(Source: ECI/ABP News/ABP Majha)
The Art of Letting Go: విదేశీ చదువు కోసం పిల్లలకు దూరంగా ఉండడం ఒక కళ
Parenting: దాదాపు ప్రతీ ఇంటి పిలల్లో కనీసం ఒకరైనా చదువుకునేందుకు విదేశాలకు వెళ్తున్న పిల్లలకు దూరంగా ఉండడం ఒక ఎత్తైతే, వారికి కావల్సిన సహాయం చెయ్యడం మరో బాధ్యత.
Life Style: ఇప్పుడు గ్లోబలైజేషన్ యుగంలో ప్రపంచం గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్ లో నడుస్తోంది. పైచదువులు విదేశాల్లో అని కలకనని పిల్లలు చాలా తక్కువ మంది. నిజానికి ఇది పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఇది అత్యంత సునిశితంగా చాలా జాగ్రత్తగా పూర్తి చెయ్యాల్సిన బాధ్యత. ఆర్ధికంగా, మానసికంగా, భావోద్వేగపరంగా కూడా ఆచీతూచి అడుగెయ్యాల్సిన అవసరమున్న తరుణం అని చెప్పుకోవచ్చు. అలాంటి సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరమవుతాయో ఒకసారి చూద్దాం.
విశ్వాసం ముఖ్యం
విదేశీ విద్య పిల్లల భవిష్యత్తు విషయంలో తీసుకునే అత్యంత కీలకమైన నిర్ణయం. తల్లిదండ్రులుగా మీ పిల్లలు తీసుకునే నిర్ణయాల మీద ముందుగా మీకు విశ్వాసం ఉండడం, ఆ విశ్వాసం మీకు వారిపై ఉందన్న నమ్మకం వారికి కలిగించడం అవసరం. వారు సరైన రీతిలో అక్కడ విద్యార్థులుగా వారి మనుగడకు పునాది వేసుకున్నారని, నిర్ణయానికి ముందు క్షుణ్ణంగా పరిశోధించి వివరాలు సేకరించారో లేదో మీరు మరో సారి రుజువు చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.
ఆత్మ విశ్వాసం కలిగించడం
నిజానికి తల్లిదండ్రులకు, పుట్టిన దేశానికి దూరంగా వెళ్లి చదువుకోవడం అనేది వారు జీవితంలో స్వతంత్రంగా వేసే పెద్ద అడుగుగా భావించాలి. ఈ పని వారు విజయవంతంగా పూర్తిచెయ్య గలిగితే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇందుకు స్వతంత్రంగా వారి సమస్యలను పరిష్కరించుకోగలిగే సామర్థ్యం అవసరం, ఇదే వారిలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. వారి నిర్ణయాలు సరైనవే అనే నమ్మకాన్ని మీరు వారికి ఇవ్వగలగాలి. అప్పుడే వారు కూడా తమ సామర్థ్యాల మీద నమ్మకం ఉంచి ముందుకు సాగుతారు.
ఎమోషనల్ సపోర్ట్
ఇంటికి అంత దూరంలో సుదీర్ఘ కాలం పాటు ఉండడానికి ముందుగా పిల్లను మానసికంగా సిద్ధం చెయ్యడం కూడా ముఖ్యమే. ఒక్కసారిగా తల్లిదండ్రులకు దూరంగా ఉండడానికి సిద్ధపడడం వల్ల సంఘర్షణకు లోనవుతారు. కానీ అది జీవితంలో ఏదో ఒకరోజు సహజంగానే ఈ దశకు చేరుకోక తప్పదు. పిల్లలకు ఒక్కసారిగా దూరంగా ఉండడం అనే భావన తల్లిదండ్రులుగా పెద్ద వారికి కూడా ఎమోషనల్లీ కష్టమైన విషయమే. పిల్లల భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పదనే విషయం అవగాహనలో ఉంచుకోవాలి. ఇది వారి జీవితాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకే అనే స్థిర దృక్పథంతో దృఢంగా ఉండాలి.
Also Read: కోరుకున్న లక్ష్యం కోసం కొడుకు దూరం - అనుకుమారి విజయం ఎందరికో స్పూర్తి మంత్రం
ప్రాక్టికల్ హెల్ప్
విదేశాలలో చదువుకోవడానికి అనువైన వర్సిటీలు, సబ్జెక్టులు, స్కాలర్‌షిప్‌లు వంటి విషయాల గురించిన సరైన సమాచాం తెలుసుకోవడంలో పిల్లలకు సహాయం చేయడం కూడా అవసరమైన విషయమే. ఇలా ప్రతి అడుగులో వారితో ఉండడం వల్ల పిల్లలకు మీ సపోర్ట్ ఉంటుందన్ననమ్మకం వారికి కలుగుతుంది. భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఎదురైనా మీతో చర్చించేందుకు వెనుకాడకుండా ఉంటారు.
చర్చించడం చాలా ముఖ్యం
పిల్లలు తీసుకునే అత్యంత కీలక మైన విదేశీ విద్య నిర్ణయంలో పిల్లలు తమ ఆలోచనలు, ఆందోళనలు మీతో పంచుకునేందుకు అనువైన ఒక సురక్షిత వాతావరణం కుటుంబంలో కల్పించడం ఎంతో ముఖ్యం. వారితో సరైన విధానంలో చర్చించడం, సలహాలు ఇవ్వడం, గైడెన్స్ అందించడం వారిని మరింత నమ్మకంగా ముందడుగు వేసేందుకుం ప్రోత్సహిస్తుంది.
ఈ విషయం మరచి పోవద్దు
మీరు ఎల్లప్పుడూ మీ పిల్లలకు కేవలం జీవితానికి గైడ్స్ మాత్రమే. సలహాలు ఇవ్వగలరు. కానీ ఒక వయసు తర్వాత వారి నిర్ణయాల పై విశ్వాసం ఉంచడం, సమస్యలు ఎదురైనపుడు అండగా నిలబడడం మీ ప్రధాన బాధ్యత అని మరచిపోవద్దు.
Also Read: ఉన్నోళ్లకి ఒబేసిటీ, లేనోళ్లకి అనీమియా - అత్యంత దారుణంగా దేశంలో పిల్లల పరిస్థితి