పిల్లలకు బిస్కెట్లు ఇవ్వడం మంచిది కాదా?

పిల్లలు బిస్కెట్లు తినడానికి చాలా ఇష్టపడుతారు.

తల్లితండ్రులు పిల్లలకు ఇష్టమైన బిస్కెట్లు కొని తినిపిస్తుంటారు.

అయితే, పిల్లలకు బిస్కెట్లు ఇవ్వండం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు.

బిస్కెట్లు అతిగా ప్రాసెస్ చేయడం వల్ల కడుపు నొప్పి సహా పలు జీర్ణ సమస్యలు ఏర్పడుతాయి.

బిస్కెట్లలోని గోధుమ, మైదా పిండి పిల్లల పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

బిస్కెట్లలోని అధిక చక్కెర పిల్లల్లో దంత సమస్యలతో పాటు ఊబకాయానికి దారితీస్తుంది.

బిస్కెట్లలో పైబర్ లేకపోవడం వల్ల మలబద్ధకం సమస్యలు వస్తాయి.

బిస్కెట్లలోని కొవ్వు, చక్కెర, ఉప్పు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com