అన్వేషించండి

Thyroid Medication : థైరాయిడ్ మెడిసన్ వేసుకునేందుకు కరెక్ట్ టైం ఇదే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు

Thyroid Tablets : హైపో థైరాయిడ్ సమస్య ఉంటే వైద్యులు కచ్చితంగా మందులు వేసుకోవాలని సూచిస్తారు. అయితే వీటని వేసుకునేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చేయకూడని తప్పులు ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • థైరాయిడ్ మందులు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి.
  • రోజు ఒకే సమయానికి, సూచించిన మోతాదులో వాడాలి.
  • పాలు, కాఫీ, టీ, ఐరన్/కాల్షియం నాలుగు గంటల తర్వాత తీసుకోవాలి.
  • ఆహారంలో అయోడిన్, ప్రోటీన్, కూరగాయలు సమపాళ్లలో తీసుకోవాలి.

Thyroid Medication Guide : థైరాయిడ్ సమస్య ఉంటే.. ముఖ్యంగా హైపో థైరాయిడిజం ఉన్నవారికి వైద్యులు కచ్చితంగా మెడిసన్స్ వాడమని సూచిస్తారు. థైరాయిడ్ లెవెల్స్ బట్టి ట్యాబ్లెట్ల మోతాదు సూచిస్తారు. అలాగే వీటిని వేసుకునేప్పుడు కొన్ని నిబంధనలు కచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్తారు. కానీ కొందరు వాటిని సరిగ్గా ఫాలో అవ్వరు. దీనివల్ల సమస్య మరింత పెరుగుతుంది. మరి థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వేసుకునేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో.. ఎలాంటి తప్పులు చేయకూడదో.. నిపుణుల సూచనలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

ట్యాబ్లెట్ ఎప్పుడు తీసుకోవాలంటే..

సాధారణంగా డాక్టర్లు థైరాయిడ్ టాబ్లెట్ (Levothyroxine) ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలని సూచిస్తారు. అలాగే కాస్త నీళ్లతో ట్యాబ్లెట్ వేసుకోవాలి. టాబ్లెట్ వేసుకున్న తర్వాత 30 నుంచి 60 వరకు నిమిషాలు ఏమీ తినకూడదు. ఎందుకంటే థైరాయిడ్ మెడిసన్ శరీరంలో బాగా శోషించాల్సి ఉంది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

థైరాయిడ్ మెడిసన్ వేసుకునేప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ప్రతి రోజు ఒకే సమయానికి మెడిసన్ తీసుకోవాలి. వైద్యులు సూచించిన డోస్‌నే ఫాలో అవ్వాలి. TSH టెస్ట్ రెగ్యులర్‌గా చేయించుకోవాలి. టాబ్లెట్ వేసుకున్న వెంటనే పాలు, కాఫీ, టీ వంటివి తాగకూడదు. ఇలా తీసుకుంటే మెడిసన్ శరీరానికి అందదని గుర్తించుకోవాలి. ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకునేవారు.. థైరాయిడ్ మెడిసన్ తీసుకున్న 4 గంటల తర్వాత సప్లిమెంట్స్ తీసుకోవాలి. 

చేయకూడని తప్పులు ఇవే..

బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు టాబ్లెట్ తీసుకోవడం అస్సలు చేయకూడదు. అలాగే మిస్ అయిన డోస్‌ని తర్వాత డబుల్‌గా తీసుకోకూడదు. డాక్టర్ సలహా లేకుండా మెడిసన్ ఆపకూడదు. మీకు సర్జరీ, ఆపరేషన్ వంటివి అయినా కూడా వీటిని కచ్చితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సోయా, ఫైబర్ ఫుడ్స్ వెంటనే తీసుకుంటే మెడిసన్ ప్రభావం తగ్గుతుందని చెప్తున్నారు. 

థైరాయిడ్ ఉంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అయోడిన్ ఉన్న ఆహారం సరిపడా తీసుకోవాలి. గ్రీన్ వెజిటబుల్స్, ప్రోటీన్ ఫుడ్స్ మంచివి. క్యాబేజీ, బ్రోకోలీ వంటివి తక్కువ మోతాదులో తీసుకోవాలి. అలాగే థైరాయిడ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. వైద్యుల సూచనలతో.. సరైన విధంగా తీసుకుంటే సమస్య పూర్తిగా కంట్రోల్ అవుతుంది. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

