Ratan Tata Untold Love Story : రతన్ టాటా గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా? పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే
Ratan Tata Love Story : రతన్ టాటా ఇండియాలో పారిశ్రామికంగా సక్సెస్ అయిన వ్యక్తి. అయితే ఆయన ప్రేమలో సక్సెస్ అయ్యాడు కానీ.. పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఎందుకంటే..

Untold Love Story of Ratan Tata : రతన్ టాటా వర్థంతి సందర్భంగా ఆయన గురించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వాటిలో ఆయన పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ప్రేమలో ఉన్న రతన్‌ని పెళ్లివరకు వెళ్లకుండా ఆపింది ఏంటి అనే చర్చ జరుగుతుంది. అయితే రతన్ టాటా లవ్ స్టోరి గురించి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. రతన్ టాటా: ఎ లైఫ్ అనే జీవిత చరిత్రలో దీని గురించి ప్రస్తావన ఉంది. అయితే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడానికి ఓ యుద్ధమే కారణమని దానిలో రాశారు. అయితే అసలు ఏమైంది..? రతన్ లవ్ చేసిన అమ్మాయికి, యుద్ధానికి సంబంధం ఏంటి వంటి విషయాలు చూసేద్దాం.
1960వ ప్రారంభంలో రతన్ టాటా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్లారు. అక్కడ19 ఏళ్ల కరోలిన్ ఎమ్మన్స్ అనే అమ్మాయితో లవ్‌లో పడ్డారు. ఆమె ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ ఫ్రెడరిక్ ఎర్ల్ ఎమ్మన్స్ కుమార్తె. కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి రతన్ టాటా ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. అనంతరం టాటా జోన్స్ అండ్ ఎమ్మన్స్‌తో కలిసి పని చేయాలని అనుకున్నారట. దీనివల్ల రతన్ లాస్ ఏంజిల్స్‌కు వెళ్లారట. థామస్ మాథ్యూస్ రాసిన టాటా జీవిత చరిత్ర ప్రకారం.. కరోలిన్ టాటాను తన "మొదటి నిజమైన ప్రేమ"గా భావించిందని.. చెప్తారు. ఇరు కుటుంబాలు కూడా వీరి ప్రేమకు మద్దతు ఇవ్వడంతో వారి సంబంధం చాలా ఆశాజనకంగా కనిపించింది.
భారత్-చైనా యుద్ధంతో రతన్ ప్రేమకు అంతరాయం
అంతా సవ్యంగా జరుగుతుంది అనుకున్న సమయంలో ఈ జంట ప్రేమకు 1962లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. జూలైలో టాటా అనారోగ్యంతో బాధపడుతున్న తన బామ్మను చూడటానికి భారతదేశానికి తిరిగి వచ్చాడు. కరోలిన్ కూడా టాటా త్వరలో వస్తారు అనుకుంది కానీ.. అక్టోబర్‌లో, భారత్-చైనా యుద్ధం ప్రారంభమైంది. నెల రోజుల్లోనే కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ.. కరోలిన్ కుటుంబం భారతదేశంలో నెలకొన్న పరిస్థితి గురించి ఆందోళన చెందింది. వారు ఆమెను ఇండియా పంపేందుకు ఒప్పుకోలేదు.
"నెలలోపు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ.. ఆ పరిస్థితి అమెరికన్స్‌కు చాలా ప్రమాదకరంగా అనిపించింది. దీంతో వాళ్లు విడిపోవాల్సి వచ్చింది." ఆ తర్వాత కరోలిన్ ఆర్కిటెక్ట్, పైలట్ ఓవెన్ జోన్స్‌ను వివాహం చేసుకుంది. కానీ ఆమె చెప్పిన విషయం ఏమిటంటే.. "నేను రతన్ లాంటి వ్యక్తిని వివాహం చేసుకున్నాను" అని తెలిపింది.
సంవత్సరాల తరువాత తిరిగి కలిసిన బంధం
2007లో కరోలిన్ టాటాతో తనకు ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. ది డార్జిలింగ్ లిమిటెడ్ అనే చిత్రం చూస్తున్నప్పుడు.. ఇండియా వెళ్లాలనే స్నేహితుడి ప్రశ్నతో టాటాను చూడాలనుకుంది. అతని సహాయంతో ఆమె టాటాను ఆన్‌లైన్‌లో వెతికింది. రతన్.. టాటా సన్స్, టాటా ట్రస్ట్‌లకు ఛైర్మన్‌గా మారారని కనుగొంది. కరోలిన్.. టాటాకు ఈ-మెయిల్ పంపి భారతదేశాన్ని సందర్శించాలనే తన కోరికను వ్యక్తం చేసింది.
కరోలిన్‌ను రతన్ ఇండియాకు సాదరంగా ఆహ్వానించాడు. 2008లో ఆమె భారతదేశమంతా ఐదు వారాలు ప్రయాణించి.. కొన్ని దశాబ్దాల తరువాత మొదటిసారిగా టాటాను మళ్లీ కలుసుకుంది. వారి మధ్య ఆ స్నేహం కొన్ని సంవత్సరాలు కొనసాగింది. 2017లో కరోలిన్.. టాటా 80వ పుట్టినరోజు వేడుకకు కూడా హాజరయ్యారు. ఇలా వారి ప్రేమ పెళ్లివరకు వెళ్లకుండానే ఆగిపోయి.. మళ్లీ కలుసుకుని స్నేహంతో వారి బంధాన్ని ముగించారు.





















