Ghee coffee: రకుల్ ప్రీత్‌కు నెయ్యి కాఫీ అంటే ఎంతో ఇష్టమట! మీరూ ట్రై చేస్తారా?
చాలా మంది తమ రోజును ఓ స్ట్రాంగ్ కాఫీతో స్టార్ట్ చేస్తారు. అయితే, కొందరు మాత్రం కాఫీలో నెయ్యి కలుపుకుని తాగుతారు. ఇలా చేయడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయట!
చాలా మందికి కాఫీ అంటే ఎంతో ఇష్టం. బెడ్ మీద నుంచి లేవడం తోనే కాఫీ తాగుతూ రోజును మొదలు పెడతారు. కాఫీ తాగడం వల్ల మనస్సు ఎంతో ఉత్తేజితంగా మారుతుంది. రోజంతా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. చాలా మంది చాలా రకాల కాఫీలు తాగుతారు. లాట్టే, క్యపెచినో, ఎస్ప్రెస్సో తో పాటు ఎన్నో రకాల కాఫీలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఇష్టపడే అనేక రకాల కాఫీ స్టైల్స్ ఉన్నా.. ప్రముఖ సినీ తారలు రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్ నెయ్యి కాఫీ(గీ కాఫీ)ని ఇష్టపడతారట. ఇంతకీ నెయ్యి కాఫీ అంటే ఏంటి? దాన్ని ఎలా తయారు చేస్తారు? దానితో కలిగే లాభాలేంటి? అనే విషయాలు చూద్దాం.
నెయ్యి కాఫీ అంటే ఏమిటి?
కాఫీకి నెయ్యి లేదంటే వెన్న కలిపి నెయ్యి కాఫీని తయారు చేస్తారు. దీనిని సాధారణంగా బుల్లెట్ ప్రూఫ్ కాఫీ లేదంటే బుల్లెట్ కాఫీ అని కూడా పిలుస్తారు. ఇది వెచ్చని క్రీము కాఫీ. లాట్‌ను పోలి ఉంటుంది. ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీలోని ఎన్నో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి. బుల్లెట్ కాఫీతో చాలా మంది డైట్ ను మెయింటెయిన్ చేస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తున్నట్లు చెప్తున్నారు.
1. హెల్తీ ఫ్యాట్స్
వాస్తవానికి అన్ని రకాల కొవ్వులు ఆరోగ్యానికి హాని చేయవు. నెయ్యిలో ఒమేగా 3, 6, 9 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జీవక్రియ, హృదయనాళ వ్యవస్థ, కీళ్ళు, మెరుగైన మెదడు పనితీరును కలిగిస్తాయి.
2. విటమిన్ల సమూహం
నెయ్యిలో విటమిన్ ఎ, ఇ, కె పుష్కలంగా ఉన్నాయి. నెయ్యి కాఫీ రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యకరమైనది కూడా.
3. ఆకలిని తగ్గిస్తుంది
నెయ్యి ఆకలిని తగ్గిస్తుంది. అనవసరమైన ఆహార పదార్థలు తినకుండా ఉపయోగపడుతుంది.
4. జీర్ణ వ్యవస్థ బాగా పని చేస్తుంది
దయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల అసిడిటీ వస్తుంది. మీ కాఫీకి నెయ్యి జోడించడం సరైన విరుగుడు అవుతుంది. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
5. శక్తిని పెంచుతుంది
కాఫీ శక్తిని పెంచే పానీయం. కాఫీతో పాటు నెయ్యి తీసుకోవడం వల్ల నీరసమైన అనుభూతిని తగ్గించవచ్చు. మానసిక ఉత్సాహాన్నిపొందవచ్చు.
6. బరువు తగ్గడంలో కీలకపాత్ర
నెయ్యి కాఫీ బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. నెయ్యిలోని మంచి కొవ్వుకు మొండి కొవ్వును కరిగించే సామర్థ్యం ఉంది.
నెయ్యి/బుల్లెట్ కాఫీ ఎలా తయారు చేయాలి?
ముందుగా స్టౌ మీద పాత్రను పెట్టి అందులో నీళ్లు పోయాలి. కాఫీ కోసం అవసరమైన పదార్థాలను వేయాలి. కాస్త వేడి చేయాలి. కాఫీ పూర్తిగా మరగకముందే నెయ్యి, కాస్త పసుపు వేయాలి. ఈ మిశ్రమానికి మీకు నచ్చిన ఏదైనా స్వీటెనర్ ఓడించుకోవచ్చు. ఇందులో కొంచెం యాలకులను కూడా కలుపుకోవాలి. 2 నిమిషాలు వేడి చేయాలి. ఈ కాఫీ మిశ్రమాన్ని పాలతో కలపండి. నెయ్యి కాఫీ రెడీ అవుతుంది. వేడి వేడి కాఫీని తీసుకోవడం వల్ల చక్కటి అనుభూతితో పాటు ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది.
Also Read: ముక్కు నుంచి రక్తం కారుతోందా? ఇలా చేసి ఆపేద్దాం
Also read: మెరిసే జుట్టు కోసం కాఫీ ప్యాక్స్- సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు