బరువు తగ్గాలంటే బాదంలను అలానే తీసుకోవాలి.. లేదంటే చాలామంది ఆరోగ్య ప్రయోజనాలు కోసం బాదంను రెగ్యూలర్గా తీసుకుంటారు. బాదంపప్పులో కాల్షియం, విటమిన్ ఇ ఉంటుంది. ఇది ఎముకలకు చాలా మంచిది. అంతేకాకుండా స్కిన్ హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. అయితే బాదంను చాలామంది పొట్టుతీసేసి తింటారు. కానీ వీటిని పొట్టుతోనే తినాలట. గుండెకు ఆరోగ్యాన్ని అందించే ఫ్లేవనాయిడ్లు పొట్టులోనే ఉంటాయట. బాదం శరీరంలోని చెడు కొవ్వుల్ని తగ్గించి.. మంచి కొవ్వుని పెంచుతుంది. బాదం పప్పుల్ని రాత్రంత నానబెట్టి ఉదయం తింటే కొవ్వు కరుగుతుంది. ఇలా తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి అవగాహన కోసం మాత్రమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Image Source : Envato)