HIV Prevention Injection : హెచ్​ఐవీ నివారణకు 8 వారాలకు ఒకసారి ఇంజెక్షన్.. ఇకపై రోజూ మాత్రలు వేసుకోనవసరం లేదట
హెచ్​ఐవీ నివారణకు 8 వారాలకు ఒకసారి ఇంజెక్షన్.. ఇకపై రోజూ మాత్రలు వేసుకోనవసరం లేదట
Creatine and Hair Loss : క్రియేటిన్ వల్ల బట్టతల వస్తోందా? 20-30 ఏళ్లకే జుట్టు రాలడానికి డాక్టర్లు చెప్తోన్న కారణాలు ఇవే
క్రియేటిన్ వల్ల బట్టతల వస్తోందా? 20-30 ఏళ్లకే జుట్టు రాలడానికి డాక్టర్లు చెప్తోన్న కారణాలు ఇవే
Healthy Morning Drinks : అధిక రక్తపోటు(High BP)ని అదుపులో ఉంచేందుకు ఉదయాన్నే తాగగలిగే డ్రింక్స్.. ఎలా పనిచేస్తాయంటే?
అధిక రక్తపోటు(High BP)ని అదుపులో ఉంచేందుకు ఉదయాన్నే తాగగలిగే డ్రింక్స్.. ఎలా పనిచేస్తాయంటే?
Brinjal and Potato Curry : వంకాయ, బంగాళదుంప కూర.. అన్నం, చపాతీల్లోకి తినేందుకు బెస్ట్ రెసిపీ ఇదే
వంకాయ, బంగాళదుంప కూర.. అన్నం, చపాతీల్లోకి తినేందుకు బెస్ట్ రెసిపీ ఇదే

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tragedy at Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో విషాదం.. పోలీసుల అత్యుత్సాహంతో భక్తుడు మృతి!
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో విషాదం.. పోలీసుల అత్యుత్సాహంతో భక్తుడు మృతి!
Shooting Gold Glory:  షూటింగ్ లో భారత జోడీకి గోల్డ్ మెడ‌ల్.. కొరియాకు చుక్కలు చూపించి చాంపియ‌న్ గా నిలిచిన క‌మ‌ల్ ఇత్, ఇంద‌ర్ సింగ్ జంట‌
షూటింగ్ లో భారత జోడీకి గోల్డ్ మెడ‌ల్.. కొరియాకు చుక్కలు చూపించి చాంపియ‌న్ గా నిలిచిన క‌మ‌ల్ ఇత్, ఇంద‌ర్ సింగ్ జంట‌
Balapur Ganesh Laddu Auction: రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేషుడి లడ్డూ.. విజేత సామ ప్రణీత్ రెడ్డి ఎవరంటే
రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేషుడి లడ్డూ.. విజేత సామ ప్రణీత్ రెడ్డి ఎవరంటే
Liquor shops: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. గణేష్ నిమజ్జనం సందర్భంగా నేడు వైన్స్ షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. గణేష్ నిమజ్జనం సందర్భంగా నేడు వైన్స్ షాపులు బంద్
22A Land Issue Solved: 22ఏ భూముల చిక్కుముడి వీడింది.. రాష్ట్రంలో లక్షలాది ఇళ్లు, ప్లాట్లకు శాశ్వత విముక్తి!
22ఏ భూముల చిక్కుముడి వీడింది.. రాష్ట్రంలో లక్షలాది ఇళ్లు, ప్లాట్లకు శాశ్వత విముక్తి!
Rayalaseema Horticulture Hub project : లక్ష కోట్లతో రాయలసీమ హార్టికల్చర్ హబ్ -సీమ రాత మార్చబోతున్న చంద్రబాబు బిగ్ ప్లాన్.. రిలయన్స్ అగ్రీ స్కూల్ కూడా!
లక్ష కోట్లతో రాయలసీమ హార్టికల్చర్ హబ్ -సీమ రాత మార్చబోతున్న చంద్రబాబు బిగ్ ప్లాన్.. రిలయన్స్ అగ్రీ స్కూల్ కూడా!
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేషుడి దర్శనం బంద్ - శుక్రవారం మధ్యాహ్నంలోపే నిమజ్జనం పూర్తి - ఏర్పాట్లు ఇవే!
ఖైరతాబాద్ గణేషుడి దర్శనం బంద్ - శుక్రవారం మధ్యాహ్నంలోపే నిమజ్జనం పూర్తి - ఏర్పాట్లు ఇవే!
Dipke CJP: 40 గంటల్లో రాజీనామా చేసి వెళ్లిపో - సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు సీజేపీ దీప్కే డెడ్‌లైన్
48 గంటల్లో రాజీనామా చేసి వెళ్లిపో - సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు సీజేపీ దీప్కే డెడ్‌లైన్
Embed widget