Thumb Sucking Habit : మీ పిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటున్నారా? ఇలా మాన్పించేయండి
మీ పిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటున్నారని చింతిస్తున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలో అవుతూ వారిని ఈ అలవాటు నుంచి దూరం చేసేయండి.
Thumb Sucking Habit : అప్పుడే పుట్టిన పిల్లలు నుంచి కొందరు పెద్దవారి వరకు ఉండే కామన్ అలవాటు నోట్లో వేలు పెట్టుకోవడం. ఈ అలవాటును పోనిలే అనే వదిలేస్తే అది మానుకోలేని వ్యసనంగా మారిపోతుంది. అంతేకాకుండా ఈ అలవాటులో ముఖంలో మార్పులు వస్తాయి అంటున్నారు నిపుణులు. అందుకే దానిని మాన్పించేందుకు తల్లిదండ్రులు చాలా కష్టపడుతూ ఉంటారు. మరి దీనివల్ల ముఖంలో కలిగే మార్పులు ఏమిటో? పిల్లల్లో, పెద్దవారిలో ఈ అలవాటును ఎలా ఆపాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సైడ్ ఎఫెక్ట్స్..
నవజాత శిశువులు ఊరికో నోట్లో వేలు పెట్టుకుంటారు. ఇది వారికి ప్రశాంతతను ఇచ్చి నిద్రను అందిస్తుంది. పెద్దగా అయ్యేకొద్ది ఇది ఓ అలవాటుగా మారిపోతుంది. నోట్లో వేలు పెట్టుకోకపోతే నిద్ర పట్టని స్థితికి చేరిపోతారు. అయితే ఈ అలవాటు వల్ల వెంటనే ఎలాంటి పరిణామాలు ఎదురుకాకపోవచ్చు కానీ.. శాశ్వతమైన దుష్ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా దంతాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
నోట్లో వేలు పెట్టుకుని అలవాటు వల్ల దంతాలపై గణనీయమైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనివల్ల దంత నష్టంతో పాటు నత్తి, మాట్లాడుతున్నప్పుడు పదాలు సరిగ్గా పలకలేకపోవడం వంటి అవరోధాలు వస్తాయి. అంతేకాకుండా పిల్లలు బొటనవేలును నోట్లో పెట్టుకున్నప్పుడు అది వారి ముందు దంతాలు బయటకి వంగిపోయేలా చేస్తుంది. ఈ ప్రక్రియ కంటిన్యూ అయితే దంత సమస్యకు దారితీస్తుంది. అంతేకాకుండా ఎత్తు పళ్లు ముఖకవలికల్లో పెనుమార్పులు కలిగిస్తాయి.
ఈ చిట్కాలతో దూరం చేసేయండి..
నోట్లో వేలు పెట్టుకోవడం వల్ల ఏర్పడే దంత సమస్యలను సరిచేయడానికి చాలా మంది బ్రేస్‌లు ఉపయోగిస్తున్నారు. అయితే చిన్ననాటి నుంచే ఈ అలవాటును ఆపేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. వారిపై సీరియస్ అవ్వడమో.. కొట్టడమో చేయకుండా ప్రేమగా వారి అలవాటును దూరం చేసేందుకు ప్రయత్నించాలి. థంబ్ గార్డ్స్ లేదా గ్లోవ్ వంటివి నోట్లో వేలు పెట్టుకునే అలవాటును చాలావరకు తగ్గిస్తాయి. నోట్లో వేలు పెట్టుకోవడం మానేస్తే మీకు గిఫ్ట్ ఇస్తానని చెప్పవడం వంటివి బాగా పనిచేస్తాయి. లేదంటే రోజుకో స్టిక్కరు ఇచ్చి వాళ్లని ఉత్సాహపరచవచ్చు.
ట్రిగర్ పాయింట్స్
అసలు ఏ సమయంలో వాళ్లు వేలు చప్పరిస్తున్నారో గుర్తించండి. చాలా మంది నిద్రపోయే ముందు నోట్లో వేలు పెట్టుకుంటారు. మరికొందరు ఒత్తిడి, విసుగు లేదా అలసటలో ఉన్నప్పుడు వేలు పెట్టుకుంటారు. ఈ ట్రిగర్ పాయింట్స్ మీరు గుర్తించి.. వారికి పరిష్కారాలు చూపిస్తే అలవాటును తగ్గించవచ్చు. లేదంటే మీరు వారు చేతులు ఖాళీగా ఉంచకుండా ఏ బొమ్మలు ఇచ్చి ఆడుకోమనడమో.. డ్రాయింగ్స్, పజిల్స్ వంటి వాటిని చేయించవచ్చు.
పెద్దవారు ఇలా మానేయొచ్చు..
పెద్దవాళ్లు ఈ అలవాటును వదిలించుకోవాలనుకుంటే.. ధ్యానం, వ్యాయామం, ఒత్తిడి ఉపశమన పద్ధతులను ప్రయత్నించాలి. వేలును ఫాబ్రిక్‌తో కవర్ చేయవచ్చు. లేదంటే చేదుగా ఉండే పదార్థాలను దానిపై అప్లై చేయవచ్చు. స్ట్రెస్ బాల్‌తో మీ చేతులను బిజీగా ఉంచుకోవచ్చు. లేదంటే మీరు గమ్‌ను ట్రై చేయవచ్చు. అలవాటు ముదిరిపోతే మీరు మానసిక వైద్యుడిని సంప్రదించవచ్చు. ఇది మీకు మెరుగైన ఫలితాలు అందిస్తుంది.
Also Read : గ్రీన్ టీ నచ్చట్లేదా? అయితే రోజ్ గ్రీన్ టీ ట్రై చేయండి..