అన్వేషించండి

Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?

Air Travel Safety : విమాన ప్రయాణంలో ఎవరైనా చనిపోయినా.. ఆరోగ్యం క్షీణించినా ఎయిర్‌లైన్ ఏమి చేస్తుంది? ఫ్లైట్‌లో ఎమర్జెన్సీ అంటే ఏమిటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విమానంలో వృద్ధురాలు మృతి, మృతదేహంతోనే గమ్యస్థానానికి చేరింది.
  • విమానంలో అత్యవసర పరిస్థితి నిబంధనలు, ప్రాణాపాయమైతేనే విమానం ఆపుతారు.
  • ఆరోగ్యం క్షీణిస్తే సిబ్బంది ప్రాథమిక చికిత్స అందిస్తారు, అవసరమైతే ల్యాండ్ చేస్తారు.
  • ఎయిర్‌లైన్ నిర్లక్ష్యం ఉంటేనే పరిహారం, సహజ కారణాలకు బాధ్యత ఉండదు.

Airline Compensation Rules : విమాన ప్రయాణం ఈ రోజుల్లో వేగవంతమైనదిగా, సౌకర్యవంతమైనదిగా పరిగణిస్తున్నారు. అయితే ఈ ప్రయాణ సమయంలో కొందరి ఆరోగ్యానికి సంబంధించిన తీవ్రమైన పరిస్థితులు కూడా తలెత్తుతాయి. ఇటీవల జరిగిన ఒక సంఘటనలో.. విమానంలో ఒక వృద్ధురాలు మరణించింది. అటువంటి పరిస్థితిలో ఎయిర్‌లైన్ ఏమి చేస్తుంది? ప్రయాణికులకు లేదా వారి కుటుంబ సభ్యులకు పరిహారం అందిస్తుందా? లేదా అనే ప్రశ్న తలెత్తింది. కాబట్టి విమాన ప్రయాణంలో ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించినా లేదా మరణించినా.. ఎయిర్‌లైన్స్ పరిహారం ఇస్తుందో.. లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

విమానంలో ఏమి జరిగింది?

అంతర్జాతీయ విమానంలో.. టేకాఫ్ అయిన దాదాపు ఒక గంట తర్వాత ఒక మహిళా ప్రయాణికురాలి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించి.. ఆమె మరణించింది. అయినప్పటికీ.. విమానాన్ని మధ్యలో ఆపలేదు. అది గమ్యస్థానానికి చేరుకుంది. మహిళ మృతదేహాన్ని విమానంలోనే వెనుక ఉంచారు. దీనివల్ల కొంతమంది ప్రయాణికులకు అసౌకర్యం కలిగింది.

అత్యవసర పరిస్థితిగా ఎప్పుడు భావిస్తారు?

విమానంలో ప్రతి ఆరోగ్య సమస్యను అత్యవసర పరిస్థితిగా పరిగణించాల్సిన అవసరం లేదు. ఎయిర్‌లైన్ నిబంధనల ప్రకారం.. ప్రయాణికులు లేదా సిబ్బంది ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు.. విమానంలో మంటలు లేదా పొగలు వచ్చినప్పుడు.. విమానం క్యాబిన్ ప్రెజర్ సరిగ్గా లేనప్పుడు.. ఇంజిన్ లేదా ఇంధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు.. బాంబు బెదిరింపు లేదా చెడు వాతావరణం వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే అత్యవసర పరిస్థితి కింద విమానం మధ్యలో ఆపుతారు. అంతేకానీ ఒక ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణించినా.. లేదా మరణించినా.. చాలాసార్లు దీనిని అత్యవసర పరిస్థితిగా పరిగణించరు. విమాన ప్రయాణం కొనసాగుతుంది. 

విమానంలో హెల్త్ కరాబ్ అయితే..

ఒక ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణిస్తే.. క్యాబిన్ సిబ్బంది వెంటనే ప్రాథమిక చికిత్స (CPR వంటివి) అందిస్తారు. విమానంలో వైద్యుడు ఉంటే అతని సహాయం తీసుకుంటారు. పైలట్‌కు పరిస్థితి గురించి చెప్తారు. అవసరమైతే విమానాన్ని సమీప విమానాశ్రయంలో ల్యాండ్ చేయవచ్చు. ఒకవేళ ప్రయాణికుడు మరణిస్తే.. మృతదేహాన్ని దుప్పటి లేదా బాడీ బ్యాగ్‌తో కప్పి ఉంచుతారు. దానిని ఖాళీ సీటులో లేదా విమానం వేరే భాగంలో ఉంచుతారు. ల్యాండింగ్‌కు ముందు విమానాశ్రయ అధికారులు, పోలీసులకు సమాచారం అందిస్తారు. 

ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?

ప్రతి విషయంలో ఎయిర్‌లైన్ పరిహారం అందదు. ఎయిర్‌లైన్ తప్పు లేదా నిర్లక్ష్యం రుజువైతేనే పరిహారం ఇస్తారు. సకాలంలో సరైన చికిత్స లేదా సహాయం అందించకపోతే.. గుండెపోటు వంటి సహజ కారణాల వల్ల మరణం సంభవిస్తే.. సాధారణంగా ఎయిర్‌లైన్ బాధ్యత వహించదు. పరిహారం ఇవ్వదు. 

ఎప్పుడు విమానాన్ని మళ్లించవచ్చంటే..

తీవ్రమైన వైద్య పరిస్థితిలో ప్రయాణికుడి ప్రాణాలను కాపాడవచ్చని భావిస్తే.. పైలట్ విమానాన్ని సమీప విమానాశ్రయానికి మళ్లించవచ్చు. అయితే ఈ నిర్ణయం పూర్తిగా పరిస్థితి తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget