Sugar Free Gulab Kheer : టేస్టీ టేస్టీ గులాబ్ ఖీర్.. ఇది పూర్తిగా షుగర్ ఫ్రీ రెసిపీ
Sweet Recipe for Diabetics : ఖీర్.. ఇది పండుగలకి.. పబ్బాలకి అందరూ చేసుకునే సింపుల్ స్వీట్ రెసిపీ. కానీ మధుమేహులకు ఇదొక తీరని రిగ్రేట్. అయితే వారికోసం షుగర్ ఫ్రీ ఖీర్ ట్రై చేయవచ్చు.
Sugar Free Gulab Kheer Recipe : న్యూ ఇయర్ దగ్గర్లో ఉంది. సంక్రాంతి కూడా తోడుగానే ఉంది. ఈ సమయంలో పిండి వంటలు.. టేస్టీ టేస్టీ ఖీర్‌లు రెడీ చేసుకుంటూ ఉంటారు. అయితే మధుమేహులు మాత్రం స్వీట్స్ లేకుండా పండుగను చేసుకోవాల్సి ఉంటుంది. ఎంతటి స్వీట్స్ పండుగనైనా చేదుగా చేసుకునేది ఎవరంటే అది షుగర్ పేషెంట్లే. అయితే మీ ఇంట్లో ఎవరైనా షుగర్‌తో ఇబ్బంది పడుతుంటే.. వారికి మీరు స్వీట్ ఫెస్టివల్ ఇవ్వాలనుకుంటే మీరు ఈ టేస్టీ టేస్టీ షుగర్ ఫ్రీ గులాబ్ ఖీర్‌ని రెడీ చేయండి. దీనిని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - 2 టేబుల్ స్పూన్స్
పాలు - ఒకటిన్నర్ లీటర్ (ఫుల్ క్రీమ్)
షుగర్ ఫ్రీ పౌడర్ - రుచికి సరిపడా
నట్స్ - 2 టేబుల్ స్పూన్స్ తరగాలి
యాలకుల పొడి - 1 టీస్పూన్
ఎండిన రోజా పువ్వు రేకులు - 2 టేబుల్ స్పూన్లు
తాజా గులాబీ రేకులు - కొన్ని (గార్నిష్ కోసం)
తయారీ విధానం
బియ్యాన్ని బాగా కడిగి పావు గంట నానబెట్టాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి వెడల్పాడి కడాయి దానిమీద ఉంచి.. పాలను దానిలో వేసి మరింగించాలి. పాలు మరుగుతున్న సమయంలో బియ్యం వేసి ఉడకనివ్వాలి. అన్నం సగానికిపైగా ఉడికిన తర్వాత దానిలో తరిగి పెట్టుకున్న నట్స్, ఎండిన గులాబీ రేకులు, యాలకులు పొడి వేసి బాగా కలపాలి. అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత.. రైస్ ఖీర్ కూడా మీకు కావాల్సిన స్థిరత్వం వస్తుంది.
ఖీర్ చిక్కగా ఉన్నప్పుడు స్టౌవ్ ఆపేసి.. దానిలో షుగర్ ఫ్రీ పౌడర్ వేసి బాగా కలపాలి. అది పూర్తిగా కలుసుకునేలా జాగ్రత్తగా కలపాలి. అంతే వేడి వేడి గులాబ్ ఖీర్ రెడీ. ఇప్పుడు దీనిని గిన్నెలలోకి తీసుకుని వాటిని ఫ్రెష్ గులాబీ రేకులతో గార్నిష్ చేయాలి. ఇది రూమ్ టెంపరేచర్ వచ్చాక.. ఫ్రిజ్‌లో పెట్టుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఖీర్ రెసిపీని మీరు ట్రై చేసినప్పుడు వేడిగా కంటే.. చల్లగా తింటేనే మీరు దానిని రుచిని పూర్తిగా ఆస్వాదించగలుగుతారు.
ఈ టేస్టీ రెసిపీ కేవలం మధుమేహులకు మాత్రమే కాదు. ఎవరైనా దీనిని హ్యాపీగా తినొచ్చు. డైట్ చేస్తూ స్వీట్స్‌కి దూరంగా ఉండేవారు కూడా దీనిని హాయిగా లాగించేయవచ్చు. ముఖ్యంగా మధుమేహులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖీర్‌ను ఆస్వాదించవచ్చు. ఎన్ని ఫంక్షన్లు, పుట్టినరోజులు జరిగినా.. షుగర్ పేషంట్లు స్వీట్లకు దూరంగా ఉండాల్సి వస్తుంది. స్వీట్స్ తిన్నప్పుడేగా నిజమైన పండుగ. అలాంటి సమయంలో వారు దానికి ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటారు. లేదంటే ఎన్ని క్రేవింగ్స్ ఉన్నా.. సైలెంట్‌గా తినడం మానేస్తారు. మీ ఇంట్లో కూడా అలా ఇబ్బంది పడుతున్న మీ వారికి ఈ షుగర్ ఫ్రీ గూలాబీ ఖీర్ చేసి తినిపించేయండి. వారికి కూడా ఫెస్టివల్ వైబ్స్ ఇచ్చేయండి.
Also Read : పనీర్ బేసిన్ దోశ.. సింపుల్, టేస్టీ రెసిపీ ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.