ఫ్యాషన్​ కోసమో.. ఎత్తుగా కనిపించడం కోసం చాలామంది హీల్స్ వేసుకుంటారు.

హీల్స్ వేసుకుంటే పొడవుగా కనిపించడమేమో కానీ దానివల్ల చాలా నొప్పి కలుగుతుంది.

మీరు పాయింట్ హీల్స్ వేసుకుంటారా? అయితే ఈ చిట్కాలతో నొప్పిని దూరం చేసుకోండి.

కాళ్లను బలపరిచే వ్యాయామాలు చేస్తే మీరు హీల్స్ వేసుకున్న నొప్పి ఎక్కువగా ఉండదు.

గోరువెచ్చని నీళ్లల్లో ఉప్పు వేసి దానిలో కాళ్లు ఉంచితే రిలీఫ్​గా ఉంటుంది.

ఫీట్ స్ట్రెచ్, మసాజ్​లు చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.

నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు షూలు వేసుకుంటే మంచిది. పరిస్థితి చేజారకుండా ఉంటుంది.

నొప్పి తగ్గకుంటే మాత్రం కచ్చితంగా వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. (Images Source : Unsplash)