అన్వేషించండి

Wearing Makeup During Exercise : జిమ్​కి వెళ్లేప్పుడు మేకప్ వేసుకుంటున్నారా? అయితే మీ అందానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం

Skin Health : కొందరు జిమ్​కి వెళ్లేప్పుడు కూడా మేకప్ వేసుకుని వెళ్తారు. హెవీగా కాకపోయినా.. మినిమల్ మేకప్ వేసుకుంటారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఈ అంశంపై అధ్యయనం చేశారు.

New Study on Wearing Makeup During Exercise : వ్యాయామం చేసేప్పుడు కూడా అందంగా కనిపించాలనుకోవడం సహజం. కొందరు ఇన్​ఫ్లూయెన్సర్లు, నటులు జిమ్​లో కూడా అందంగా కనిపించేందుకు మేకప్ వేసుకుని వెళ్తారు. అందంగా కనిపించాలనే ఉద్దేశంతో మేకప్ వేసుకెళ్లడం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని స్కిన్​ కేర్ నిపుణులు చెప్పడం కాదు.. శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వారు చేసిన అధ్యయనంలో వ్యాయామం చేసేటప్పుడు మేకప్ వేసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యానికి హాని కలుగుతుందని గుర్తించారు. జిమ్​ చేయడానికి, మేకప్​కి సంబంధం ఏంటి? దానివల్ల చర్మానికి ఎందుకు నష్టం కలుగుతుంది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఓపెన్ పోర్స్ డ్యామేజ్ అవుతాయి..

సాధారణంగా వ్యాయామం చేసేప్పుడు చర్మ రంధ్రాలు విస్తరిస్తాయి. కానీ మీరు మేకప్ వేసుకుంటే చర్మరంధ్రాలు విస్తరించకుండా మేకప్ అడ్డుగా ఉంటుంది. దీనివల్ల శరీరం ఆరోగ్యకరమైన నూనెలను విడుదల చేయదు. వ్యాయామం చేస్తున్నప్పుడు ఫౌండేషన్​ వేసుకోవడం వల్ల చర్మం రంధ్రాల పరిమాణం మారుతుంది. దీనివల్ల సెబమ్ ఉత్పత్తి తగ్గి.. చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది.

విద్యార్థులపై అధ్యయనం..

టెక్సాస్ ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీకి చెందిన శాన్ ఆంటోనియోల్ సుఖో లీ, అతని సహచరులు.. 43 మంది కళాశాల విద్యార్థులపై ఈ అధ్యయనం చేశారు. వీరిలో 20 మంది అబ్బాయిలు, 23 మంది అమ్మాయిలను ఉన్నారు. ఈ అధ్యయనంలో పాల్గొనేవారు ముందుగా తమ ముఖాలను క్లెన్సర్​తో కడిగారు. అనంతరం వారి స్కిన్ పోర్స్, సెబమ్ ఉత్పత్తి సహా వారి ముఖాల్లోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ వేరియబుల్స్​ను పరిశోధకులు కొలిచారు. అనంతరం వారి ముఖాలకు నుదిటి, చెంపలు.. ఇలా ముఖం మీద ఫౌండేషన్​తో ఓ లేయర్ వేశారు. 

సెబమ్ ఉత్పత్తి తగ్గుతుంది..

మేకప్ వేసుకున్న తర్వాత వారు 20 నిమిషాలు మితమైన వ్యాయామం చేశారు. ఎక్కువ కూడా కష్టపడకుండా తక్కువగానే జిమ్ చేయించారు. ట్రెడ్​మిల్​పై పరుగెత్తించారు. వ్యాయామం పూర్తి అయిన తర్వాత పరిశోధకులు మళ్లీ వివిధ చర్మ కొలతలను పునరావృతం చేశారు. మేకప్ లేని వాటితో పోలిస్తే.. ఫౌండేషన్ ఉన్న ప్రదేశాలలో సెబమ్ తగ్గిందని కనుగొన్నారు. వ్యాయామ సమయంలో మేకప్ వాడడం వల్ల చర్మం హానికరమైన ప్రభావాలకు గురిఅవుతుందని తెలిపేందుకు ఇది మంచి ఉదాహరణగా తెలిపారు. 

స్కిన్​పై ప్రతికూల ప్రభావాలు

ఈ అధ్యయనంలో మేకప్ వాడకం వల్ల స్కిన్ పోర్స్ మూసుకపోతాయని.. ఇది సెబమ్​ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందని స్టడీలో రాశారు. దీనివల్ల మొటిమలు పెరిగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా చర్మం చికాకు పెడుతుందని వెల్లండించారు. త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయని.. స్కిన్ ర్యాష్, ఇరిటేషన్ వస్తుందని తెలిపారు. ఏమైనా చర్మ సమస్యలున్నవారు జిమ్ చేసేప్పుడు అస్సలు ఫౌండేషన్ ఉపయోగించవద్దని.. అది పరిస్థితిని దారుణం చేస్తుందని తెలిపారు. తక్కువ వ్యాయామాలు చేసే వారిపై ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది కానీ.. ఎక్కువ చూపించదని.. ఎక్కువగా, దీర్ఘకాలికంగా వ్యాయామం, జిమ్, అథ్లెట్లు మేకప్ వేసుకుంటే వారిపై ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలిపారు. 

సహజమైన గ్లో కోసం..

వ్యాయామం చేసేప్పుడు మేకప్ వేసుకోకపోవడం వల్ల చర్మం సహజంగా మెరవడం ప్రారంభిస్తుందని తెలిపారు. సహజమైన గ్లో ఎక్కువ ఉంటుందని.. అంతేకాకుండా వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చేస్తుందని తెలిపారు. వ్యాయమం తర్వాత హెల్తీ డ్రింక్స్, ఫుడ్స్ తీసుకుంటే.. అవి కూడా చర్మంపై మంచి ప్రభావాలను చూపిస్తాయని తెలిపారు. మీకు కూడా జిమ్​కి వెళ్లేప్పుడు మేకప్, లైట్ మేకప్ వేసుకునే అలవాటు ఉంటే.. వెంటనే దానిని వదిలిస్తే మంచిది అంటున్నారు నిపుణులు. ఒకవేళ్ల ఇప్పటికే మీరు స్కిన్ సమస్యలతో బాధపడుతూ ఉంటే డెర్మాటాలజిస్ట్​ల వద్దకు వెళ్లాలంటున్నారు.

 Also Read : ఇంటిని ఇలా శుభ్రం చేసుకుంటే అలెర్జీలు దరి చేరవట.. మానసికంగా కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయట

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget