Sweet Potato Soup Recipe : వింటర్ స్పెషల్ చిలగడదుంపల సూప్.. బరువు తగ్గడంలో బెస్ట్ రెసిపీ
Weight Loss Recipe : వింటర్లో బరువును తగ్గించే, వెచ్చదనాన్ని అందించే రెసిపీల్లో చిలగడదుంపల సూప్ రెసిపీ ఒకటి. దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో మీరు ఓ లుక్కేయండి.
Winter Breakfast Recipe : చలికాలంలో బరువు తగ్గడం (Weight Loss) కాస్త కష్టమే. ఎందుకంటే ఉదయాన్నే లేచి.. వ్యాయామం చేసేంత ఉత్సాహం ఎక్కువగా ఉండదు. అలాంటి సమయాల్లో మనం కొన్ని హెల్తీ ఫుడ్స్ తీసుకోవచ్చు. అవి బరువును కంట్రోల్ చేయడంలో, తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. అలాంటి వాటిలో చిలగడదుంపల సూప్ ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి అవసరమైన పోషకాలతో నిండి.. మీరు బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. పైగా ఇది ఎక్కువ కాలం మీరు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.
ఈ సూప్‌లో మనం కొబ్బరి పాలు (Coconut Milk) కూడా కలుపుతాము. ఇది మరిన్ని పోషక పదార్థాలను శరీరానికి అందిస్తుంది. దీనిని తయారు చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. ఇంతకీ ఈ చిలగడదుంపల సూప్ రెసిపీని ఏవిధంగా తయారు చేయవచ్చు. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
చిలగడ దుంపలు - 2 మీడియం సైజ్
ఉల్లిపాయ - 1 మీడియం సైజ్
క్యారెట్ - 2 చిన్నవి
నూనె - 2 టీస్పూన్స్
అల్లం - 1 చిటికెడు
వెల్లుల్లి - 2 రెబ్బలు
జీలకర్ర పొడి - అర టీస్పూన్
కారం- అర టీస్పూన్
వెజిటేబుల్ స్టాక్ - 400 గ్రాములు
కొబ్బరి పాలు - 150 లీటర్
ఉప్పు - రుచికి తగినంత
తయారీ విధానం..
ముందుగా చిలగడ దుంపలు ఉడికించి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ, క్యారెట్, అల్లం, వెల్లుల్లిని బాగా కడిగి.. చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై బాణలి పెట్టండి. దానిలో నూనె వేసి వేడి అయ్యాక దానిలో ఉల్లిపాయ, క్యారెట్ వేయండి. అవి కాస్త ఉడికి, రంగు మారేవరకు వేయించాలి. ఇప్పుడు దానిలో అల్లం, వెల్లుల్లి తరుగును వేసి.. కాస్త వేగనివ్వాలి.
ఇప్పుడు ఉడికించిన చిలగడదుంపలను స్మాష్ చేసి బాణలిలో వేయాలి. జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిలో వెజిటెబుల్ స్టాక్ వేసి బాగా కలపండి. దానిని పది నిమిషాలు మూతపెట్టి.. స్టవ్ సిమ్‌లో ఉంచి.. ఉడకనివ్వండి. ఆ తర్వాత సూప్ వంటి చిక్కదనం కాస్త బ్లెండ్ చేయండి. రుచికి తగ్గట్లు మసాలాలు సర్దుబాటు చేసి.. చివరిగా కొబ్బరి పాలు వేయాలి. దీనిని బాగా కలిపి స్టౌవ్‌ను ఆపేస్తే వేడి వేడి చిలగడ దుంపల సూప్ రెడీ.
చిలగడదుంపల సూప్ రెసిపీ కేవలం రుచికరమైనదే కాదు. చాలా ఆరోగ్యకరమైనది. దీనిని చిన్నపిల్లల నుంచి.. పెద్దలవరకు అందరూ హాయిగా తాగొచ్చు. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడేవారు కూడా తమ డైట్లో దీనిని కలిపి తీసుకోవచ్చు. ఇది మీకు ఉదయాన్నే చలినుంచి ఓదార్పునిస్తుంది. లేదంటే దీనిని నిద్రపోయే ముందు కూడా తీసుకోవచ్చు. కాబట్టి రాత్రి చలిగాలుల నుంచి మీకు ఉపశమనం ఉంటుంది.
Also Read : న్యూ ఇయర్ కోసం క్యారెట్ వాల్నట్ బర్ఫీ.. ఇంట్లోనే సింపుల్‌గా చేసేయొచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.