మీరు తక్కువగా నిద్రపోతున్నారా? అయితే, ముప్పు తప్పదు! ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. కానీ, ఈ రోజుల్లో చాలా మందికి కంటి నిండా నిద్రపోయే టైమ్ దొరకడం లేదు. తక్కువ నిద్ర పోవడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర సరిగ్గా లేకపోతే రోగనిరోధక శక్తి బలహీనపడి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. నిద్ర లేకపోవడం హార్మోన్ల సమతుల్యత దెబ్బతీసి బరువు పెరగడానికి కారణం అవుతుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. నిద్రలేమి వల్ల పురుషులలో అంగస్తంభన లోపం, స్త్రీలలో లైంగిక సమస్యలు వస్తాయి. నిద్రలేమితో చర్మం పొడిబారడంతో పాటు ముడతలు, మొటిమలు, తామర లాంటి సమస్యలు వస్తాయి. All Photos Credit: pexels.com