అన్వేషించండి

Regular Periods : పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చినా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ వస్తాయట.. అంతా నార్మల్ అనుకుంటే పొరపాటే

On-Time Periods : పీరియడ్స్ సరిగ్గా వస్తున్నాయంటే ఆరోగ్యం పర్ఫెక్ట్ అనుకుంటారని.. కానీ అది పొరపాటని అంటున్నారు నిపుణులు. మహిళలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే..

Regular Menstrual Cycles Can Also Have Risks : చాలా మంది మహిళలు తమకు ప్రతి నెలా పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయంటే.. వారి హార్మోన్లు సరిగ్గా ఉన్నాయని భావిస్తారు. 28 నుంచి 30 రోజుల వ్యవధిలో రెగ్యులర్​గా పీరియడ్ రావడం సేఫ్ అని భావిస్తారు. ఎలాగో కరెక్ట్ టైమ్​కి వస్తున్నాయి కదా.. శరీరంలో అంతా సవ్యంగా ఉందని భావిస్తారు. కానీ నిజం ఏమిటంటే.. క్రమబద్ధమైన పీరియడ్స్ కూడా కేవలం ఒక బాహ్య సూచన మాత్రమే అని.. అది పూర్తిగా మీరు ఆరోగ్యంగా ఉన్నారని సూచించదని చెప్తున్నారు నిపుణులు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

హార్మోన్ల వ్యవస్థ చాలా క్లిష్టమైనది. మెదడు, అండాశయాలు, థైరాయిడ్, అడ్రినల్ గ్రంథులు, జీవక్రియ అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. కొన్నిసార్లు ఈ వ్యవస్థ అంతర్గత ఒత్తిడి, అసమతుల్యత ఉన్నప్పటికీ.. పీరియడ్స్​ను క్రమబద్ధంగా ఉంచుతుంది. అందుకే కొంతమంది మహిళలకు పీరియడ్స్ సకాలంలో వస్తాయి. కానీ సంతానోత్పత్తి సమస్యలు, తీవ్రమైన నొప్పి, మూడ్ స్వింగ్స్ లేదా ప్రీమెన్స్ట్రువల్ సమస్యలను ఎదుర్కొంటారు.

నిపుణులు ఏమంటున్నారంటే..

లూమా ఫెర్టిలిటీ వైద్య డైరెక్టర్ డాక్టర్ రాధికా శెత్ TOIతో మాట్లాడుతూ.. రెగ్యులర్​గా పీరియడ్స్ వస్తోన్న మహిళల్లో కూడా చాలా కాలంగా హార్మోన్ల అసమతుల్యత ఉందని వైద్యపరంగా సాధారణమని చెప్పారు. పీరియడ్స్ రావడం కేవలం ఒక ఫలితం మాత్రమేనని.. అయితే దాని వెనుక ఉన్న హార్మోన్ల ప్రక్రియ చాలా లోతైనది, సున్నితమైనదని తెలిపారు. ఈ సమయంలో వచ్చే సమస్య ఏంటంటే.. ప్రొజెస్టెరాన్ లోపం. దీనిని లూటియల్ ఫేజ్ ఇన్సఫిషియన్సీ అంటారు. అటువంటి పరిస్థితిలో స్త్రీ సకాలంలో అండోత్సర్గము చేస్తుంది. పీరియడ్స్ కూడా క్రమంగా వస్తాయి. కానీ తగినంత ప్రొజెస్టెరాన్ లేకపోవడం వల్ల గర్భం నిలబడదు. సరైన సమయంలో టెస్ట్ చేయకపోతే.. ఈ సమస్య సంవత్సరాలు దాటిన గుర్తించలేము.

రెగ్యులర్ పీరియడ్స్​తో సమస్యలు

అదేవిధంగా PCOS తరచుగా క్రమరహిత పీరియడ్స్తో ముడిపడి ఉంటుంది. కానీ దాని తేలికపాటి లేదా జీవక్రియ రూపంలో.. చాలా మంది మహిళలకు పీరియడ్స్ రెగ్యులర్​గా వస్తాయి. అయినప్పటికీ వారు ఇన్సులిన్ నిరోధకత లేదా తేలికపాటి హార్మోన్ల అసమతుల్యతను కలిగి ఉండవచ్చు. ఇది గుడ్ల నాణ్యత, సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ లేదా ప్రొలాక్టిన్లో స్వల్ప లోపం కూడా పీరియడ్స్ను ప్రభావితం చేయకుండా అండోత్సర్గము, హార్మోన్ల మద్దతును బలహీనపరుస్తుంది. దీనితో పాటు నిరంతర ఒత్తిడి, నిద్ర లేకపోవడం, క్రమరహిత ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ పెరుగుతుంది. ఇది హార్మోన్ల సమతుల్యతను నెమ్మదిగా దెబ్బతీస్తుంది.

ఏ విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు?

తీవ్రమైన మూడ్ స్వింగ్స్, పీరియడ్స్ నొప్పి, నిరంతర అలసట, వాపు, లిబిడో తగ్గిపోవడం లేదా భావోద్వేగ అస్థిరత వంటి లక్షణాలను సాధారణంగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు అంటున్నారు. పీరియడ్స్ క్రమంగా ఉన్నప్పటికీ.. శరీరం లోపలి నుంచి సమతుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తుందని ఈ సంకేతాలు సూచిస్తున్నాయి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
Overthinking : అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
Post-Flood Home Cleaning : వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget