అన్వేషించండి

Healthy Lifestyle Tips : గుండె జబ్బులు రాకుండా, హార్ట్​ను హెల్తీగా ఉంచే సింపుల్ టిప్స్ ఇవే

Healthy Heart : గుండె జబ్బులు ఈరోజుల్లో చాలా కామన్ అయిపోతున్నాయి. సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ రెగ్యూలర్​గా ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..

Healthy Habits to Reduce Heart Disease Risk : వయసుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. ఏ రీజన్​ వల్ల.. ఎప్పుడు గుండె ట్రిగ్గర్ అవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. కానీ కొన్ని రెగ్యూలర్​ టిప్స్​ను ఫాలో అయితే గుండె సమస్యలను కంట్రోల్ చేయవచ్చంటున్నారు నిపుణులు. మగవారైనా.. ఆడవారైనా ఈ సింపుల్ టిప్స్​ను ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. ఇంతకీ జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేయాలి? ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

బ్యాలెన్స్​డ్ డైట్.. 

శారీరకంగా, మానసికంగా హెల్తీగా ఉండాలంటే లైఫ్​ స్టైల్​లో ముందుగా చేయాల్సిన మార్పు ఫుడ్​దే. మనం తీసుకునే ఆహారం మన జీవితంలో అతిపెద్ద రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో చేసే మార్పులు పూర్తి ఆరోగ్యంపై మంచి ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సమతుల్యమైన ఆహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. పండ్లు, కూరగాయలు, మల్టీ గ్రైయిన్స్, లీన్ ప్రోటీన్స్​ డైట్​లో ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. అలాగే ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు, స్వీట్స్​ని డైట్​లో నుంచి తీసేస్తే చాలా మంచిదని సూచిస్తున్నారు. 

కొలెస్ట్రాల్..

శరీరంలో కొలెస్ట్రాల్ ఉంటే గుండె సమస్యలు కొని తెచ్చుకున్నట్టే. అందుకే కొలెస్ట్రాల్​ని కంట్రోల్​లో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే అది గుండెను బ్లాక్ చేసి.. శరీరంలోని వివిధ భాగాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దీనిని తగ్గించుకునేందుకు రెగ్యూలర్​గా వ్యాయామం చేయడంతో పాటు.. ఫ్యాచురేటడ్​ డైట్​ ఫాలో అవ్వాలి. ఇవి కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేసి గుండెను హెల్తీగా ఉంచుతాయి. 

వ్యాయామం.. 

రోజూ కనీసం అరగంటైనా వ్యాయామం చేయాలి. లేదంటే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. కార్డియో చేస్తే మరీ మంచిది. సైకిల్, వాకింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ చేస్తూ ఉంటే గుండెకు మెరుగైన రక్తప్రసరణ అందుతుంది. దీనివల్ల గుండె సమస్యలు దూరమవుతాయి. వీటితో కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్​లో ఉంటుంది. 

స్మోకింగ్ అలవాటు ఉందా?

స్మోకింగ్ అలవాటు ఉండేవారికి క్యాన్సర్​తో పాటు.. గుండె సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పొగాకు ఉపయోగించేవారిలో గుండె సమస్యలు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాలు ఇప్పటికే తేల్చాయి. కాబట్టి వీలైనంత త్వరగా స్మోకింగ్ మానేస్తే మంచిది. దీనివల్ల హార్ట్ ఎటాక్, గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. 

మందు తగ్గించాలట.. 

మద్యం ఎక్కువగా తాగే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త మీరు దానిని వీలైనంత త్వరగా మానేయండి. లేదంటే దానిని కంట్రోల్ చేయండి. లేదంటే మద్యం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండె సమస్యలను రెట్టింపు చేస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా దీనిని మానేయాలంటున్నారు. మహిళలు వారానికో పెగ్.. పురుషులు రెండు పెగ్స్ తీసుకోవచ్చట. అంతకుమించి మాత్రం వద్దని చెప్తున్నారు. 

ఒత్తిడి ఉంటే.. 

ఒత్తిడి ఎక్కువ ఉంటే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే ఒత్తిడి వల్ల రక్తపోటు ఎక్కువై హార్ట్ సమస్యలు వస్తాయట. ఒత్తిడితో హార్ట్​ ఎటాక్​ వచ్చి ఎందరో ప్రాణాలు కూడా వదిలేస్తున్నారు. అందుకే ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు ఫాలో అవ్వాలంటున్నారు. డీప్ బ్రీతింగ్, యోగా, మెడిటేషన్ రెగ్యూలర్​గా చేస్తే ఒత్తిడి దూరమవుతుందట.

బరువు తగ్గాల్సిందే.. 

అధిక బరువు వివిధ ఆరోగ్య సమస్యలను తీసుకువస్తుంది. అందుకే బరువును తగ్గించుకోవాలి. ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉంటే గుండె ఆరోగ్యానికే ప్రమాదం. హెల్తీ డైట్, రెగ్యూలర్ వ్యాయామం.. నిద్రను ఫాలో అయితే బరువును కంట్రోల్ చేసుకోవచ్చు. నిపుణుల సలహాలు ఫాలో అవుతూ బరువును తగ్గించుకోవాలంటున్నారు. 

నిద్ర సమస్యలు

రోజూ 8 గంటలు కనీసం 7 గంటలు నిద్ర ఉండాలి. రాత్రి నిద్ర ఎంత బాగా ఉంటే.. గుండె సమస్యలు అంత దూరమవుతాయి. ఎంత తక్కువ ఉంటే గుండె సమస్యలు అంత తీవ్రమవుతాయి. పైగా నిద్ర అనేది ఇప్పటివరకున్న అన్ని అంశాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తుంది. అందుకే నిద్రను అస్సలు విస్మరించవద్దని చెప్తున్నారు నిపుణులు. 

ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే టిప్సే. నీటిని తాగుతూ.. హైడ్రేటెడ్​గా ఉండాలి. మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. సమయానికి మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటే గుండె హెల్తీగా ఉంటుందంటున్నారు నిపుణులు. మీ లైఫ్​లో ఈ మార్పులు చేసి చూడండి. కచ్చితంగా మీ పూర్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

Also Read : సరైన బ్రా వేసుకోకుంటే క్యాన్సర్ వస్తుందా? బ్రా సైజ్​ని ఎలా తెలుసుకోవాలి? ఏ డ్రెస్​కి ఎలాంటి బ్రా వేసుకుంటే బెస్ట్?

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Embed widget