అన్వేషించండి

Fever: తేలికపాటి జ్వరమేనని తేలిగ్గా తీసుకోవద్దు, అది చాలా డేంజర్

జ్వరం తగ్గిన తర్వాత కూడా నీరసంగానే ఉంటుంది. కానీ దాన్ని తేలికగా తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రత 97 నుంచి 98.6 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు ఉంటుంది. అది దాటి ఒక్క పాయింటు ఎక్కువ వచ్చినా జ్వరం వచ్చేసిందని అనిపిస్తుంది. కాస్త శరీరం వేడిగా ఉన్నా, టెంపరేచర్‌లో మార్పులు వచ్చినా జ్వరం వచ్చేసిందని అనుకుంటారు. ఈ టెంపరేచర్ శరీరాన్ని బట్టి ఒక్కోసారి మారుతూ ఉంటుంది. 98.6 డిగ్రీల టెంపరేచర్ దాటింది అంటే జ్వరం వచ్చేసిందని ట్యాబ్లెట్ వేసేసుకుంటారు. కానీ అది ఒక్కోసారి సాధారణంగా కూడా వస్తుందనే విషయం చాలా తక్కువ మంది గ్రహిస్తారు. అయితే తేలికపాటి జ్వరం తరచూ వస్తూ ఉంటే మాత్రం అది ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు సూచిస్తున్నారు. అది శరీరంలో ఇన్ఫెక్షన్ ఉంది అనేందుకు సూచిక అని చెప్తున్నారు.

శరీర ఉష్ణోగ్రత ఒక్కొకరికి ఒక్కోలా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాతావరణంలో మార్పుల వల్ల శరీర ఉష్ణోగ్రతలో కూడా హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణ వ్యక్తిలో సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య పరిగణించబడుతుంది. సాయంత్రం చివరి గంటలో 99.4 డిగ్రీల ఫారెన్ హీట్ నమోదవుతుంది. ఇది సాధారణ శరీర ఉష్ణోగ్రత గరిష్ట పరిమితి. కానీ ఇదే ఉష్ణోగ్రత ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యలో నమోదైతే జ్వరంగా పరిగణించబడుతుంది.

జ్వరం వస్తూ ఉంటే అశ్రద్ధ వద్దు 

శరీరంలో అసాధారణంగా వచ్చిన ఉష్ణోగ్రత వల్ల నీరసంగా అనిపిస్తుంది. జ్వరంగా అనిపించి వెంటనే చాలా మంది పారాసేటమాల్ వేసేసుకుంటారు. అయితే జ్వరాన్ని బాధించేది ఏంటనేది తెలియదు. జ్వరం వచ్చినప్పుడు శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. ఒక్కోసారి విపరీతమైన శ్రమకి గురైనప్పుడు కూడా అలసట వల్ల జ్వరంగా అనిపిస్తుంది. ఏడు రోజులు జ్వరం వస్తూనే ఉంటే అది వైరల్ ఫీవర్ గా మారుతుంది. 4 లేదా 5 రోజుల్లో తగ్గిపోతే అది ఒక్కోసారి డెంగ్యూ అవ్వచ్చు. అయితే తగ్గినట్టుగా అనిపిస్తుంది కానీ సమస్యలు మాత్రం వస్తాయి. అందుకే జ్వరం తగ్గింది కదా అశ్రద్ద చెయ్యకూడదు.

తేలికపాటి జ్వరం వస్తూ పోతూ ఉంటే అది ప్రమాదకరం. తగ్గిపోతుంది కదా అని పట్టించుకోకుండా వదిలేస్తే అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే శరీరంలో ఇన్ఫెక్షన్ ఉంటేనే ఇలా తరచూ జ్వరం వస్తుందని నిపుణులు అంటున్నారు. ఇన్ఫెక్షన్ అతిపెద్ద సైలెంట్ కిల్లర్. కనిపించకుండా లోలోపల శరీరాన్ని నాశనం చేసేస్తుంది. అందుకే చికిత్స అవసరమని సూచిస్తున్నారు. జ్వరం వచ్చిన వెంటనే పారాసేటమాల్ వేసుకోగానే రిలీఫ్ వస్తుంది. కానీ అనారోగ్యం మాత్రం తగ్గదు. అటువంటి సమయంలో వెంటనే వైద్యులని సంప్రదించడం అవసరం. మైకం, వణుకు, నడవలేకపోవడం, గందరగోళంగా అనిపించడం, చాలా బలహీనంగా ఉండటం, చిరాకు, మూత్రం ఎక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా డాక్టర్ ని కలవాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also read: ఈ ఐదు ఆకుపచ్చని పదార్థాలు తింటే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget