అన్వేషించండి

Solo Travel Safety Tips : సోలో ట్రావెల్ చేయాలనుకుంటే ఈ తప్పులు చేయకండి.. తప్పక గుర్తించుకోవాల్సిన విషయాలివే

Solo Travel Tips : సోలో ట్రిప్ కల్చర్ ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. అయితే మీరు ఒంటరిగా ప్రయాణం చేయాలనుకుంటే కొన్ని విషయాలు తప్పక గుర్తించుకోవాలి. అవేంటో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సోలో ట్రిప్‌లలో గమ్యస్థానం, వసతి వివరాలు ముందుగా తెలుసుకోండి.
  • కుటుంబ సభ్యులతో మీ ప్రయాణ సమాచారం, అప్డేట్స్ పంచుకోండి.
  • కొత్త వ్యక్తులను నమ్మకుండా, వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచండి.
  • పత్రాలు, నగదు జాగ్రత్తగా ఉంచుకోండి, పవర్ బ్యాంక్ తీసుకెళ్లండి.

Avoid These Common Mistakes in Solo Travel : ఈ రోజుల్లో ఫ్రెండ్స్ రాకుంటే ఒంటరిగా ట్రిప్​కి వెళ్లడానికి చాలామంది సిద్ధమవుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో సోల్ ట్రిప్ బాగా ట్రెండ్ అవుతుంది. కొత్త ప్రదేశాలను ఎక్స్​ప్లోర్ చేయడానికి, తమతో తాము సమయం గడపడానికి, కొత్త పరిచయాలు, అనుభవాలు పొందేందుకు సోలో ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ సోలో ట్రిప్​కి వెళ్లేప్పుడు మీ సేఫ్టీని కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు మొదటిసారి ఒంటరిగా ప్రయాణిస్తుంటే.. కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. 

డెస్టినేషన్ డిటైల్స్..

మీరు ట్రిప్​కి వెళ్లే ముందు మీరు వెళ్లబోతున్న ప్లేస్​ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. అక్కడి వాతావరణం, ట్రెడీషన్​కి తగ్గట్లు అవసరమైన వస్తువులు, దుస్తులు సర్దుకోవాలి. అలాగే మీరు ఎక్కడికి వెళ్తున్నారనే సమాచారాన్ని కుటుంబ సభ్యులతో లేదా మీరు నమ్మే వారితో కచ్చితంగా షేర్ చేసుకోవాలి. 

Also Read : ఫ్యామిలీతో ట్రిప్​కు ప్లాన్ చేస్తున్నారా? తక్కువ బడ్జెట్​లో ఇండియాలో వెళ్లేందుకు బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే

బుకింగ్ ముందే చేసుకుంటే బెటర్..

మీరు వెళ్లే ప్రాంతంలో ట్రావెల్ సౌకర్యాలు, హోటల్ డిటైల్స్, సమీపంలోని ముఖ్యమైన ప్రదేశాల గురించి ముందుగానే తెలుసుకోండి. మీరు కొత్త ప్రదేశానికి ప్రయాణిస్తుంటే.. రాత్రి కంటే సాయంత్రంలోపు అక్కడికి చేరుకునేలా బుక్ చేసుకోవాలి. అలాగే హోటల్ లేదా స్టేయింగ్ ముందుగానే బుక్ చేసుకోండి. ఈ డిటైల్స్ మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి. అలాగే మీ ఇంట్లో వారికి పంపండి. 


Solo Travel Safety Tips : సోలో ట్రావెల్ చేయాలనుకుంటే ఈ తప్పులు చేయకండి.. తప్పక గుర్తించుకోవాల్సిన విషయాలివే

ఐడీ కార్డ్స్ ముఖ్యం..

టిక్కెట్లు, గుర్తింపు కార్డు, హోటల్ బుకింగ్‌ల వంటి ముఖ్యమైన పత్రాల ఫోటోలను మీ ఫోన్‌లో సురక్షితమైన ప్రదేశంలో ఉంచుకోండి. ఒక్కరే వెళ్తున్నారు కాబట్టి ఎక్కువ లగేజ్ తీసుకెళ్లకపోవడమే మంచిది. లోకల్గా దొరికే వాటిని ట్రై చేయండి. 

