Crispy Wada Recipe : టేస్టీ టేస్టీ వడలు.. తక్కువ పదార్థాలతో సింపుల్‌గా చేసుకోగలిగే రెసిపీ ఇది
Crispy Wada Recipe : వర్షంలో టేస్టీగా ఏదైనా తినాలనుకుంటే సింపుల్‌గా చేసుకోగలిగే టేస్టీ వడలు చేసుకోవచ్చు. వీటిని సింపుల్‌గా ఎలా చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Tasty Wada Recipe : ఛాయ్‌కి కాంబినేషన్‌గా ఏమైనా తినాలనుకుంటే.. లేదా హెల్తీ స్నాక్స్ తీసుకోవాలనుకుంటే కాబూలీ చనాతో వడలు చేసుకోవచ్చు. ఇది పిల్లల నుంచి పెద్దలవరకు అందరికీ నచ్చే రెసిపీ ఇది. పలు రెస్టారెంట్స్‌లో కూడా దీనిని చేస్తారు. అయితే ఈ టేస్టీ రెసిపీని చేయడానికి అవసరమయ్యే పదార్థాలు ఏమిటి? ఎలా తయారు చేయాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
ఉల్లిపాయలు - 2 చిన్నవి
ఉప్పు - రుచికి తగినంత
పెద్ద శనగలు - 1 కప్పు
బేకింగ్ పౌడర్ - అర టీస్పూన్
నువ్వులు - 1 టీస్పూన్
నూనె- వంటకు తగినంత
కొత్తిమీర - ఓ చిన్న కట్ట
దిల్లీ ఆకులు - ఓ చిన్న కట్ట
పార్స్లీ - ఓ చిన్న కట్ట
వెల్లుల్లి - 5 రెబ్బలు
తయారీ విధానం
కాబులీ చనా (పెద్ద శనగలను) కడిగి.. రాత్రి నానబెట్టాలి. పార్స్లీ, కొత్తిమీర, దిల్లీ ఆకులను సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను కూడా సన్నగా, చిన్నగా కోసుకోవాలి. వెల్లుల్లిని కూడా చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి. శనగలను మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. దానిలో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పార్స్లీ, కొత్తిమీర, దిల్లీ ఆకులను వేసుకోవాలి. లేదంటే ముక్కలుగా కోసుకోకుండా వాటిని నేరుగా మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని ఓ గంట పక్కన ఉంచాలి. మిక్సీ చేసేప్పుడు నీరు వేయకపోవడమే మంచిది.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. కడాయిలో నూనె వేసుకోవాలి. అది వేగాక.. పిండిని చేతులతో ఒత్తుతు.. వడలుగా మాదిరిగా చేసుకుని.. నూనెలో వేయాలి. నూనెలో వేసిన వెంటనే గరిటతో తిప్పకుండా.. రెండు నిమిషాలు అలాగే ఉంచేయాలి. లేదంటే వడ విరిగిపోతుంది. ఇలా వేసుకున్న వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. అంతే వేడి వేడి కాబూలీ చనా వడలు రెడీ. ఇవి పైన క్రిస్పీగా.. కరకరలాడుతూ.. లోపల మెత్తగా ఉంటాయి. పిండిని ఒత్తుకుని వడలుగా వేసుకునేప్పుడు కాస్త లావుగా ఒత్తుకోవచ్చు. లేదంటే.. మంచూరియా మాదిరిగా ఉండలుగా చేసుకుని.. వేయించుకోవచ్చు.
ఇవి మార్నింగ్, ఈవెనింగ్ స్నాక్స్‌గా పనికి వస్తాయి. వర్షంలో ఛాయ్‌కి బెస్ట్ కాంబినేషన్‌గా చెప్పవచ్చు. అంతేకాకుండా మంచూరియాగా చేసుకున్న వాటిని.. కర్రీగా కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కోసుకుని.. వాటిని కాస్త నూనెలో వేయించుకోవాలి. దానిలో ఉప్పు, కారం వేసుకుని కలిపి.. ఈ బాల్స్ వేయాలి. దానిలో నీళ్లు వేసి ఉడికించి.. చివర్లో ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుని వాటిని కూరగా చేసుకోవచ్చు. లేదంటే మంచూరియాగా కూడా చేసుకోవచ్చు. ఈ టేస్టీ కాంబినేషన్‌ను మీరు కూడా ఇంట్లో సింపుల్‌గా ట్రై చేసుకోవచ్చు. పార్స్లీ, దిల్లీ ఆకులు లేకున్నా కూడా ఈ పదార్థాలతోనే మంచి టేస్టీ వడలు రెడీ చేసుకోవచ్చు.
Also Read : ఈరోజు లంచ్ స్పెషల్ బెండకాయ గ్రేవీ కర్రీ.. రోటీ, రైస్‌కి బెస్ట్ కాంబినేషన్ ఇది