Mango Maggi: మ్యాంగో మ్యాగీ తిన్నారా? ఇలాంటి ఘోరాలు ఎన్ని చూడాలో!
మీరు ఎప్పుడైనా మ్యాగీలో మామిడి పండును కలుపుకుని తిన్నారా? పోనీ? మజాను మిక్స్ చేశారా? అయితే, అవి రెండు కలిపితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ట్రైచేయండి. రెసిపీని ఇక్కడ చూడండి.
కొత్త రుచులను ఆస్వాదించడంలో తప్పులు లేదు. కానీ, ప్రయోగాల పేరుతో కొత్త కొత్త కాంబినేషన్లను కనిపెడితేనే కడుపు కల్లోలంగా మారుతుంది. ఇప్పటికే చాలామంది రుచికరమైన దోసను ఖూనీ చేశారు. పిజ్జా దోస పేరుతో ‘దోస’ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇంకా ఎన్నో భయానక వంటకాలను మనం ఇప్పటివరకు చూశాం. ఇప్పుడు మీరు చూడబోతున్న వంటకం.. మరింత భిన్నమైనది.
ఈ వీడియోలో ఓ మహిళ ముందుగా మసాలా, ఆయిల్ వేసింది. ఆ తర్వాత నీళ్లు వేసి, మ్యాగీ వేసింది. అనంతరం అందులో మజా డ్రింక్ కలిపింది. అవును, మీరు చదివింది కరెక్టే.. ఆమె కలిపింది కూల్ డ్రింకే. అంతటి ఆగితే పర్వాలేదు. చివరిగా.. ఆమె మామిడికాయ ముక్కలతో ఆ మ్యాగీని గార్నిష్ చేసింది. ఈ వీడియో చూసి నెటిజనులు షాకవ్వుతున్నారు. ఈ ఘోరాలను చూసే బదులు, తమని ఏదైనా గ్రహానికి పంపేయాలని అంటున్నారు. ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాలో అని అంటున్నారు. విభిన్న వంటకాల గురించి తెలియజేసే ‘ది గ్రేట్ ఇండియన్ ఫుడీ’ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి మీ అభిప్రాయం కూడా చెప్పండి మరి. (Video and Image Credit: The Great Indian Foodie).
Also Read: టమాటోలను పొడి చేసుకుని దాచుకోవచ్చు, ఎన్నాళ్లయినా చెక్కుచెదరదు
ఆ వీడియోను ఇక్కడ చూడండి:
View this post on Instagram
Also read: డయాబెటిస్ ఉన్న వారు మామిడి పండ్లు తినొచ్చా? రోజుకు ఎన్ని తింటే సేఫ్
Also read: మనిషి ఆకారంలో ఊరు, గ్రహాంతరవాసుల పనే అంటున్న గ్రామస్థులు