షుగర్ పేషెంట్లు అనగానే ముందు చెప్పుకునేది ఆహార నియమాలు. కొన్ని రకాల ఆహారాలు వీరు అసలు తినకూడదు.

వేపుళ్లు ఎక్కువ నూనెను గ్రహిస్తాయి. అందువల్ల ఎక్కువ క్యాలరీలు ఉంటాయి.

ఆల్కహాల్, డయాబెటిస్ మందులు రెండింటి సంశ్లేషణ లివర్ లోనే జరుగుతుంది. కనుక మద్యానికి దూరం ఉండాలి.

పండ్లరసాలు ఆరోగ్యానికి మంచిది కానీ వీటిలో ఉండే చక్కెరలు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. పండ్లు తినడం మంచిది.

తేనె వంటి సహజమైన చక్కెరలు కూడా రక్తంలో చక్కెర స్థాయి పెంచుతాయని మరచిపోవద్దు.

డెయిరీ ఉత్పత్తుల్లో సాచ్యూరేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ పెంచుతాయి.

కొవ్వులు ఎక్కువగా కలిగి ఉన్న మాంసాహారం సాసేజ్, బెకన్, రెడ్ మీట్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

కుకీలు, చిప్స్ వంటి ప్యాక్ చేసిన స్నాక్స్, బేక్ చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి.

స్వీట్లు, డెజర్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదని గుర్తుంచుకోవాలి.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels