(Source: ECI/ABP News/ABP Majha)
జుట్టు రాలుతోందా? ఈ హెయిర్ ఆయిల్స్ వాడి చూడండి
మార్కెట్ లో లెక్కలేనన్ని బ్రాండుల్లో ఎన్నో రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో ఏవి ఎంత వరకు పనిచేస్తాయో తెలియదు. వీటిలో నిజంగా పనికొచ్చే వాటిని గుర్తించడం కష్టం.
కొన్ని రకాల హెయిర్ స్టయిల్స్, హెయిర్ డైస్ వల్ల జుట్టు రాలడం సహజం. పురుషుల్లో 80 శాతం, స్త్రీలలో 50 శాతం మంది జుట్టు రాలే సమస్యతో బాధపడేవారే. పనికి రాని హెయిర్ కేర్ ఉత్పత్తుల మీద డబ్బు తగలేసే వారే మనలో చాలా మంది. ఏ హెయిర్ కేర్ మనకు కచ్చితంగా పనిచేస్తుందో తెలియక పోవడం వల్ల డబ్బు వృథా అవుతుంటుంది. జుట్టు రాలి మాడు కనిపిస్తుంటే దాచుకోవడానికి తెలియని ఒత్తిడి పాలవుతుంటారు. లెక్కలు చూస్తే సగం మంది రాలేజుట్టు సమస్యతోనే తెలుస్తోంది.
జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో ఒత్తిడి, హెయిర్ డ్యామెజ్, హార్మోన్ డిస్టర్బెన్స్, ఏజింగ్ ఇలా రకరకాల కారణాలతో జుట్టు రాలుతుంటుంది. అయితే ఆనందించాల్సిన విషయం ఏమిటంటే ఈ విషయం గురించి పరిశోధనలు చాలా ముమ్మరంగా జరుగుతాయి. జుట్టు రాలకుండా నివారించేందకు ఉపయోగపడే ఉత్పత్తులు అందుకే మార్కెట్లో విరివిగా దొరకుతాయి.
బ్లూఅట్లాస్ హెయిర్ అండ్ బాడీ ఆయిల్
జుట్ట రాలడాన్ని నివారించేందుకు, రాలిన జుట్టు తిరిగి వచ్చేందుకు ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది జుట్టుకు మాత్రమేకాదు శరీరానికి కూడా వాడుకోవచ్చు కనుక దీన్ని అనుమానం లేకుండా ఆల్ రౌండర్ అని చెప్పవచ్చు.
ఇందులోని స్వాలెన్ మన శరీరంలో ఉండే స్వాలెన్ లాగే ఉంటుంది. చర్మం, జుట్టును హైడ్రేట్ చేస్తుంది. ఈ ప్రక్రియ సహజంగా వయసుతో పాటు తగ్గుతుంది. బ్లూఅట్లాస్ వాడడం వల్ల ఏజింగ్ ప్రాసెస్ ను నెమ్మదింపజేయవచ్చు దీనిలో ఆముదం, రోజ్ మేరి, గుమ్మడిగింజల నూనె వంటి పదార్థాల సమ్మిళితం.
ఇది ఎవరైనా వాడొచ్చు. అందరికీ మంచి ఫలితాలనే ఇస్తుంది.
కోంబ్ డెయిలీ హెయిర్ ఆయిల్
మానుక చెట్టు పూల నుంచి తేనె సేకరించే తేనేటీగలు మానుక తేనెను తయారు చేస్తాయి. ఈ తేనె యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్నే, యాంటీ ఫంగల్ కూడా. మానుక నూనెను చాలా రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో వాడుతారు. రోజ్మేరీ లీఫ్ ఎక్సాట్రాక్ట్స్ , ఎసెన్షియల్ ఫాటీ ఆసిడ్స్, యాంటి ఆక్సిడెంట్స్ తో ఉండే ఈ ఆయిల్ జుట్టుకు బలాన్నిస్తుంది., హైడ్రేట్ చేస్తుంది. పోషణను ఇస్తుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని కూడా పూరిస్తుంది. తిరిగి కొత్త జుట్టు కూడా వస్తుంది.
స్కాల్ప్ ఆరోగ్యంగా లేక చికాకుగా ఉన్న వారికి ఇది మంచి పరిష్కారం.
ఆర్డినరీ మల్టీ పెప్టైడ్ సీరం
ఆర్టినరీ బ్రాండ్ వస్తువులు మంచి స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ అందిస్తాయి. జుట్టు సంరక్షణలోల మంచి పాత్ర పోషించే కెఫిన్, గ్రీన్ టీ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన సిరమ్ ఇది. జుట్టు పెరగడానికి, జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం. జట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది.
సున్నితమైన జుట్టు కు ఇది మంచి పరిష్కారం.
మియెల్ రోజ్మెరీ పుదీనా స్కాల్ప్ అండ్ హెయిర్ స్ట్రెంగ్తెనింగ్ ఆయిల్
ఆర్గానిక్ అండ్ నేచురల్ వస్తువులు ఉపయోగించి తయారు చేసిన ఈ ప్రొడక్ట్ జుట్టును బలోపేతం చెసేందుకు, స్కాల్ప్ ను ఆరోగ్యంగా మార్చేందుకు దోహదం చేస్తుంది. రోజ్మేరీ జట్టు పలుచబడడాన్ని అరికట్టి సెల్యూలార్ పునరుత్పత్తికి దోహదం చేస్తుంది. దురదతో పాటు ఫ్లేకీ స్కాల్ప్ కి ఇది మంచి పరిష్కారం. పుదీనా నూనె స్కాల్ప్ మీద చల్లని అనుభూతిని ఇస్తుంది. బయోటిన్ జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.
వృక్షసంబంధ ఉత్పత్తులు వాడాలని అనుకునే వారికి మంచి చాయిస్ ఇది.