చర్మ సంరక్షణలో అలోవెరాకు ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి.

క్రమం తప్పకుండా చర్మం మీద లేపనంగా వాడినపుడు మొటిమలు తగ్గుతాయి.

అలోవెరా జ్యూస్ తాగితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. మలబద్దకం, ఐబీఎస్ వంటివి అదుపులో ఉంటాయి.

అలోవెరాలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి నిరోధకవ్యవస్థను బలోపేతం చేస్తాయి.

అలోవెరా రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించి గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా అదుపు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

అలోవెరాలో ఉండే యాంటీమైక్రోబియల్ లక్షణాల వల్ల నోటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

నొప్పిగా ఉన్న కండరాలు, కీళ్లకు అలోవెరా మసాజ్ చేస్తే మంచి రిలీఫ్ ఉంటుంది.

అలోవెరాలో ఉండే ఎంజైములు స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. చుండ్రు తగ్గిస్తాయి.

ఈ ఎంజైములు జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు అద్భుతంగా పనిచేస్తాయి.

నోటిలోని హానికారక బ్యాక్టీరియాతో పోరాడి ప్లేక్ ఏర్పడకుండా నివారిస్తుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels