అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Chaddi Annam Recipe : చద్దన్నం చేసుకోవడంలో ఆ మిస్టేక్స్ చేయకూడదట.. మజ్జిగను అలా వేసుకుంటేనే మంచిదట

Healthy Breakfast : మన పూర్వీకులు మనకి ఇచ్చిన అమోఘమైన హెల్తీ రెసిపీలలో చద్దన్నం ఒకటి. పేరుకు చాలా సింపులే అయినా.. ఇది ఇచ్చే హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా సమ్మర్​లో.

Fermented Rice Recipe : సమ్మర్​లో మీరు ఎన్ని మంచి ఫుడ్స్ తిన్నా.. ఏదొక సమయంలో మీరు రావాల్సింది చద్దన్నం దగ్గరకే. ఎందుకంటే ఇది చేసే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు. ఒకప్పుడు సమ్మర్​లో వచ్చే వేడిని తట్టుకునేందుకు దీనిని ఎక్కువమంది తీసుకునేవారు. ఇప్పటికీ కొందరు తీసుకుంటున్నారు. కానీ దీని ప్రయోజనాలు ఎక్కువ మందికి తెలియకపోవడం కూడా కొందరు దీనికి దూరముంటున్నారు. వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం దీనిని కచ్చితంగా తీసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

ఉదయాన్నే హెల్తీ ఫుడ్ తీసుకోవాలనుకునేవారికి చద్ది అన్నం ఓ హెల్తీ బ్రేక్​ఫాస్ట్ అవుతుంది. చద్దన్నం చేయడం కష్టమేమి కాదు. ఇంట్లో మిగిలిపోయిన రాత్రి మిగిలిపోయిన రైస్.. కాస్త మజ్జిగ ఉంటే చాలు. చాలామంది రాత్రి మిగిలిపోయిన అన్నంలో పెరుగువేసుకుని తినేస్తారు. కానీ నిజం చెప్పాలంటే పెరుగు వేడి చేస్తుంది. మజ్జిగ మాత్రమే చలువ చేస్తుంది. చాలామందికి దీనిని ఎలా చేసుకోవాలో తెలిసి ఉంటుంది కానీ.. తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తారు. అందుకే రాత్రే మనం చద్దన్నం ఎలా చేసుకోవాలో.. అది పెరుగులో కాకుండా మజ్జిగలా ఉండేందుకు ఎలాంటి టిప్స్ పాటించాలో.. ముఖ్యంగా మీరు సమ్మర్​లో హెల్త్ బెనిఫిట్స్ పొందాలనుకుంటే దానిలో ఏమేమి వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

అన్నం -  ఒకటిన్నర కప్పు

వేడి నీరు - 1 కప్పు

మజ్జిగ - రెండు టేబుల్ స్పూన్స్

పాలు - 1 కప్పు

ఉల్లిపాయ - 1 పెద్దది

పచ్చిమిర్చి - 2

ఉప్పు - రుచికి తగినంత 

తయారీ విధానం

ఏది ఏమైనా మీరు ఈ చద్ది అన్నం తయారు చేసుకోవాలనుకుంటే మంటి కుండను ఉపయోగిస్తే చాలా ప్రయోజనాలు పొందవచ్చు. దీనిలో తయారు చేసుకోవడం వల్ల మంచి రుచి అందుతుంది. అంతేకాకుండా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి. కాబట్టి ముందుగా ఓ మట్టి కుండను తీసుకోండి. దానిలో అన్నం వేయండి. అన్నం మెత్తగా ఉడికితే ఇంకా మంచిది. ఇప్పుడు దానిలో వేడి నీరు వేయండి. అనంతరం పాలు కూడా వేసి కలపండి. అన్నం వేడి తగ్గాక మజ్జిగను కూడా వేసి మొత్తం కలిసేలా గరిటతో తిప్పండి. వేడి నీరు వేసుకోవడం వల్ల ఉదయాన్నే ఇది గట్టిగా ఉండకుండా గంజి అన్నం మాదిరిగా తయారవుతుంది.

పెద్ద ఉల్లిపాయను నాలుగు ముక్కలుగా.. పచ్చిమిర్చిని అడ్డంగా రెండు ముక్కలుగా చేసుకోవాలి. వీటిని ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలో వేయాలి. ఇప్పుడు దానిపై మూత వేసి పక్కన పెట్టుకోవాలి. రాత్రంతా అలా వదిలేస్తే ఉదయాన్నే మీరు ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకుంటారు. ఈ రెసిపీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారైనా తీసుకోవచ్చు. ఉదయాన్నే లేచి టిఫెన్ చేసుకోవడానికి సమయం లేదనుకునేవారికి ఇది టేస్టీ, హెల్తీ బ్రేక్​ఫాస్ట్ అవుతుంది. 

గడ్డపెరుగుగా ఉంటే చాలా ఇష్టంగా తింటారు కానీ.. చల్ది అన్నం ఎప్పుడైనా మజ్జిగా మాదిరిగానే ఉండాలి. ఎందుకంటే పెరుగు గడ్డగా ఉన్నప్పుడు తింటే.. అది కడుపులోకి వెళ్లి అరిగేలోపు పులియబెట్టే బ్యాక్టీరియాగా మారుతుంది. అప్పుడు అది త్వరగా అరగదు. ఆ సమయంలో కడుపులో ఆమ్లాలు విడుదలై.. శరీరానికి వేడి చేస్తుంది. మజ్జిగగా తీసుకుంటేనే వేడి తగ్గి చలువ చేస్తుంది. పైగా మజ్జిగా త్వరగా జీర్ణమవుతుంది. ఎలాంటి జీర్ణ సమస్యలు కలగనివ్వదు. 

ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నవారైనా ఈ చద్ది అన్నం తీసుకోవచ్చు. ఆరోగ్య ప్రయోజనాలు పొందాలనుకునే ఎవరైనా దీనిని తినవచ్చు. బరువు తగ్గడం నుంచి.. మధుమేహం కంట్రోల్​లో ఉంచడంలో ఈ చద్ది అన్నం ఇచ్చే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు. పిల్లలకు కూడా ఇది హెల్తీ ఫుడ్ అవుతుంది. పైగా ఇలా పులియబెట్టిన ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిది. చైనీస్, కొరియన్స్ ఎక్కువగా పులియబెట్టిన ఆహారాలు తీసుకుని హెల్తీగా ఉంటారు. మీరు కూడా హెల్త్ బెనిఫిట్స్, ఫిట్​గా ఉండేందుకు రోజూ దీనిని తీసుకోవచ్చు. ముఖ్యంగా సమ్మర్​లో వేడిని దూరం చేసుకునేందుకు, యాక్టివ్​గా ఉండేందుకు ఇది బాగా హెల్ప్ చేస్తుంది. 

Also Read :  బ్రెయిన్​ని యాక్టివ్​గా ఉంచే ఫుడ్స్ ఇవే.. ఏకాగ్రతను కూడా పెంచుతాయట

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Pamkuntla Sai Reddy: 'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
CM Chandrababu: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేలిపోకూడదంటే.. జాగ్రత్తలు ఇవే!Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Pamkuntla Sai Reddy: 'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
CM Chandrababu: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Game Changer: ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
Rajamundry Rail Bridge: మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!
మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!
Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Embed widget