికు మంచి పేరు ఉంది. ఇది ఇండియాలో బాగా ఫేమస్, దీనిని రత్నగిరి, దేవ్గడ్, కొంకణి ప్రాంతాలలో ఎక్కువగా పండిస్తారు. గుజరాత్లో కూడూ ఇవి విరివిగా దొరుకుతాయి. గత సంవత్సరం ఓ ఆన్లైన్ స్టోర్లో ఇది విపరీతంగా అమ్ముడుపోయింది. 25 కోట్ల విలువైన మామిడి పండ్లను ఆర్డర్ చేశారంటే దీనికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని ధర కిలో రూ.1,500 ఉంటుంది.
నూర్జహాన్ మామిడి
పేరుకు తగ్గట్లే రుచిలో రాయల్టీని అందించే మామిడి పండ్లలో నూర్జహాన్ మామిడి ఒకటి. ఒక మామిడి దాదాపు అడుగు పొడువు వరకు పెరుగుతుంది. దీనిని మామిడి పండ్లలో రాణిగా చెప్తారు. ఒక్క మామిడి 3.5 కిలోలవరకు బరువు ఉంటుంది. అయితే సీజన్లో ఒక్కో ముక్క ధర రూ. 1,000 వరకు ఉంటుంది.
సింధ్రి మామిడి
ఇండియా, పాకిస్థాన్లో అరదుగా దొరికే మామిడి పండ్లలో సింధ్రి మామిడి ఒకటి. ఇవి ప్రత్యేకమైన తీపి రుచిని, సువాసనను అందిస్తాయి. పరిమాణంలో పెద్దవిగా, మృదువైన, పసుపు రంగులో ఉంటాయి. సారవంతమైన నేలలో వెచ్చని వాతావరణంలో వీటిని పండిస్తే మంచి రుచి వస్తుందని చెప్తారు. అయితే మార్కెట్లో ఒక్క పండు ధర మూడువేల వరకు ఉంటుంది.
కోహితూర్ మామిడి
ఈ మామిడి 18వ శతాబ్ధం నుంచి పండిస్తున్నారని చెప్తారు. ఇది విలక్షణమైన రంగు, రుచి, రూపాన్ని కలిగి ఉంటుంది. నవాబుల కోసం ఓ ఉద్యానవనవేత్త ఈ రకాన్ని పండించినట్లు చెప్తారు. ఈ మామిడి ఇప్పుడు చాలా అరుదుగా దొరుకుతుంది. పశ్చిమ బెంగాల్లో దీనిని పండిస్తున్నారు. అయితే దీని ధర మూడు వేల నుంచి 12 వేల వరకు ఉంటుంది.
Also Read : జీతాలు పెంచరట కానీ బాధ్యతలు పెంచుతారట.. ఇదే కొత్త ట్రెండ్