Also Read : వర్షాకాలంలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మాన్‌సూన్ ట్రిప్‌కు ఇండియాలో ఇవే బెస్ట్

కొత్త వ్యక్తులతో జాగ్రత్త

ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు కొత్త వ్యక్తులను కలవడం, వారితో మాట్లాడటం మంచిదే అయినప్పటికీ.. వారిని త్వరగా నమ్మడం అంత మంచిది కాదు. మీ వ్యక్తిగత సమాచారం, హోటల్ గది వివరాలు లేదా ప్రయాణ వివరాలను వారితో పంచుకోకపోవడమే మంచిది. అలాగే మీ ఫోన్, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు వెళ్లే ప్రదేశం నిర్మానుష్యంగా కనిపిస్తే.. ఒంటరిగా అక్కడికి వెళ్లకపోవడమే మంచిది. 


Solo Travel Safety Tips : సోలో ట్రావెల్ చేయాలనుకుంటే ఈ తప్పులు చేయకండి.. తప్పక గుర్తించుకోవాల్సిన విషయాలివే

రాత్రిపూట ఒంటరిగా ప్రయాణించే బదులు.. సురక్షితమైన, జనసామర్థ్యం ఉండే ప్రదేశాలను ఎంచుకోండి. క్యాబ్ లేదా ఆటోను అద్దెకు తీసుకున్నప్పుడు.. వాహనం, డ్రైవర్ సమాచారాన్ని చెక్ చేసుకోండి చేసుకోండి. మార్గమధ్యంలో ఏదైనా అనుమానాస్పదంగా లేదా అసురక్షితంగా అనిపిస్తే.. వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయి.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ లేదా పోలీసులను ఆశ్రయించవచ్చు.

Also Read : బేబీమూన్ అంటే ఏమిటి? ఇండియాలో ట్రెండ్ అవుతున్న ఈ ట్రిప్‌కు ఎప్పుడు వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేసుకోవాలి?

షేరింగ్ ఇంపార్టెంట్..

మీరు సోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీ కుటుంబ సభ్యులకు లేదా సన్నిహితులకు మీ ట్రిప్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉండాలి. వారికి మీ హోటల్ చిరునామా, ట్రావెల్ డేట్స్, ముఖ్యమైన ఫోన్ నంబర్లను పంపండి. రోజుకు కనీసం ఒక్కసారైనా మీరు ఉన్న ప్రదేశం, ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పడం మంచిది. 

మరిన్ని జాగ్రత్తలు

మీ ఫోన్ బ్యాటరీ అయిపోకుండా ఉండేందుకు పవర్ బ్యాంక్‌ను వెంట తీసుకెళ్లండి. ఇంటర్నెట్ సమస్యలు ఉంటే ముందుగానే మ్యాప్స్, నంబర్లను సేవ్ చేసుకోండి. అలాగే పెద్ద మొత్తంలో నగదును వెంట ఉంచుకోవడానికి బదులుగా కార్డులు లేదా ఆన్‌లైన్ చెల్లింపులు చేస్తే మంచిది. ఈ కొద్దిపాటి జాగ్రత్తలతో మీరు హ్యాపీగా సోలో ట్రిప్స్ ఎంజాయ్ చేయవచ్చు. 

Also Read : ఇంటర్నేషనల్​ ట్రిప్​కోసం అజర్‌బైజాన్‌ బెస్ట్.. 5 రోజుల ప్రణాళికతో ఇలా ఎక్స్​ప్లోర్ చేయండి

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Desk Job Joint Pain : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
High BP : అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
Snake Gourd Dal : పొట్లకాయతో ఇలా పప్పు చేసుకోండి.. వేడి వేడి అన్నంలో, వడియాల కాంబినేషన్​తో తింటే ఆ రుచే వేరు
పొట్లకాయతో ఇలా పప్పు చేసుకోండి.. వేడి వేడి అన్నంలో, వడియాల కాంబినేషన్​తో తింటే ఆ రుచే వేరు
Yoga Poses for Lower Back : నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది
నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Embed widget