అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Relieve Leg Cramps : రాత్రుళ్లు నిద్రలో కాళ్లు పట్టేస్తున్నాయా? దాని వెనుక రీజన్స్ ఇవే.. ఈ చిట్కాలతో దూరం చేసుకోవచ్చు

Nighttime Leg Cramps : కొందరికి నిద్రలో కాళ్లు పట్టేస్తూ ఉంటాయి. దానిని కాళ్ల తిమ్మరి లేదా లెగ్ క్రాంప్స్ అంటూ ఉంటారు. ఇవి రావడానికి గల కారణాలు ఏంటో.. ఎలా వాటిని నివారించవచ్చో ఇప్పుడు చూసేద్దాం. 

Leg Cramp Causes and Home Remedies : కొందరికి రాత్రుళ్లు మంచి నిద్రలో కాళ్లు పట్టేస్తుంటాయి. సడెన్​గా భరించలేని నొప్పి వచ్చేస్తుంది. ఇలాంటివి మీరు ఏదొక సమయంలో ఫేస్ చేసే ఉంటారు. ఇవి కొందరిలో చాలా కామన్​. అయితే వీటి గురించి ఎవరికి చెప్పినా లేనిపోని రీజన్స్​తో అనవసరంగా మీకు స్ట్రెస్​ని పెంచుతారు. అందుకే వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అసలు ఇవి ఎందుకు వస్తాయి? వీటికి చికిత్స ఉందా? లేదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

లెగ్ క్రాంప్స్ 

నిద్రలో ఉన్నప్పుడు కాలు కండరాల్లో సడెన్​గా బిగుసుకుపోతుంది. దానివల్ల నొప్పి కలుగుతుంది. ఇది కొన్ని సెకన్లు, నిమిషాలు ఉంటాయి. దీనివల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది. తర్వాత నిద్రరాకపోవచ్చు. అంతేకాకుండా ఇవి మీ నిద్ర, వ్యాయామం, లైఫ్​స్టైల్​ని ప్రభావితం చేయవచ్చు. ఇవి సాధారణంగా రాత్రులే ఎక్కువగా వస్తాయట. కొన్నిసందర్భాల్లో ఇది నొప్పిని ఎక్కువగా కలిగిస్తుంది కానీ.. ప్రమాదరమైనది కాదని చెప్తున్నారు నిపుణులు. మరి ఈ లెగ్ క్రాంప్స్ రావడానికి కారణాలు ఏంటి?

కారణాలు ఇవే.. 

సాధారణంగా నిద్రలో కాళ్లు తిమ్మిరి లేదా లెగ్ క్రాంప్​ రావడానికి సరైన కారణం లేదు. కానీ డీహైడ్రేషన్​ కూడా దీనికి ఓ కారణమంటున్నారు. అలాగే ఆల్కహాల్ తీసుకునేవారిలో కూడా ఇది కామన్​గా ఉంటుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కూడా కండరాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల తిమ్మిరి, కాళ్లు పట్టేయడం వంటివి జరగొచ్చట. అలాగే స్ట్రెస్​ వల్ల కూడా కండరాల నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. శారీరక శ్రమ ఎక్కువైనప్పుడు, వ్యాయామం చేసినప్పుడు కండరాలు అలసిపోయి ఈ క్రాంప్స్ వస్తాయి. 

ఆస్తమాకోసం వినియోగించే మందులు, ఆరోగ్య సమస్యల గురించి వినియోగించే వివిధ రకాల మందులు ఉపయోగించినప్పుడు శరీరంలో ఎలక్ట్రోలైట్​ అసమతుల్యత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల లెగ్ క్రాంప్స్ వస్తాయి. గర్భిణీ స్త్రీలలో ఈ లెగ్ క్రాంప్స్ కాస్త ఎక్కువగా ఉంటాయట. ముఖ్యంగా సెకండ్, థర్డ్ ట్రైమిస్టర్​లో ఇవి కాస్త ఎక్కువగానే ఉంటాయట. మధుమేహం, మూత్రపిండాల వ్యాధి, థైరాయిడ్, నరాల సంబంధిత రుగత్మలు కూడా వీటికి కారణమవుతాయట. వయసు అయిపోతున్నవారిలో కూడా ఈ సమస్య ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు. 

నివారణ చర్యలు ఇవే.. 

కండరాల తిమ్మిరికి దారి తీసే డీహైడ్రేషన్​కు దూరంగా ఉండాలి. కాబట్టి రోజంతా తగినంత నీటిని తీసుకోవాలి. ఆల్కహాల్​కి దూరంగా ఉండాలి. ఇది క్రాంప్స్​ని కలిగించడమే కాకుండా కండరాల కణజాలాన్ని కూడా దెబ్బతీస్తుంది. పడుకునే ముందు లెగ్​ని స్ట్రెచ్​ చేస్తూ ఉంటే కండరాలు ఫ్రీగా మూవ్ అవుతాయి. పడుకుని కూడా కాలును స్ట్రెచ్ చేసి పడుకుంటే క్రాంప్స్ ఉండవు. పైగా కండరాల నొప్పులు దూరమవుతాయి. 

నొప్పి వచ్చినప్పుడు ఏమి చేయాలంటే.. 

నిద్రలో లెగ్ క్రాంప్ వస్తే అప్పుడు కూడా మీరు స్ట్రెచ్ చేయవచ్చు. ఎఫెక్టెడ్ లెగ్​ని సాగదీసి ఉంచాలి. ఇలా కొంతసేపు ఉంటే క్రాంప్ తగ్గుతుంది. లేదంటే మీరు కొంతసేపు నిల్చొంటే కూడా ఇది తగ్గొచ్చు. హీట్ ప్యాక్స్​ కూడా మంచి ఉపశమనం ఇస్తాయి. లేదంటే మీరు హాట్ వాటర్​తో స్నానం చేయడం వల్ల కూడా కండరాలు రిలాక్స్ అవుతాయి. నొప్పి తగ్గుతుంది. క్రాంప్ ఉండే ప్రాంతంలో మసాజ్ చేసుకోవడం వల్ల కూడా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

సప్లిమెంట్స్

శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ తరహా క్రాంప్స్ వస్తాయని పలు అధ్యయనాలు తెలిపాయి. కాబట్టి వైద్యుల సలహా మేరకు మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అలాగే అరటిపండు, నారింజ, బంగాళదుంపలు కూడా డైట్​లో చేర్చుకోవాలి. వీటిలోని పొటాషియం కండరాలకు మేలు చేస్తుంది. పడుకునే బెడ్​ కూడా కొన్నిసార్లు క్రాంప్​కి కారణమవుతుంది. కాబట్టి అది కూడా మీకు అనుకూలంగా ఉండేది ప్లాన్ చేసుకోండి. 

Also Read : పొట్ట ఎక్కువగా ఉందా? ఈ అలవాట్లతో బెల్లీ ఫ్యాట్​ను తగ్గించుకోవచ్చట.. నిపుణుల సలహాలు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తరహా మోసం- తాపీ మేస్త్రీలే టార్గెట్‌గా పన్నాగం
ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తరహా మోసం- తాపీ మేస్త్రీలే టార్గెట్‌గా పన్నాగం
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Embed widget