News
News
X

Carrot Sweet: క్యారెట్ స్వీట్ బిళ్లలు - పిల్లలకు ఆరోగ్యకరమైన చిరుతిండి

క్యారెట్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వాటితో కేవలం హల్వానే కాదు, మంచి స్వీట్ కూడా తినవచ్చు.

FOLLOW US: 
Share:

క్యారెట్లు చేసే స్వీటు కేవలం హల్వానే అనుకుంటారు. కానీ క్యారెట్ ఎన్నో రకాల స్వీట్లు చేసుకోవచ్చు. వాటిల్లో ఒకటి ఇవి కూడా. ఈ రెసిపీ చాలా తక్కువ మందికే తెలుసు. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ మీరే చేసుకుని తినేలా ఉంటాయి.  

కావాల్సిన పదార్ధాలు
క్యారెట్లు - అరకిలో
చక్కెర - పావుకిలో
గోధుమ పిండి - పావు కప్పు
ఉప్పు - చిటికెడు
నూనె - వేయించడానికి సరిపడా

తయారీ ఇలా
1. క్యారెట్ల తొక్కను తీసేసి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. 
2. వాటిని కుక్కర్లో వేసి ఉడికించాలి. బయటికి తీసి మెత్తగా చేసుకోవాలి. 
3. క్యారెట్ల పేస్టులో గోధుమపిండి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. 
4. నీళ్లు వేయకుండా చపాతీ ముద్ద కలుపుకున్నట్టు ముద్దలా చేసుకోవాలి. 
5. ఇప్పుడు చిన్న ముద్దని తీసి ఉండలా చుట్టుకుని మధ్యలో చిటికెన వేలుతో నొక్కితే బిళ్లల్లా వస్తాయి. 
6. అలా అన్నీ చేసుకుని ప్లేటులో పెట్టుకోవాలి. 
7. కళాయిలో నూనె వేసి వేడెక్కాక ఈ క్యారెట్ బిళ్లలు అన్నీ వేసి వేయించుకోవాలి. 
8. మరో పక్క పంచదార పాకాన్ని (గులాబ్ జామూన్ తీసిన విధంగా) తీసి వాటిలో ఈ వేయించిన క్యారెట్ బిళ్లలు వేయాలి. 
9. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. క్యారెట్లు ఉంటాయి కాబట్టి ఎంతో ఆరోగ్యం కూడా. 

క్యారెట్లు ఆరోగ్యానికి చాలా మంచివి.వీటిలో 88 శాతం నీరే ఉంటుంది. ప్రొటీన్, డైటరీ ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ముఖ్యం ఏ విటమిన్ శరీరానికి లభిస్తుంది. క్యారెట్లు అన్ని కాలాల్లో లభిస్తాయి. వీటితో ఎక్కువ మంది కూరలు, వేపుళ్లు చేసుకుని తింటారు, అలాగే హల్వా కూడా చేస్తారు. క్యారెట్ తో ఇవొక్కటే కాదు, అనేక రకాల రెసిపీలు చేసుకోవచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి చర్మం, జుట్టుకు అందాన్నిస్తాయి. పిల్లలకు పచ్చి క్యారట్లను తినిపిస్తే నులిపురుగుల సమస్య రాకుండా ఉంటుంది. రక్తం శుభ్రంగా ఉంటుంది. మూత్రాపిండాల్లో రాళ్లు ఉన్నవారు క్యారెట్లు అధికంగా తింటే ఎంతో మేలు. రోజుకొక పచ్చి క్యారెట్ తింటే ఎంతో మంచిది.  క్యారెట్లో ఉన్న బీటా కెరాటిన్ శరీరంలోకి చేరాక విటమిన్ Aగా మారుతుంది. క్యారెట్లు అధికంగా తింటే చర్మం రంగు మారే అవకాశం ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు క్యారెట్లు అధికంగా తినకూడదు. మితంగా తినవచ్చు. ఎందుకంటే క్యారెట్లలో సహజ చక్కెరలు ఉంటాయి. అందుకే అధికంగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల డయాబెటిస్ సమస్య పెరుగుతుంది. క్యారెట్లు కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి. 

Also read: ఇరవై నాలుగేళ్లుగా ఇతని ఆహారం నీళ్లు, కొబ్బరే - ఆ సమస్యను తట్టుకునేందుకే ఇలా మారాడట

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 19 Feb 2023 03:06 PM (IST) Tags: Telugu Recipes Telugu Vantalu Carrot Recipes Carrot Sweet

సంబంధిత కథనాలు

ఏడాదిలో 8428 ప్లేట్ల ఆర్డర్‌- ఆశ్చర్యపరుస్తున్న హైదరాబాదీ ఇడ్లీ ప్రేమ

ఏడాదిలో 8428 ప్లేట్ల ఆర్డర్‌- ఆశ్చర్యపరుస్తున్న హైదరాబాదీ ఇడ్లీ ప్రేమ

Cake: ఈ టిప్స్ పాటించారంటే ప్రెజర్ కుక్కర్లో కేక్ సింపుల్ గా చేసెయ్యొచ్చు

Cake: ఈ టిప్స్ పాటించారంటే ప్రెజర్ కుక్కర్లో కేక్ సింపుల్ గా చేసెయ్యొచ్చు

Vegan Chicken: వేగన్ చికెన్ - ఈ శాఖాహార చికెన్‌ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు

Vegan Chicken: వేగన్ చికెన్ - ఈ శాఖాహార చికెన్‌ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు

Mango: మామిడిపండుతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీలు - వీటితో ఈజీగా బరువు తగ్గొచ్చు

Mango: మామిడిపండుతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీలు - వీటితో ఈజీగా బరువు తగ్గొచ్చు

Haleem: హలీమ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఆరోగ్యానికి మంచిదేనా?

Haleem: హలీమ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఆరోగ్యానికి మంచిదేనా?

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి