అన్వేషించండి

Soya Chunks Curry : ఆరోగ్యానికి మేలు చేసి, బరువును తగ్గించే మీల్ మేకర్ కర్రీ.. టేస్టీ, హెల్తీ రెసిపీ ఇదే

Soya Chunks :సోయా చంక్స్ తినడానికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచివి. ప్రోటీన్​తో నిండి కండరాలను బలపరిచి.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మరి దీనితో టేస్టీ కర్రీ ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం.

Tasty Soya Chunks Recipe : నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో దాదాపు అందరూ ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం కోసం చూస్తున్నారు. అలాంటివారికి మీల్​మేకర్స్ (సోయా చంక్స్) మంచి ఎంపిక కావచ్చు. ఇది తినడానికి రుచికరమైనది మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సోయా చంక్స్ ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. ఇవి కండరాలను బలోపేతం చేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, శక్తిని అందించడానికి హెల్ప్ చేస్తాయి. ఇది త్వరగా జీర్ణమవుతుంది. అన్ని వయసుల వారికి మంచి ప్రయోజనాలు అందిస్తుంది.

సోయా చంక్స్ గొప్పదనం ఏమిటంటే.. దీనిని వండుకోవడం చాలా సులభం. ఈజీగా కుక్ చేసుకోవచ్చు. వర్క్ ఉన్న రోజుల్లో కూడా ఆరోగ్యకరంగా, రుచికరంగా తినాలనుకుంటే మీరు సోయా చంక్స్ తీసుకోవచ్చు. దీనిలో కాస్త మసాలా వేస్తే మరింత రుచిగా మారుతుంది. అలాగే చిక్కటి గ్రేవీ టేస్ట్​ని మెరుగుపరుస్తుంది. మరి టేస్టీగా, హెల్తీగా మిల్​మేకర్​ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం. 

మీల్ మేకర్ కూర రెసిపీ.. టేస్టీగా, ఈజీగా

సోయా చంక్స్ కూరను టేస్టీగా చేయడానికి ముందుగా సోయా చంక్స్‌ను వేడి నీటిలో వేయాలి. దానిలో కాస్త ఉప్పు వేసి.. 10 నుంచి 12 నిమిషాల పాటు నానబెట్టండి. కానీ తరువాత వాటిలోని అదనపు నీరు పోయేలా చంక్స్‌ను బాగా పిండేయాలి. ఇప్పుడు వాటిని వేరే గిన్నెలో ఉంచండి. పెరుగు, పసుపు, కారం, ధనియాల-జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలపండి. వీటిని 5 నిమిషాలు మెరినేట్ చేయండి.

ఇప్పుడు మిక్సర్‌లో ఉల్లిపాయలు, టొమాటోలు, నానబెట్టిన ఎర్ర మిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, 1 నుంచి 4 కప్పుల నీరు వేయండి. బాగా రుబ్బి మెత్తని పేస్ట్ చేయండి. ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేయండి. కొన్ని సెకన్ల తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేయాలి. 2 నుంచి 3 నిమిషాల వరకు వేయించాలి. ఇప్పుడు మెరినేట్ చేసిన సోయా చంక్స్ వేసి.. ఉప్పులో 3 నుంచి 4 కప్పుల వేడి నీరు వేసి మూత పెట్టి 8 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించాలి. 

కర్రీ ఉడికిన తర్వాత కసూరి మెంతి, కొత్తిమీర వేసి కొద్దిగా కలపండి. అంతే రుచికరమైన, ఆరోగ్యకరమైన సోయా చంక్స్ మసాలా కర్రీ రెడీ. దీనిని వేడి వేడిగా రోటీ లేదా అన్నంతో కలిపి వడ్డించండి. సోయా చంక్స్‌లో ప్రోటీన్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది బరువును నియంత్రించడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, జీర్ణక్రియకు కూడా మంచిది. శాఖాహారులు ప్రోటీన్ కోసం దీనిని రెగ్యులర్​గా తీసుకోవచ్చు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget