Artificial Sweeteners : కృత్రిమ స్వీటేనర్లు తీసుకుంటున్నారా? ఈ దుష్ప్రభావాలు తెలిస్తే అసలు ముట్టుకోరు
మధుమేహులు చక్కెర తీసుకోలేరు కాబట్టి ఆర్టిఫిషియల్ స్వీటేనర్లకు మొగ్గు చూపుతారు. ఇవి మంచిదని భావిస్తారు. కానీ వీటి వల్ల జరిగే మేలు కంటే హాని ఎక్కువగా ఉంటుంది.
![Artificial Sweeteners : కృత్రిమ స్వీటేనర్లు తీసుకుంటున్నారా? ఈ దుష్ప్రభావాలు తెలిస్తే అసలు ముట్టుకోరు Serious Side Effects Of Artificial Sweeteners Artificial Sweeteners : కృత్రిమ స్వీటేనర్లు తీసుకుంటున్నారా? ఈ దుష్ప్రభావాలు తెలిస్తే అసలు ముట్టుకోరు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/f3e8ba3988540704bb1c28b8cf49be251683700426781521_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
చక్కెరకి ప్రత్యామ్నాయంగా ఎక్కువ మంది కృత్రిమ స్వీటేనర్లు తీసుకుంటారు. అందుకే వీటికి ప్రజాదరణ కూడా ఎక్కువ. సాచరిన్, అస్పర్టమే, ఎసిసల్ఫేమ్ పొటాషియం (ఎసిసల్ఫేమ్-కె, లేదా ఏస్-కె), సుక్రలోజ్, నియోటామ్, అడ్వాంటేమ్ అడిటివ్ చక్కెరను సులభంగా భర్తీ చేయగల కృత్రిమ స్వీటెనర్‌లకు కొన్ని ఉదాహరణలు. మధుమేహం, ప్రీ డయాబెటిస్ ఉన్నవాళ్ళు, బరువు తగ్గాలనుకునే వాళ్ళు తరచుగా ఈ తక్కువ కేలరీల స్వీటేనర్లు ఎంచుకుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె పోటుతో సహ అనేక హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాదు కృత్రిమ స్వీటేనర్లు కాలేయానికి హాని కలిగిస్తాయి. మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. మైగ్రేన్లు, తలనొప్పికి కారణమవుతాయి. వీటి వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలు ఇవి.
బరువు పెరగడం
కృత్రిమ స్వీటేనర్లు కేలరీలను తగ్గించడానికి బరువు తగ్గించేందుకు సహకరిస్తాయని అనుకుంటారు. కానీ నిజానికి ఇవి బరువు పెరగడానికి ఇక కారకంగా ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. ఎందుకనటే ఇవి కేలరీలు తీసుకోవడం నియంత్రించే శరీర సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తాయి. ఫలితంగా అతిగా తినడం, స్వీట్ తినాలనే కోరికలను పెంచుతాయి.
మానసిక రుగ్మతలు
మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్ స్థాయిలు కృత్రిమ స్వీటెనర్ల ద్వారా ప్రభావితమవుతాయి. ఇవి మానసిక స్థితిని మార్చగలవు. అవి మెదడులోని సెరోటోనిన్ స్థాయిలను తగ్గిస్తాయని నిరూపించబడింది. ఇది మానసిక స్థితి, ఆందోళనను నియంత్రించడంలో కీలకమైనవి న్యూరోట్రాన్స్మిటర్.
కాలేయానికి హాని
ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కలిగిస్తాయి. ట్రైగ్లిజరైడ్స్ అనేది లిపిడ్ రూపం, అస్పర్టమేతో సహా కొన్ని స్వీటెనర్లు వీటిని ఎక్కువగా ఉత్పత్తి చేయగలవు. కాలక్రమేణా ఈ ట్రైగ్లిజరైడ్లు కాలేయంలో పేరుకుపోయి హాని కలిగిస్తాయి.
గట్ ఆరోగ్యం దెబ్బతింటుంది
కృత్రిమ స్వీటేనర్లు కడుపులోని హానికరమైన సూక్ష్మజీవులను పెంచుతాయి. గట్ మైక్రోబయోటాలో మార్పులు వచ్చేలా చేస్తాయి. సహజ చక్కెర మాదిరిగా జీవక్రియకి సహాయం చెయ్యవు. గ్యాస్, ఉబ్బరం, అతిసారంతో సహ జీర్ణశయాంతర సమస్యలకు దారి తీస్తుంది.
వ్యాధులను పెంచుతుంది
టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, మెటబాలిక్ సిండ్రోమ్ తో సహ అనేక వ్యాధుల ప్రమాదాన్ని ఇది పెంచుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని తీపి పదార్థాలు ఇన్సులిన్ నిరోధకతను పెంచుతాయి. గట్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కడుపులో మంటను వూరదధి చేస్తాయి. ఇవి తీసుకోవడం వల్ల వ్యాధుల వల్ల కలిగే పరిస్థితి మరింత దిగజారుతుంది.
మైగ్రేన్
కృత్రిమ స్వీటేనర్లు మెదడు, నాడీ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. న్యూరోట్రాన్స్మిటర్ స్థాయిలు, రక్త ప్రవాహంలో మార్పులు కలిగిస్తాయి. దీని ఫలితంగా తలనొప్పి, మైగ్రేన్లు సమస్య ఎక్కువ అవుతుంది.
ఇవే కాదు కృత్రిమ స్వీటేనర్లు వాడిన వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉందని గతంలో ఒక అధ్యయనం హెచ్చరించింది. ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్, ఊబకాయం వచ్చే అవకాశాలు పెంచుతుందని వెల్లడించింది. అందుకే వాటి వాడకం ఎంత తక్కువగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మహిళలూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మ్యాజికల్ ఫుడ్ టిప్స్ పాటించాల్సిందే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)