రొయ్యల్లో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ E. ఇది ఒక యాంటీఆక్సిడెంట్. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

రొయ్యల్లో ఉండే విటమిన్ B12 రక్తవృద్ధికి తోడ్పడుతుంది. నీరసం రాకుండా, చురుగ్గా ఉండేందుకు అవసరం.

జింక్, ఐయోడిన్ వంటి మినరల్స్ రొయ్యల్లో పుష్కలం. థైరాయిడ్ పనితీరుకు, కండర నిర్మాణానికి అవసరం.

రొయ్యల్లో ఉండే సెలీనియం ఇమ్యూనిటిని బలోపేతం చేస్తుంది. క్యాన్సర్ ముప్పును నివారిస్తుంది.

అస్టాంగ్జాంథిన్ అనే సమ్మేళనం వల్ల రొయ్యలు దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

రొయ్యల్లో క్యాలరీస్ తక్కువ కనుక బరువు తగ్గాలని అనుకునే వారికి మంచి పౌష్టికాహారం.

ఫాస్ఫరస్, కాపర్, మెగ్నీషియం ఉండడం వల్ల ఎముకల ఆరోగ్యానికి రొయ్యలు మంచివి.

రొయ్యలతో శరీరంలో మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

అల్జీమర్స్ కి ప్రాథమిక కారణం ఇన్ఫ్లమేషన్. రొయ్యలు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి కనుక అల్జీమర్స్ ను కూడా నివారిస్తాయి.

ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు ఉంటాయి కనుక గుండె ఆరోగ్యానికి రొయ్యలు దోహదం చేస్తాయి.

రొయ్యల్లో అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పోషకం ఐరన్. శరీరం రక్త హీనత కలుగకుండా నివారిస్తాయి.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels