News
News
X

Sai Pallavi Secrets: సాయిపల్లవి జీరో సైజ్ ఫిగర్ వెనుక రహస్యాలివే...

టాలీవుడ్ ఆరాధ్య దేవతలా మారిపోయింది సాయిపల్లవి. ఆమె ఉంటే చాలు సినిమా హిట్ అనే టాక్ వచ్చేసింది.

FOLLOW US: 

జలపాతంలా జారే కురులు, ఒంట్లో ఎముకలున్నాయా అనిపించేలా చేసే నాట్యం, మేకప్ అవసరం లేని ముఖ వర్చస్సు, జిమ్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే జీరో సైజ్ ఫిగర్... ఇంతందాన్ని కలిపి చూస్తే సాయిపల్లవి. నేచురల్ బ్యూటీగా పేరుతెచ్చకున్న సాయిపల్లవి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఆరాధ్య దేవతలా మారపోయింది. ఈమధ్యనే విడుదలైన లవ్ స్టోరీ సినిమాతో ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఆమె అందం, ఫిట్నెస్ వెనుక రహస్యాలు తెలుసుకునేందుకు గూగుల్ సెర్చ్ చేయని అభిమాని లేడేమో. 

డ్యాన్స్ చాలు...
చాలా మంటి నటీమణులు మంచి ఫిగర్ కోసం, బరువు తగ్గడం కోసం గంటలుగంటలు జిమ్ చేస్తూ ఉంటారు. కానీ సాయిపల్లవి మాత్రం ఇంతవరకు జిమ్ లో అడుగుపెట్టలేదని చాలా సార్లు చెప్పింది. తనకు మంచి శరీరాకృతి, ఫ్లెక్సిబిలిటీ వచ్చి కేవలం డ్యాన్స్ వల్లేనని చెబుతోంది. తాను రోజూ కాసేపు డ్యాన్స్ చేస్తానని దానివల్లే ఒత్తిడి కూడా దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుందని కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పింది. సినిమా షూటింగ్ లో ఖాళీ దొరికినా చాలు ఫిట్నెస్ కోసం డ్యాన్స్ చేస్తుంటుంది. 2020లో ఫోర్బ్స్ మ్యాగజైన్లో ‘30 అండర్ 30’ జాబితాలో ఈమె పేరు నమోదైంది. ఆ జాబితాలో చిత్రపరిశ్రమ నుంచి ఎంపికైనా ఒకే ఒక వ్యక్తి సాయి పల్లవి. 

పింక్ చెంపల వెనుక రహస్యం
సాయి పల్లవి ముఖంలో బ్యూటీ స్పాట్ అంటే గులాబీరంగులో మెరిసే ఆ చెంపలే. తెల్లని ముఖంపై లేత గులాబీ రంగు బుగ్గలు భలే అందంగా ఉంటాయి. తాను మేకప్ కి వ్యతిరేకి. సినిమాల్లో కూడా సహజంగానే నటిస్తుంది. తన చర్మం కోసం తగినన్ని నీళ్లు తాగుతుంది ఆమె. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోవడానికి నీళ్లే ముఖ్యమని చెబుతుంది. 

జుట్టంటే  ఇష్టం
రింగురింగుల జుట్టును ఓ సైడ్ కు వేసి, వదులుగా వదిలితే సాయిపల్లవిని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అందుకే ప్రతిరోజు దేవుడిని తన రాలకుండా చూడమని ప్రార్థిస్తుందట. ప్రతి మూడు రోజులకోసారి తలకు స్నానంచేస్తానని చెబుతోంది. అప్పుడప్పుడు తలకు, ముఖానికి అలెవెరా జెల్ ను మాత్రం అప్లయ్ చేస్తుంది. 

Also read: ఒత్తిడి ఎక్కువైపోతుందా.... వీటిని తినడం అలవాటు చేసుకోండి

Also read: విటమిన్ సి వల్ల జలుబు తగ్గుతుందా? నిజమేనా?

Also read: ఇంతవరకూ డెంగ్యూ వ్యాక్సిన్ ఎందుకు కనిపెట్టలేకపోయారు? వచ్చే అవకాశం ఉందా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 03 Nov 2021 11:36 AM (IST) Tags: Sai Pallavi Beauty Saipallavi Fitness Saipallavi secrets Saipallavi Movies సాయిపల్లవి

సంబంధిత కథనాలు

Breakfast Recipes: మీరు చాలా బిజీయా? అయితే పది నిమిషాల్లో తయారయ్యే దోశెల రెసిపీలు ఇవిగో

Breakfast Recipes: మీరు చాలా బిజీయా? అయితే పది నిమిషాల్లో తయారయ్యే దోశెల రెసిపీలు ఇవిగో

Flag Code: మీ ఇంటి పై జెండా ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

Flag Code: మీ ఇంటి పై జెండా ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

Life Expectancy: ఇప్పుడు మన సగటు ఆయుర్ధాయం 70 ఏళ్లు, కానీ 1947లో ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Life Expectancy: ఇప్పుడు మన సగటు ఆయుర్ధాయం 70 ఏళ్లు, కానీ 1947లో ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Cucumber: తొక్కే కదా అని తక్కువగా చూడొద్దు, కీర దోస తొక్క ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Cucumber: తొక్కే కదా అని తక్కువగా చూడొద్దు, కీర దోస తొక్క ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

జీవ గడియారం అంటే ఏమిటీ? సమయానికి నిద్రాహారాలు లేకపోతే అంత ప్రమాదమా?

జీవ గడియారం అంటే ఏమిటీ? సమయానికి నిద్రాహారాలు లేకపోతే అంత ప్రమాదమా?

టాప్ స్టోరీస్

Hero Vishal: షూటింగ్ సెట్లో ప్రమాదం, తీవ్ర గాయాలపాలైన హీరో విశాల్

Hero Vishal: షూటింగ్  సెట్లో ప్రమాదం,  తీవ్ర గాయాలపాలైన హీరో విశాల్

Tirumala News: ఈ టైంలో తిరుమలకు వెళ్లొద్దు! ఆ తర్వాతే రావాలని భక్తులకు టీటీడీ సూచన

Tirumala News: ఈ టైంలో తిరుమలకు వెళ్లొద్దు! ఆ తర్వాతే రావాలని భక్తులకు టీటీడీ సూచన

లక్కుంటే అంతే మరి! టమోటా పట్టినా వజ్రమైపోతుంది!

లక్కుంటే అంతే మరి! టమోటా పట్టినా వజ్రమైపోతుంది!

Karimnagar: హత్య చేసి గుట్టుగా అంత్యక్రియలకు, నమ్మేసిన జనం - ఆ తప్పిదంతో పట్టేసిన పోలీసులు

Karimnagar: హత్య చేసి గుట్టుగా అంత్యక్రియలకు, నమ్మేసిన జనం - ఆ తప్పిదంతో పట్టేసిన పోలీసులు