రెస్టారెంట్ స్టైల్ ఇడ్లీ ఇంట్లోనే చేసుకోండిలా.. టేస్టీ రెసిపీ

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఇడ్లీ భారతదేశం అంతటా ఆరోగ్యకరమైన అల్పాహారాలలో ఒకటి.

Image Source: pexels

మార్కెట్లో దొరికే ఇడ్లీలు చాలా మెత్తగా ఉంటాయి. కానీ ఇంట్లో చేసిన ఇడ్లీలు కొందరికి గట్టిగా వస్తాయి.

Image Source: pexels

అలాంటప్పుడు రెస్టారెంట్ కంటే రుచికరమైన ఇడ్లీని ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దాం.

Image Source: pexels

ఒక గిన్నెలో బియ్యం, మినప పప్పులను విడిగా కడిగి 4–6 గంటలు నానబెట్టండి.

Image Source: pexels

ఉరద్ దాల్ నానబెట్టేటప్పుడు అందులో ½ టీస్పూన్ మెంతులు వేయండి. దీనివల్ల పిండి త్వరగా పులుస్తుంది.

Image Source: pexels

అనంతరం మినపప్పును మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత బియ్యాన్ని కొద్దిగా బరకగా రుబ్బుకోవాలి.

Image Source: pexels

రెండు పేస్టులను కలపండి. పిండి మరీ చిక్కగా లేదా పలుచగా ఉండకూడదు.

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

పిండిని 8–10 గంటల పాటు మూతపెట్టి బయట ఉంచండి. ఇలా చేస్తే పిండి పులుస్తుంది.

Image Source: pexels

ఇడ్లీ స్టాండ్‌కు కొద్దిగా నెయ్యి అప్లై చేయండి. తద్వారా ఇడ్లీలు అంటుకోకుండా సులభంగా బయటకు వస్తాయి.

Image Source: pexels

ఇడ్లీలను 10–12 నిమిషాల పాటు ఎక్కువ వేడి మీద ఆవిరిలో ఉడికించండి. అంతే మెత్తని, టేస్టీ ఇడ్లీలు రెడీ.

Image Source: pexels