అన్వేషించండి

Kerala Recipe for Breakfast : కర్ర పెండలంతో టేస్టీ బొండాలు.. కేరళ స్పెషల్ రెసిపీ

Tasty Breakfast : మీకు కర్ర పెండలం ఎక్కడైనా దొరికితే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. వాటితో ఈ క్రేజీ, టేస్టీ బోండాలు ట్రై చేయండి. 

Recipe with Tapioca Root : చలికాలంలో కర్ర పెండలం బాగా దొరుకుతుంది. ఆరోగ్యానికి చాలా మంచిదని దీనిని ఉడకబెట్టుకుని తింటూ ఉంటారు. అయితే మీరు ఈ కర్రపెండలంతో టేస్టీ, టేస్టీ బొండాలు తయారు చేసుకోవచ్చు. వీటిని ప్రిపేర్ చేయడానికి పెద్దగా ఏమి అవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితో వీటిని చాలా సింపుల్​గా ట్రై చేయవచ్చు. ఈ రెసిపీ కోసం కావాల్సిన పదార్థాలు ఏమిటో? వాటిని ఏవిధంగా ట్రై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

కర్రపెండలం - 1 కిలో

ఉప్పు - రుచికి తగినంత

గుడ్లు - 2

బ్రెడ్ క్రంబ్స్ - 2 కప్పులు

ఫిల్లింగ్ కోసం..

నూనె - డీప్​ ఫ్రైకి తగినంత

ఆవాలు - 1 పావు స్పూన్

ఉల్లిపాయలు - 15 (చిన్నవి)

ఎండు మిర్చి - 8

చింతపండు గుజ్జు - అరటీస్పూన్

ఉప్పు - రుచికి తగినంత

తయారీ విధానం

ముందుగా కర్ర పెండలాన్ని బాగా కడిగాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై గిన్నె పెట్టి దానిలో నీరు, ఉప్పు వేసి.. కర్రపెండలం వేయాలి. అవి బాగా ఉడికిన తర్వాత పైన పొట్టు తీసేయాలి. ఇప్పుడు వాటిని నిమ్మకాయ సైజ్​లో చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిల్లింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఓ గిన్నె తీసుకుని.. దానిలో నూనె వేసి వేడిచేయండి. దానిలో ఆవాలు వేయండి. అవి చిలకరిస్తున్నప్పుడు.. ఉల్లిపాయలు, ఎండు మిర్చి వేసి బాగా వేయించాలి. అవి వేగుతున్నప్పుడు చింతపండు గుజ్జు, ఉప్పు వేసి బాగా కలపాలి. 

ముందుగా సిద్ధం చేసుకున్న కర్రపెండలం బాల్స్​ను ఒక్కొక్కటిగా తీసుకుని.. కొంచెం చదును చేయండి. మధ్యలో ఒక టీస్పూన్ ఫిల్లింగ్ ఉంచి.. వాటిని బాల్స్​ రూపంలో మళ్లీ చుట్టండి. మరో గిన్నె తీసుకుని దానిలో గుడ్లు పగులగొట్టి వేయండి. గుడ్డు మిశ్రమంలో సిద్ధం చేసి పెట్టుకున్న స్టఫ్డ్ బాల్స్​ను ముంచండి. అనంతరం బ్రెడ్​క్రంబ్స్​లో రోల్ చేయండి. ఇలా అన్ని బాల్స్ సిద్ధం చేసుకున్న తర్వాత.. స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టి.. దానిలో డీప్​ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత ఈ స్టఫ్డ్, రోల్​ చేసి పెట్టుకున్న బాల్స్ వేసి వేయించాలి. అవి గోల్డెన్ కలర్​లోకి వచ్చే వరకు స్టవ్ మీడియంలో ఉంచి ఫ్రై చేయాలి. వీటిని వేడి వేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. 

మీకు తెలుసా కర్రపెండలం గ్లూటెన్ ఫ్రీ దుంప. ఇందులో విటమిన్ సి, కాపర్ సమృద్ధిగా ఉంటుంది. కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది మీరు ఎక్కువసేపు కడుపునిండుగా ఉండేందుకు మీకు హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా దీనిలోని పీచు పదార్థాలు మీ గట్​ సమస్యలను తొలగిస్తాయి. మెరుగైన జీర్ణక్రియను అందిస్తాయి. కాబట్టి వీటిని మీరు హ్యాపీగా మీ డైట్​లో చేర్చుకోవచ్చు. 

Also Read : సగ్గుబియ్యంతో క్రంచీ వడలు.. టేస్టీ బ్రేక్​ఫాస్ట్ రెసిపీ

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Crime News:  టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Embed widget