News
News
X

Sarvapindi: తెలంగాణ ఫేమస్ వంటకం సర్వపిండి, ఇలా చేస్తే టేస్టు అదిరిపోతుంది

తెలంగాణ ఎన్నో వంటకాలకు ప్రసిద్ధి. వాటిలో ఒకటి సర్వపిండి.

FOLLOW US: 

తెలంగాణలో చాలా ఫేమస్ అయిన సాంప్రదాయక వంటకం సర్వపిండి . దీన్ని ఇన్‌స్టాంట్‌గా చేసుకోవచ్చు.  దీన్ని సర్వపిండి, సర్వప్ప,గిన్నె పిండి, తపాలా చెక్క , గంజుపిండి.. ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు.  అతి తక్కువ సమయంలోనే దీన్ని ప్రిపేర్ చేయవచ్చు. కామన్ మ్యాన్ పిజ్జాగా పేరుందిన దీన్ని వచ్చిన అతిథులకు కూడా అప్పటికప్పుడే తయారుచేసి వేడివేడిగా వడ్డించవచ్చు. దీనిలో వాడే పదార్థాలన్నీ అతి తక్కువ ధరలోనే దొరకడంతో తెలంగాణవాసులు దీన్ని ఎంతగానో ఇష్టపడతారు. వివిధ పట్టణాల్లో కుటీర పరిశ్రమగా కూడా ఈ వంటకాన్ని తయారుచేసి విదేశాలకు సైతం ఎగుమతి చేస్తారు. అనేక కుటుంబాలకు  ఉపాధి అందిస్తున్న వంటకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ మధ్యే అట్టహాసంగా జరిగిన బిజెపి సభలో సైతం ఈ వంటకాన్ని ఆ పార్టీ ప్రతినిధులకు వడ్డించారు. ఇలా వివిధ ముఖ్య కార్యక్రమాల్లో ఈ ఇన్స్టెంట్ స్నాక్ ప్రత్యేక ఆకర్షణగా మారింది దీంతో దీని పేరు తెలంగాణ నుండి ప్రస్తుతం దేశం అంతటా వ్యాపించింది. దీని రుచి కూడా అదిరిపోతుంది. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటుంది సర్వపిండి. దీన్ని చేసుకోవడం కూడా చాలా సులువు, బిగినర్స్ కూడా చేయవచ్చు. 

కావాల్సిన పదార్థాలు
బియ్యంప్పిండి - ఒక కప్పు
కొత్తిమీరు తురుము - రెండు స్పూన్లు
కరివేపాకు తురుము - ఒక స్పూను
కారం - రెండు స్పూన్లు
ఉల్లిపాయ - ఒకటి
ఉప్పు - రుచికి సరిపడా
నానబెట్టిన శెనగపప్పు - రెండు స్పూన్లు
నువ్వులు - రెండు స్పూన్లు
పల్లీలు - రెండు స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
ధనియాలు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
నూనె - తగినంత 

తయారీ ఇలా
1. ఒక బౌల్ తీసుకుని దాని బియ్యంపిండి వేయాలి. 
2. దానిలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము, కరివేపాకులు, కారం, నువ్వులు, శెనగపప్పు, వేయించిన పల్లీలు వేసి కలపాలి. 
3. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి వేసి కచ్చాపచ్చాగా మిక్సీలో పొడి చేసుకోవాలి. 
4. ఈ పొడిని, ఉప్పుని కూడా బియ్యంపిండి మిశ్రమంలో కలపాలి. 
5. ఆ పిండిలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. 
6. పిండి ముద్దని కలిపి ఓ అయిదు నిమిషాల పాటూ పక్కన పెట్టుకోవాలి. పైన మూత పెట్టాలి. 
7. ఇప్పుడు కళాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి మొత్తం పరచాలి. 
8. పిండి ముద్దని వేసి కళాయి అడుగున వేసి చపాతీలా చేత్తోనే ఒత్తుకోవాలి. 
9. మధ్యలో అయిదారు రంధ్రాలు చేసుకోవాలి. ఆ రంధ్రాల్లో కూడా నూనె వేయాలి. 
10. స్టవ్ వెలిగించి చిన్న మంట మీద ఉంచాలి. పైన మూత పెట్టాలి. 
11. దాదాపు ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటూ ఉడికించాలి. 
12. అంతే సర్వపిండి రెడీ అయిపోతుంది. 

Also read: వాయిదా వేసే అలవాటుంటే చాలా ప్రమాదం, భవిష్యత్తులో డిప్రెషన్ వచ్చే అవకాశం ఎక్కువ

Also read: గర్భనిరోధక మాత్రల వల్ల భవిష్యత్తులో గర్భస్రావం, క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయా? ఏది అపోహ, ఏది నిజం?

Also read: క్లియోపాత్రా అందం రహస్యం ఇదే, ఇలా చేస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

Published at : 03 Sep 2022 03:46 PM (IST) Tags: Telugu vantalu Telugu recipes Sarvapindi recipe Sarvapindi recipe in Telugu Sarvapindi Thapala Chekka

సంబంధిత కథనాలు

రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారికి అలెర్ట్, ఈ జబ్బులు అతి త్వరగా వచ్చే అవకాశం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారికి అలెర్ట్, ఈ జబ్బులు అతి త్వరగా వచ్చే అవకాశం

Potatoes: బంగాళాదుంపలు తొక్క తీసి వండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో నష్టం, ఈ లాభాలన్నీ కోల్పోవాల్సిందే

Potatoes: బంగాళాదుంపలు తొక్క తీసి వండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో నష్టం, ఈ లాభాలన్నీ కోల్పోవాల్సిందే

వాతావరణం చల్లగా ఉందా? ఆ సమయంలో మీరు తినకూడని కూరగాయలు ఇవే

వాతావరణం చల్లగా ఉందా? ఆ సమయంలో మీరు తినకూడని కూరగాయలు ఇవే

Lumpy Skin Disease : లంపి స్కిన్ డిసీజ్ మనుషులకు వ్యాపిస్తుందా? ఆ వైరస్ లక్షణాలు ఏంటి?

Lumpy Skin Disease : లంపి స్కిన్ డిసీజ్ మనుషులకు వ్యాపిస్తుందా? ఆ వైరస్ లక్షణాలు ఏంటి?

Diabetes: మీ శరీరం నుంచి వచ్చే వాసన మీకు డయాబెటిస్ ఉందో లేదో చెప్పేస్తుంది, ఎలాగంటే

Diabetes: మీ శరీరం నుంచి వచ్చే వాసన మీకు డయాబెటిస్ ఉందో లేదో చెప్పేస్తుంది, ఎలాగంటే

టాప్ స్టోరీస్

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Jinping House Arrest: షాకింగ్! గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు- సైన్యం చేతిలోకి దేశం!

Jinping House Arrest: షాకింగ్! గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు- సైన్యం చేతిలోకి దేశం!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?