News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Dog meme: మీమ్స్‌లో నవ్వించిన ఆ వైరల్ కుక్క ఇక లేదు - మీమర్స్ భావోద్వేగం

మీమ్స్ లో వైరల్ అయిన శునకం అనారోగ్యంతో మరణించింది.

FOLLOW US: 
Share:

రకరకాల ఎక్స్ ప్రెషన్లతో అనేక మీమ్స్ వాడుకలో ఉన్నాయి. అలా మీమ్స్ లో బాగా వైరల్ అయిన శునకం ‘కబోసు’. మీమర్స్ ఎంతో ఇష్టమైన కుక్క ఇది. ఇది ఇంటర్నెట్ సెన్సేషన్ అని చెపుకోవాలి. ఓసారి ఎలన్ మస్క్ ట్విట్టర్ లోగోగా ఈ కబోసు శునకం చిత్రాన్ని పెడతారని అనుకున్నారంతా. దాని ఫోటోను కూడా ఎలన్ మస్క్ షేర్ చేశాడు. దీంతో ఈ కుక్క మరింత వైరల్ గా మారింది.  ఇప్పుడు మరోసారి ఇంటర్నెట్లో హైలైట్ అయింది. దానికి కారణం కబోసు అనారోగ్యంతో మరణించింది . అది క్యాన్సర్ తో బాధపడుతున్న దాని యజమానులు ఎప్పుడో ప్రకటించారు. దానికి ఎన్నో రకాల చికిత్సలు అందించినట్టు చెప్పారు. ఇప్పుడు దాని వయసు 18 ఏళ్లని తెలుస్తోంది. శునకం ఇంత వయసు వరకు బతికుండడం కూడా ఎక్కువే. దానికి క్యాన్సర్ కాకపోయినా అది ముసలితనంతో చనిపోయే అవకాశం ఉంది. ఈ కుక్కకు సోషల్ మీడియాలో దాదాపు 20 లక్షల మంది ఫాలోవర్లున్నారు. 

కబోసు గురించి ప్రపంచానికి తెలిసింది 2010లో. అప్పట్లో కొందరు మీమర్స్ కబోసు ఎక్స్ ప్రెషన్స్ ను మీమ్స్ గా మార్చారు. వాటిని ఎంతో మంది వినియోగించారు. ఎక్కడా చూసిన ఈ శునకం ఫోటోలే కనిపించేవి. క్రిప్టోకరెన్సీలో డాగ్ కాయిన్ కూడా ఒకటి. దాని సింబల్‌గా కబోసు ముఖాన్నే వాడారు. క్రిప్టో ప్రపంచంలో ఎనిమిదవ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ డాగ్ కాయిన్. బిట్ కాయిన్ తరువాత ఎక్కువ మంతి గూగుల్ లో సెర్చ్ చేసిన క్రిప్టో కరెన్సీ డాగ్ కాయిన్. 

ఈ కుక్క జపాన్లో నివసించేది. 2010లో దాని యజమానులు కబోసు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవి మంచి ఎక్స్ ప్రెషన్లతో ఉండడంతో మీమర్లు వాడేసుకున్నారు. ఇప్పటికీ ఎంతో మంది ఫోన్లలో ఈ డాగ్ మీమ్ కనిపిస్తుంది. దీని పేరు మీద ఉన్న ఇన్ స్టా ఖాతాకు ఎంతో మంది ఫాలోవర్లున్నారు. ఇందులో ఈ శునకాన్ని పెంచుకుంటున్న యజమానులు ఎప్పటికప్పుడు దాని ఆరోగ్య పరిస్థితి నెటిజన్లకు తెలియజేస్తూ వచ్చారు. గతేడాదే అది తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు చెప్పారు. తరువాత ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పారు. ఇప్పుడు క్యాన్సర్ తీవ్రమై అది మరణించిందని ప్రకటించారు. ఈ కుక్కని చీమ్స్ అలియాస్ చింటూ అని కూడా పిలుస్తారు. తెలుగులో ఎక్కువ మంది ఈ శునకాన్ని చింటూ అనే పిలుస్తారు. పదేళ్లపాటూ చింటూని తెలుగు మీమర్స్ కూడా ఉపయోగించారు. ఇప్పుడు ఇది మరణించిందని తెలిసి ఎంతో మంది మీమర్స్ నివాళులు అర్పిస్తున్నారు. 

[insta]

View this post on Instagram
 
A post shared by Michael McCrudden (@beforetheywerefamous)

Also read: ఐస్‌బాత్ చేస్తున్న హీరోయిన్లు, ఆ స్నానం వల్ల ఎన్నో ఉపయోగాలు

Also read: వెల్లుల్లి కారంతో ఇలా చికెన్ వేపుడు చేశారంటే ఒక్క ముక్క కూడా మిగలదు

Published at : 20 Aug 2023 03:37 PM (IST) Tags: Viral dog Dog kabosu Dog memes Meme Dog

ఇవి కూడా చూడండి

Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే

Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే

Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి

Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి

Pea Protein Powder: బఠానీలతో చేసిన ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే అన్నీ లాభాలున్నాయా?

Pea Protein Powder: బఠానీలతో చేసిన ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే అన్నీ లాభాలున్నాయా?

Relatioships: నా భర్త ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నాడు, నాకు నచ్చడం లేదు - ఏం చేయమంటారు?

Relatioships: నా భర్త ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నాడు, నాకు నచ్చడం లేదు - ఏం చేయమంటారు?

Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు

Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !