Viral Video: అంత రిస్క్ అవసరమా గురూ? హరికేన్ న్యూస్ కవర్ చేస్తుండగా షాకింగ్ ఘటన, ప్రాణాలు పోయేవే!
అమెరికాలో ఓ రిపోర్టర్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తీవ్ర రూపం దాల్చిన హరికేన్ న్యూస్ కవర్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
అమెరికాను ఇయన్ హరికేన్ వణిస్తున్నది. ఫ్లోరిడా రాష్ట్రం ఈ హరికేన్ దెబ్బకు చిగురుటాకులా వణికిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు ధ్వంసం అయ్యాయి. రోడ్లు తెగిపోయాయి. అమెరికా చరిత్రలోనే ఐదో అతిపెద్ద తుఫాన్ గా గుర్తించారు. అమెరికాలోని ప్రధాన రాష్ట్రాల్లో ఈ హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది.
ఇయాన్ హరికేన్ ఇప్పటికే పశ్చిమ క్యూబాలో విధ్వంసం సృష్టించింది. తాజాగా ఫ్లోరిడాలో తీరాన్ని తాకడంతో పెను నష్టం వాటిల్లింది. ఈ తుఫాన్ దెబ్బకు విద్యుత్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ హరికేన్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. స్థానికులు ఈ తుఫాన్ మూలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఈ వీడియోలు, ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంత మంది వర్షంలో చిక్కుకోగా, మరికొంత మంది ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారుల మీద నీరు చేరడంతో పాటు, బలమైన గాలులకు చెట్లు నేలకూలినట్లు ఈ వీడియోలలో కనిపిస్తోంది.
తీవ్ర రూపం దాల్చిన హరికేన్ వార్తను కవర్ చేసేందుకు ఓ వెదర్ రిపోర్టర్ చేసిన పని సోషల్ మీడియా వైరల్ గా మారింది. తీవ్ర స్థాయిలో గాలులు వీస్తున్న సమయంలో ఓ రిపోర్టర్ లైవ్ ఇవ్వాలని భావించాడు. స్టూడియో నుంచి లైవ్ మొదలయ్యింది. తను హరికేన్ తీవ్రత గురించి వివరిస్తుండగా గాలి తీవ్రత భారీగా పెరిగింది. అతడు నిలబడేందుకు చాలా కష్టపడ్డాడు. ఇంతలో ఓ చెట్లుకొమ్మ ఎగిరి వచ్చి అతడి కాలికి తగిలింది. దీంతో అతడు కిందపడ్డాడు. గాలికి ఎగిరిపోయే పరిస్థితి తలెత్తింది. అయితే, నెమ్మదిగా.. పట్టు కోల్పోకుండా.. అక్కడి నుంచి పక్కకు వచ్చి సైన్ బోర్డును పట్టుకుని తనని తాను కాపాడుకున్నాడు.
Jim Cantore got hit by a flying tree branch during hurricane report pic.twitter.com/ybONC3VR51
— Gifdsports (@gifdsports) September 28, 2022
ఇయాన్ హరికేన్ ఫ్లోరిడాలో ల్యాండ్ ఫాల్ చేసిన తర్వాత వాతావరణ శాస్త్రవేత్త జిమ్ కాంటోర్ వెదర్ రిపోర్టు చేయాలి అనుకున్నాడు. హరికేన్ వివరాలు చెప్పేందుకు ప్రత్యక్ష ప్రసారంచేయడం మొదలు పెట్టాడు. తుఫాన్ కు సంబంధించిన వివరాలు చెప్తుండగా గాలి 177 కి.మీ వేగంతో వీచింది. దీంతో తను తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. చివరకు సైన్ బోర్డును పట్టుకుని తుఫాన్ గండం నుంచి తప్పించుకున్నాడు. బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు జిమ్ కాంటోర్ రిపోర్టింగ్ చూసి ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు ప్రాణాలతో చెలగాటం అవసరమా? అని విమర్శిస్తున్నారు.
హరికేన్ బీభత్సాన్ని తెలిపే మరికొన్ని వీడియోలు:
Our community in Southwest Florida will not be the same for a very long time as a result of #huricaneian . This storm surge has destroyed everything in its path and it’s still going. #HurricaneIan #FortMyers pic.twitter.com/y5n2Z0Jav9
— Joe Guerra (@_jg54) September 28, 2022
Video sent by viewer out of SE #CapeCoral @winknews @MattDevittWINK @DylanFedericoWX @AmandaLaurenWx @WXRules @KCShermanWx @julianamwx @NashWX #huricaneian pic.twitter.com/aDGgCcq0T0
— Nicole Gabe (@NicoleGabeTV) September 28, 2022
This is one of the scariest videos I’ve seen from #huricaneian
— Ryan Munn (@RyanMunnWX) September 28, 2022
pic.twitter.com/sFzxyhdwlN
No road, no parking lot, no pool. Water getting down. This is what hurricane eye left behind. #Hurricane #FortMyers #SWFL #huricaneian #cat5 pic.twitter.com/pSLcM79LY8
— İbrahim (@ibrahimyrb) September 29, 2022
Also Read: పండగవేళ మెరిసే చర్మం కోసం ఈ మ్యాజికల్ వాటర్
Also Read: సన్ ఫ్లవర్ నూనెతో మెరిసే చర్మం మీ సొంతం