Maramarala Garelu Recipe : మాన్సూన్ స్పెషల్ మరమరాల గారెలు.. తక్కువ టైమ్‌లో చేసుకోగలిగే టేస్టీ, సింపుల్ రెసిపీ ఇదే
Garelu Recipe : గారెలు అంటే ఇష్టమా? అయితే పిండిలేదని బాధపడకండి. సింపుల్ ఇంగ్రెడియంట్స్‌తో అతి తక్కువ సమయంలో చేసుకోగలిగే టేస్టీ గారెల రెసిపీ ఇప్పుడు చూసేద్దాం.
Garelu Recipe with Maramaralu : గారెలు అంటే చాలామంది ఇష్టంగా తింటారు కానీ.. దీనిని చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని ఆలోచిస్తూ ఉంటారు. కానీ అదేమి లేకుండా కేవలం 20 నిమిషాల్లో చేసుకోగలిగే గారెల రెసిపీ ఇక్కడుంది. పైగా దీనికోసం మినపప్పు నానబెట్టాల్సిన అవసరమే లేదు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. ఉదయాన్నే టిఫెన్‌గా కంగారు లేకుండా చేయొచ్చు. వర్షం పడుతున్నప్పుడు ఛాయ్‌కి కాంబినేషన్‌గా కూడా ట్రై చేయొచ్చు. మరీ ఈ స్పెషల్ రెసిపీని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
మరమరాలు - 3 కప్పులు
నీళ్లు - 3 కప్పులు
అల్లం - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి -2
జీలకర్ర - 1 టీస్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
కొత్తిమీర - పావు కప్పు
బియ్యం పిండి - అరకప్పు
పెరుగు - అరకప్పు
ఉప్పు - రుచికి తగినంత
తయారీ విధానం
ఈ రెసిపీని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్‌గా, త్వరగా చేసుకోగలిగే రెసిపీ ఇది. ముందుగా బౌల్ తీసుకుని దానిలో మరమరాలను వేయాలి. అనంతరం దానిలో మూడు కప్పుల నీరు వేసి నానబెట్టాలి. ఇప్పుడు కరివేపాకును చిన్నగా తురుముకోవాలి. అల్లం, పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా తురుముకోవాలి. మిగిలిన పదార్థాలు కూడా సిద్ధం చేసుకోవాలి.
అవి పది నిమిషాలు నానిన తర్వాత.. వాటిని నీరు లేకుండా గట్టిగా పిండుతూ.. వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం మరమరాలను నీటినుంచి తీసేయాలి. ఇప్పుడు నానిన మరమరాలను మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని.. చేతితో మెత్తగా చేయాలి. గట్టిగా పిసికితే.. అవి మెత్తగా అవుతాయి. కొన్ని అలాగే ఉండిపోయినా పర్లేదు. ఇలా చేసుకున్న మరమరాల మిశ్రమంలో జీలకర్ర, ఉప్పు, మిరియాల పొడివేసి కలపాలి.
అనంతర పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు తురుము, కొత్తిమీర వేసి మళ్లీ కలపాలి. దానిలో పెరుగు, బియ్యం పిండి వేసి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగులోని నీరు మరమరాల తడి పిండి కలుపుకోవడానికి సరిపోతుంది. కానీ మరీ గట్టిగా ఉంటే అవసరాన్ని బట్టి నీటిని చల్లుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని కలిపితే.. విడిపోకుండా ముద్దగా మారేలా పిండి ఉండాలి.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టుకోండి. దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. నూనె వేడి అయిన తర్వాత.. పిండిని తీసుకుని.. దానిని గారెలులాగ ఒత్తుకుని నూనెలో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఓ వైపు వేగిన తర్వాత మరోవైపు వేయించుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగ్ వస్తే గారెలు రెడీ. వీటిని మార్నింగ్ టిఫెన్‌గా, ఈవెనింగ్ స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు.
ఈ సింపుల్ రెసిపీ గారెలను మీరు కూడా ఈజీగా చేసేయండి. దీనిని మీరు పల్లీ చట్నీ కాంబినేషన్లో ట్రై చేయవచ్చు. నేరుగా కూడా తీసుకోవచ్చు. ఉల్లిపాయలు కూడా ఈ గారెల రెసిపీలో ఉపయోగించవచ్చు. నేరుగా తినేప్పుడు ఛాయ్‌కి కాంబినేషన్‌గా తీసుకోవచ్చు. ఈ మాన్సూన్ సమయంలో క్రిస్పీగా గారెలను తక్కువ సమయంలో టేస్టీగా చేసుకోవచ్చు.
Also Read : రుచికరమైన ఆవకాయ ఫ్రైడ్ రైస్.. టేస్టీగా రావాలంటే ఈ సింపుల్ రెసిపీని ఫాలో అయిపోండి