ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ స్క్రీన్ చూస్తూ రోజు గడుపుతున్నారు. కనుక కంటి ఆరోగ్యం గురించి శ్రద్ధ అవసరం.

కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి.

విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ కలిగిన సూపర్ ఫూడ్ కంటి ఆరోగ్య పరిరక్షణకు అవసరం.

ఈ సూపర్ ఫూడ్ క్యాటరాక్ట్, కంటి కండరాల డీ జనరేషన్ వంటి కంటి సమస్యల నుంచి కాపాడుతుంది.

కంటి రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడి కంటి కణజాలాలను చురుగ్గా ఉంచుతాయి.

బీటా కెరాటిన్ కలిగిన క్యారెట్లు రెటినా పనితీరును మెరుగ్గా ఉంచుతాయి. క్యాటరాక్ట్, డీజనరేషన్ ను నిరోధిస్తాయి.

పాలకూర ల్యూటిన్, జీయాక్సియాంథిన్ కలిగిన పవర్ హౌజ్ లాంటిది.

పాలకూర సహజమైన సన్ గ్లాసెస్ లా పనిచేసి హానికారక కాంతి నుంచి కళ్లను కాపాడుతుంది.

సాల్మన్, ట్యూనా వంటి ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు కలిగిన చేపలు కంటిలో తేమను నిలిపి ఉంచుతాయి.

గింజలు, సిట్రస్ పండ్లలో ఉండే విటమిన్లు ఇ, సి వంటి యాంటి ఆక్సిడెంట్లు కంటి కణాలను ఫ్రీరాడికల్స్ నుంచి కాపాడతాయి.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels